మా నాయకుడికి అవినీతి బామ్మర్ధులు లేరు

– గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో నాలుగు సంక్షేమ పథకాలు సంచిలో..నాలుగు పాంప్లేట్ లు చేతిలో
– మీడియా సమావేశంలో కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి సంచలన వాఖ్యలు

మైలవరం నియోజకవర్గంలో అక్రమాలు చేయడానికి మా నాయకుడు దేవినేని ఉమామహేశ్వర రావుకు అవినీతి బామ్మర్థులు లేరని కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను ఉద్దేశించి అవినీతి ఆరోపణలు గుప్పించారు.

కొండపల్లి లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బామ్మర్ది , అనుచరులు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నట్లు ఆరోపించారు.. మట్టి,

ఇసుక, బూడిద అయిపోయాయని ఇప్పుడు బార్లు పై కన్నేసిన బామ్మర్ది రౌడీ రాజకీయాన్ని ఎమ్మెల్యే వసంత ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పై వైసీపీ నేతలు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మైలవరం లో జరుగుతున్న గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమానికి అశేష జనాదరణ లభిస్తుందని ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎం ఒరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సంక్షేమ పథకాలు సంచి లో వేసుకొని నాలుగు పాంప్లెట్ పేపర్ లతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఎద్దేవా చేశారు.. మైలవరం లో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు ప్రజల్లో వ్యతిరేకత ఉందని తేల్చి చెప్పారు.. ఇబ్రహీంపట్నం మండల టిడిపి లో రామీనేని రాజ ఒక మచ్చ లేని నాయకుడని అవినీతి చేయాల్సిన అవసరం టిడిపి నేతలకు లేదని ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వాఖ్యలు చేశారు.