Suryaa.co.in

Andhra Pradesh

మోడీతో బాబుది సక్రమ సంబంధం అయితే… జగన్‌ది అక్రమ సంబంధం

– విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన లేదు
– ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు గురించి మాట్లాడలేదు
– కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు
– రాజశేఖర్ రెడ్డి వారసుల్లో బీజేపీని వ్యతిరేకిస్తుంది నేను మాత్రమే
– అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి
– రాజీనామా చేయకుంటే ప్రధాని మోడీ అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి
– జై బాపూజీ, జై భీం, జై సంవిధాన్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

విశాఖపట్నం: ఏపీ ప్రజలను ప్రధాని మోడీ దారుణంగా వెన్నుపోటు పొడిచారు. హోదా ఇస్తామని మోసం చేశారు. మొన్న మోడీ విశాఖ వచ్చినప్పుడు కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన లేదు. ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదు. ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు గురించి మాట్లాడలేదు. కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు.

అలాంటి పార్టీతో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇదెక్కడి న్యాయం. ఏపీ ప్రజలను దారణంగా మోసం చేసిన మోడీతో చంద్రబాబుది సక్రమ సంబంధం అయితే… జగన్‌ది అక్రమ సంబంధం. బడుగు బలహీన వర్గాల ఓట్లుతో గెలిచిన జగన్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను గంగలో కలుపుతున్నారు. రాజశేఖర్ రెడ్డి మతతత్వ బీజేపీని నిరంతరం వ్యతిరేకించారు.
ఆయన వారసులమని చెప్పుకునే జగన్ బీజేపీతో ఎందుకు కొమ్ముకొస్తున్నారు? రాజశేఖర్ రెడ్డి వారసుల్లో బీజేపీని వ్యతిరేకిస్తుంది నేను మాత్రమే. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం. పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ గురించి హేళన గా మాట్లాడారు. అంబేద్కర్ పేరును ఫ్యాషన్ అంటూ అవమానించారు.
సభలో అంబేద్కర్ పేరు చెప్పగానే బీజేపీ ఎంపీలు నవ్వుతున్నారు. అంబేద్కర్ జపం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భారత రాజ్యాంగం రాసింది అంబేద్కర్. ఆయన రాసిన రాజ్యాంగం ఇవ్వాల్టికి మనకు శాసనం. మనకు ప్రజాస్వామ్యం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. మన ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు. సమానంగా,స్వేచ్చగా, సగౌరవంగా బ్రతుకుతున్నారు అంటే రాజ్యాంగం కల్పించిందే.
మేము ఎప్పుడు అంబేద్కర్ జపం చేస్తాం. మీరు జపం చేయడానికి వచ్చిన కష్టం ఏంటి? అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగు నింపారు. అంటరానితనం నిర్మూలన పై అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు. బీజేపీ హేళన విధానాలను దేశం గమనిస్తుంది. బీజేపీ రాజ్యాంగాన్ని హేళన చేస్తుంటే రాష్ట్ర ఎంపిలు మౌనం గా ఉన్నారు. టీడీపీ,వైసిపి,జన సేన ఎంపిలు మౌనం వహించారు.
ఏపిలో దళిత బిడ్డలను అవమానించారు.ఈ దేశ సంపదను అదానీ కి మోడీ కట్టబెడుతున్నారు. దోచుకోవడం దాచుకోవడం మోడీ సిద్ధాంతం. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ రాష్ట్రంలో షర్మిలా రెడ్డి మాత్రమే పోరాటం చేస్తుంది. మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం.
కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి. బీజేపీ అధికారంలో అంటే దేశాన్ని అమ్మేస్తారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయకుంటే మోడీ వెంటనే అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి.

అంబేద్కర్ ను బీజేపీ అవమానించింది: మణిక్కం ఠాగూర్
పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ ను బీజేపీ అవమానించింది. నిండు సభలో అంబేద్కర్ కి అవమానం జరిగితే వైసిపి, టీడీపీ,జనసేనా ఎంపీలు మౌనం వహించారు. బీజేపీ కి రాజ్యాంగం అంటే గౌరవం లేదు. బీజేపీ విధానాలను ఎండగడతాం.

LEAVE A RESPONSE