వసూల్ రెడ్డి గారు నిద్రలేచేది ఎప్పుడు?

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
వసూల్ రెడ్డి గారు నిద్రలేచేది ఎప్పుడు? పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఆపేది ఎప్పుడు? కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై రూ.12 తగ్గించాయి. అస్సోం, గోవా, త్రిపుర, మణిపూర్, కర్ణాటక ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై రూ.7 తగ్గించాయి. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్ పై రూ.6.07 , డీజిల్ పై రూ.11.75 తగ్గించింది. గుజరాత్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించడానికి నిర్ణయించింది. కేంద్రం, ఇతర రాష్ట్రాలన్నీ తగ్గించినా వసూల్ రెడ్డి గారికి మాత్రం పెట్రోల్, డీజిల్ పై పన్నుల భారం తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి మనస్సు రావడం లేదు. నిత్యావసరాలు, కరెంట్, ఆస్తిపన్ను, చివరికి చెత్తపైనా పన్నులేసిన మీ బాదుడుకి జనజీవితాలు అగమ్యగోచరమయ్యాయి. దేశమంతా పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తున్న నేపథ్యంలో జనంపై వసూల్ రెడ్డి కరుణ చూపాలని కోరుతున్నాను.