– తన బాబాయ్ ని చంపిందిఎవరో తెలిసికూడా, చంద్రబాబు, టీడీపీపై అభాండాలువేసి, దుష్ప్రచారంచేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పటికైనా తప్పుఒప్పుకొని టీడీపీ అధినేతకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
• వివేకాహత్యకేసు దోషుల్ని శిక్షించకుండా వాళ్లుచంపారు.. వీళ్లు చంపారని దుష్ప్రచారం చేస్తూ జగన్ ఎన్నాళ్లు పబ్బం గడుపుకుంటాడు?
• జగనే మానమ్మకం..జగనే మా భవిష్యత్ అని చెప్పాల్సింది ప్రజలు కాదు.. ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, మరోచెల్లి సునీత
• తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు జగన్ కు, అని ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటే
– టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి
వివేకానందరెడ్డి హత్యకేసు వ్యవహారం క్రైమ్ థ్రిల్లర్ ను తలపించేలా రోజుకో మలుపుతిరుగు తోందని, ప్రతిపక్షనేత ఉన్నప్పుడు వివేకాను చంద్రబాబే చంపించాడని జగన్ ప్రజల్ని న మ్మించడానికి ప్రయత్నించాడని, హత్యకేసువిచారణపై సీబీఐ దర్యాప్తుకోరిన జగన్ తరువాత కోర్టులో వేసిన పిటిషన్ కూడా వెనక్కుతీసుకున్నాడని, నిన్న వై.ఎస్.భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్లో తనతల్లిని వేధించాడని, సునీల్ యాదవ్ వివేకాను చంపాడని కొత్తవాదన తెరపైకి తెచ్చారని టీడీపీఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …
వివేకా హత్యకేసుని తనస్వార్థానికి వాడుకొని, రాజకీయంగా ఎదగడానికి చంద్రబాబుపై, టీడీపీపై అభాండాలువేసిన జగన్ ఇప్పటికైనా తనతప్పు ఒప్పుకొని టీడీపీఅధినేతకు బహిరంగక్షమాపణ చెప్పాలి. “వివేకాను చంద్రబాబునాయుడే చంపించాడని, టీడీపీనేతల భాగస్వామ్యం కూడా హత్యలో ఉందని దుష్ప్రచారంచేసి, అధికారంలోకి వచ్చిన జగన్ తనబాబాయ్ ను ఎవరు హత్యచేశారో చెప్పాలి. అధికారంలోకి రావడానికి హత్యజరిగిన సమయంలో చంద్రబాబుపై జగన్ అభాండా లు వేశాడు. తనసాక్షిపత్రికలో కట్టుకథలతో, నీతిమాలిన ప్రచారం చేయించాడు. వివేకాహత్య కేసు దర్యాప్తు సిట్ వల్ల కాదని, సీబీఐతో విచారణ జరిపించాలంటూ హైకోర్టు లో పిటిషన్ వే శాడు. ముఖ్యమంత్రి అయ్యాక మరలా సీబీఐ విచారణ అక్కర్లేదంటూ పిటిషన్ వెనక్కు తీసుకున్నాడు.
చంద్రబాబు నిజాయితీపరుడైన అధికారి నేత్రత్వంలో నియమించిన సిట్ ను ముఖ్యమంత్రి హోదాలో జగన్ నీరుగార్చాడు. హైకోర్టు ఆదేశాలతో వివేకాహత్యకేసు విచారిస్తు న్న సీబీఐ అధికారుల్ని తన అధికారంతో ఇబ్బందులుపెట్టాడు. పోలీసులతో వారిపై తప్పు డుకేసులు పెట్టించాడు. చేయాల్సిందంతా చేసి, విచారణను అడ్డుకున్న జగన్, అతని బృం దం ఇప్పుడు వివేకాను సునీల్ యాదవ్ హత్యచేశాడనే కొత్తవాదన తెరపైకి తెచ్చింది. ఇవన్నీ గమనిస్తే వివేకాహత్యకు చంద్రబాబుకి, టీడీపీకి ఎలాంటి సంబంధంలేదని జగన్మోహ న్ రెడ్డి అతనిప్రభుత్వమే ఒప్పుకున్నట్టైంది. కేవలం అధికారం చేజిక్కించుకోవడానికే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై అభాండాలు వేసి, అసత్యఆరోపణలు చేశాడనికూడా తేలిపోయింది. చేసిన తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా జగన్, చంద్రబాబుకి బహిరంగక్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అత్యంత రహస్యంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపార్టీకి చెందిన ఫలానా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని కేవలం ఒక్కరోజులోనే కనిపెట్టి, వారిని శిక్షించిన జగన్, 4ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సొంత బాబాయ్ ని హత్య చేసిన వారిని ఎందుకు శిక్షించలేకపోయాడు?
