– తప్పులు చేస్తున్న కేసీఆర్ ను దేనితో కొట్టాలి?
– రైతులను మోసం చేసిన కేసీఆర్ ను ఏ చెప్పులతో కొట్టాలి?
– కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ గ్రామం లో రైతు గోస ధర్నా లో పాల్గొన్న వైఎస్ షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై షర్మిల మరోసారి మాటలదాడి చేశారు. టీఆర్‌ఎస్‌ను ఎవరైనా అంటే వరికంకులతో కొట్టాలన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలపై షర్మిల విరుచుకుపడ్డారు. అలాగయితే సీఎం కేసీఆర్‌ను చీపుర్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. షర్మిల ఏమన్నారంటే.. పల్లా రాజేశ్వర రెడ్డి ఒక mlc ఉన్నాడు. వరి ధాన్యం కొంటున్నం కదా అని ఎవరు మాట్లాడకూడదు అంటున్నాడట.
టీఆర్ఎస్ ని ఏమైనా అంటే, వరి కంకులతో కొట్టమని చెప్పాడు అంట. తప్పులు చేస్తున్న కేసీఆర్ ను దేనితో కొట్టాలి? 17 లక్షల ఎకరాల్లో ధాన్యం వేయనీయనందుకు కేసీఆర్ ను ఏ చీపురు తో కొట్టాలి? రైతులను మోసం చేసిన కేసీఆర్ నీ ఏ చెప్పులతో కొట్టాలి? స్థానిక ఎమ్మెల్యే కొడుకు చేసిన అరాచకం కి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎమ్మెల్యే మీద ఆమె కొడుకు మీద చర్యలు తీసుకోనందుకు మిమ్మలిని ఏ చీపురు తో కొట్టాలి?