– వైసీపీ పార్టీలో కమ్మ కులస్తులు ఉంటే తప్పేంటి?
– కాంగ్రెస్ పార్టీలో కమ్మ కులానికి చెందిన నాయకులు లేరా?
– గతంలో లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చింది?
– మనం కుల సంఘం పెట్టుకున్నది సేవా కార్యక్రమాల కోసమే
– జగన్ మోహన్ రెడ్డిని విమర్శించేందుకు మీరెందుకు ముందుకు రావాలి
– ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన నాయకుడు జగన్
– వైఎస్సార్ తెచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ వల్ల ఎంతమంది కమ్మవారి పిల్లలు ఇంజనీరింగ్ లు చదువుకున్నారు
– కులం వేరు..రాజకీయం వేరు
– ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ధనేకుల రామ కాళేశ్వరరావు, ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం , తూర్పు నియోజకవర్గ 13వ డివిజన్ ఇంచార్జి మాగంటి నవీన్
విజయవాడ: సత్తెనపల్లి పర్యటనలో జగన్ మోహన్ రెడ్డి కమ్మ కులాన్ని,కమ్మ కులస్తులను పల్లెత్తుమాట అనలేదు. కమ్మ కులస్తులను దూషించలేదు. వైసీపీలో కొడాలి నాని మంత్రిగా చేయలేదా? దేవినేని అవినాష్ ,తలశిల రఘురాంకు మంత్రి పదవులు ఇవ్వలేదని ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.
కమ్మ కార్పొరేషన్ పెట్టిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. వేలమంది కమ్మ కులస్తులకు విదేశీ విద్యను అందించారు. కమ్మ కులానికి చెందిన ఆడబిడ్డలకు ఆర్ధిక సహకారం అందించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. కమ్మవారికి రాజకీయంగా అవకాశాలు కల్పించిలేదా? ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం కమ్మకులం సంక్షేమానికి పనిచేస్తోంది.
వచ్చే మహానాడు నాటికైనా ఎన్టీఆర్ కు చంద్రబాబు భారతరత్న వచ్చేలా చేయాలి. శాశ్వతంగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి.
సత్తెనపల్లి జగన్ పర్యటనలో కమ్మ కుల ప్రస్తావన వచ్చిందని నానా రాద్ధాతం చేస్తున్నారు. కుల ప్రస్తావన లేకుండానే గత ఐదేళ్లూ టిడిపి పార్టీ రాజకీయం చేసిందా? కమ్మ సంఘాలు ఉన్నది సేవా కార్యక్రమాలు చేయడానికి. రాజకీయపార్టీలను విమర్శించడానికి కాదు. కమ్మ కులం వాళ్లంతా ఒకే పార్టీలో ఉండాలని గతంలో ఒత్తిడి రాలేదా? మేం అనేక మార్లు అలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నాం.
వైసీపీ పార్టీలో కమ్మ కులస్తులు ఉంటే తప్పేంటి? కాంగ్రెస్ పార్టీలో కమ్మ కులానికి చెందిన నాయకులు లేరా? గతంలో లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చింది? వైఎస్సార్ సమయంలో కమ్మ కులస్తులకు న్యాయం జరగలేదా? మనం కుల సంఘం పెట్టుకున్నది సేవా కార్యక్రమాల కోసమే. జగన్ మోహన్ రెడ్డిని విమర్శించేందుకు మీరెందుకు ముందుకు రావాలి.
జగన్ మోహన్ రెడ్డి వెంట కమ్మ కులస్తులు ఉంటే తప్పేంటి? కమ్మవారు అన్ని పార్టీల్లో ఉంటేనే మన వర్గానికి మేలు జరుగుతుంది. వైసీపీ హయాంలో దేవినేని అవినాష్ 800 కోట్లతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. తూర్పు నియోజకవర్గంలో కమ్మవారి ప్రాబల్యం ఉన్న డివిజన్లు బాగుపడలేదా?
వైఎస్సార్ తెచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ వల్ల ఎంతమంది కమ్మవారి పిల్లలు ఇంజనీరింగ్ లు చదువుకున్నారు. ఎంతమంది విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. కులం వేరు..రాజకీయం వేరు. రాజకీయాలతో మన కులాన్ని ముడి పెట్టకండి.