వివేకా హత్యకేసు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో జగన్ కు బాగాతెలుసు. అన్నీ తెలిసే అసలు దోషుల్ని కాపాడుతున్న జగన్ నైజాన్ని ప్రజలంతా తెలుసుకోవాలి
ఏప్రియల్ నెలాఖరులోపు వివేకాహత్యకేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. మిగిలిన 18రోజుల్లో సీబీఐ వివేకాహత్యకేసు విచారణను ఎలాపూర్తిచేస్తుందో, దోషుల్ని ఎలా శిక్షిస్తుందో అనే అనుమానం తెలుగుప్రజలందరికీ ఉంది. వివేకాహత్యకేసు వెనకున్నసూత్రధారులు, పాత్రధారులు ఎవరో జగన్ కుబాగా తెలుసు. అన్నీ తెలిసి వివేకాహత్యకేసు విచారణను జగన్ ఎందుకు అడ్డుకుంటున్నాడో, తన అధికార బలంతో సీబీఐని ఎందుకు భయపెడుతున్నాడో కూడా ప్రజలకు చెప్పాలి. సొంత బాబాయ్ హత్యను రాజకీయంగా వాడుకొని లబ్ధిపొంది, దాన్ని ఇతరులపైకి నెట్టి, అసలుహంతకుల్ని కాపాడాలనిచూస్తున్న జగన్ నైజాన్ని కూడా ప్రజలు గమనించాలి.
జగనే మా భవిష్యత్.. జగనే మా నమ్మకం అనిచెప్పాల్సింది ప్రజలు కాదు.. ఆయన తల్లి విజయమ్మ.. చెల్లిషర్మిల… వివేకాకూతురు సునీత
జగనన్నే మానమ్మకం.. జగనన్నే మా భవిష్యత్ అనిచెప్పాల్సింది ప్రజలుకాదు. జగన్ తల్లి విజయమ్మ, ఆయన చెల్లి షర్మిల, బాబాయ్ కూతురు సునీతలు చెప్పాలి. వారు జగన్ నువిశ్వసిస్తున్నామని, నమ్ముతున్నామని, అతనిపై తమకు నమ్మకంఉందని, అతనే మాకు భవిష్యత్ అని చెబితే ప్రజలుకూడా సంతోషిస్తారు. రాష్ట్రం నుంచి ఉపాధికోసం తెలంగా ణకు వెళ్లిన వారినిఉద్దేశించి, అక్కడి మంత్రి హరీశ్ రావుచేసిన వ్యాఖ్యలపై జగన్ ఏం సమాధానంచెబుతాడు? ఆంధ్రావాళ్లను ఉద్దేశించి ఏపీలో ఓట్లు తొలగించుకొని తెలంగాణ లో ఓట్లు నమోదుచేయించుకోండి… ఆరాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధిలేదన్న హరీశ్ రావు వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటే. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండూ కల్లలు గానే మిగిలాయి. రెండున్నరేళ్లక్రితం కేంద్ర గ్రామీణ సడక్ యోజన పథకం కింద పులివెందుల నియోజకవర్గానికి మంజూరు అయిన రోడ్డునిర్మాణం రెండేళ్లైనా ఎందుకు పూర్తిచేయలేకపో యారు? కాంట్రాక్టర్లు ఎవరూ పనులుచేయడానికి ఎందుకు రావడంలేదు? రెండేళ్లైనా తననియోకవర్గంలో రోడ్డు వేయించుకోలేకపోవడం జగన్ చేతగానితనం.. ఈ ప్రభుత్వ అసమ ర్థత అనేచెప్పాలి. రోడ్లు వేయించలేని ముఖ్యమంత్రి, ప్రజల్ని ఉద్ధరిస్తాను.. నన్నునమ్మండి అనిచెప్పడం నిజంగా వారినిమోసగించడమే. పులివెందులనే అభివృద్ధి చేయలేని జగన్.. రాష్ట్రాన్ని అభివృద్ధిచేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారు.” అని రామ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు.