డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నచోట పెన్షన్ 600 రూ. లే

-దేశంలో 2016 రూ పెన్షన్ ఇస్తూన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
-45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇందుకు ఏటా 12 వేల కోట్లు
-కొద్ది రోజుల్లో మరో 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి
-డీఎస్సీ సహా 9 వేల గ్రూప్ -4 ఉద్యోగాలకు అనుమతి
-సంగారెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు

భారత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 2016 రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదు. తెలంగాణలో అది సీఎం కేసీఆర్ గారు మాత్రమ 2016 పెన్షన్ ఇస్తున్నరు గతాన్ని మనం గుర్తు చేసుకోవాలి. టీడీపీ హయంలో 75 రూపాయలు ఇచ్చారు. కొత్త పెన్షన్ అడిగితే ఊళ్లో ఎవరన్నా చనిపోతే ఆ పెన్షన్ మీకు ఇస్తమని చెప్పేవారు. కాంగ్రెస్ హయంలో 200రూపాయల పెన్షన్ మాత్రమే.

కానీ తెలంగాణ వచ్చాక,సీఎం గారు మాకు అధికారం ఇస్తే 200 పెన్షన్ ను వేయి రూపాయలు చేస్తమన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వేయి రూపాయలు చేసినం. మళ్లీ అధికారం వస్తే 2016 రూపాయలు చేస్తమని కేసీఆర్ గారు చెప్పి మాట తప్పకుండా వేయి రూపాయల పెన్షన్ ను 2016 పెంచారు.

సంగారెడ్డికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్ , కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కదా అక్కడ ఉన్నది. డబుల్ ఇంజన్ ప్రభుత్వం. ఢిల్లీలో, కర్ణాటకలో బీజేపీనే కదా. అక్కడ ఇచ్చే పెన్షన్ కేవలం 600 రూ మాత్రమే. 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తమని చెప్పారు కేసీఆర్ గారు.కాని కరోనా వల్ల కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు 57 ఏళ్ల వారికి పెన్షన్లు ఇస్తున్నం.

తెలంగాణ వచ్చాక సంగారెడ్డిలో లక్షా 5వేల పెన్షన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మరో 66 వేల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసినం. ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు, బీడీ కార్మికులు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం లేదు. కాని కేసీఆర్ గారు వారికి పెన్షన్లు ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో 25 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తే, తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారు 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నరు. ఏడాదికి 12 వేల కోట్లు నెలకు వేయి కోట్లు ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వ ఖర్చు చేస్తోంది.
పేదవాడికి పది కేజీల బియ్యం, 2016 పెన్షన్ ఇచ్చేది వారు ఆత్మగౌరవంగా బతకడానికి. కాని బీజేపీ ఎమంటోంది. ఉచితాలు అనుచితమని అంటోంది. బడా కంపెనీలకు 12 లక్షల కోట్లు ఖర్చు చేసిన బీజేపీ ప్రభుత్వం, రెక్కాడితే డొక్కాడని పేదలకు పెన్షన్లు ఇస్తే ఉచితాలు, అనుచితమని అంటోంది.

బీజేపీ ఎం చేసింది. నాలుగొందలున్న గ్యాస్ సిలిండర్ ధరను 1200 కు పెంచింది. పెట్రోల్,డిజీల్ ధరలు పెంచింది. టీఆర్ఎస్ పేద ప్రజలకు పంచే కార్యక్రమం పెడితే,బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్లకు లక్షల కోట్లు పంచి పెడుతుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల సాయం ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు కాన్పుకెళితే 12 వేల రూపాయల సాయం, కేసీఆర్ కిట్, మంచి బోజనం పెట్టి, ఆటో కిరాయి ఇచ్చి ఇంటి దగ్గర దింపుతున్నం. ఇలా సంగారెడ్డిలో ప్రతీ నెల ప్రభుత్వ ఆసుపత్రిలో 800 కాన్పులు జరుగుతున్నయి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నం. రైతు బీమా, రెండు పంటలకు పది వేల రైతు బంధు సాయం, అఁదిస్తున్నం. గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఇంతకు ముందే నోటిఫికేషన్లు ఇచ్చినం. ఇప్పుడు గ్రూప్-2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి అనుమతులిచ్చినం. రాబోయే 2-3 రోజుల్లో 9 వేల గ్రూప్ -4 ఉద్యోగాలకు అనుమతి ఇవ్వనున్నాం.

91 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. 52 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులిచ్చినం. రాబోయే కొద్ది రోజుల్లోనే మిగతా 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులు . అందులో డీఎస్సీ, గ్రూప్-4 ఉద్యోగాలు ఉన్నాయి. వందకు వంద శాతం ఉద్యోగాలు భర్తీ చేస్తాం. లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినం. 11 వేల కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ చేస్తం. మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. మొత్తం మీద 2 లక్షల 10 ఉద్యోగాలు ఇస్తున్నం.

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏం చెప్పింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తమంది. అంటే 8ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతుంది. ఆ పార్టీకి సరైన గుణపాఠం నేర్పాలి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ రాజహర్ష, జిల్లా పరిషత్ ఛైర్మన్ మంజు శ్రీ, జైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డీసీఎంస్ ఛైర్మన్ శివకుమార్,సీడీఎస్ ఛైర్మన్ బుచ్చి రెడ్డి తదితరులు పెర్కొన్నారు.

Leave a Reply