Suryaa.co.in

Telangana

ప్రధాని తెలంగాణ పర్యటనపై ప్రశ్నించేందుకు కేటీఆర్ ఎవరు?

-మీ ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలకు, రబ్బర్ స్టాంపుల గవర్నర్ పనిచేయాలా…?
– ప్రధాని మోదీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్

మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని, అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్, కేటీఆర్ లా ప్రధానిని ప్రశ్నించేది?దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి అంటూ దగా చేసిన మీరా… మోదీని ప్రశ్నించేది?ఏపీతో కుమ్మక్కై, కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు సంతకం చేసిన మీరా… కృష్ణా జలాల్లో వాటాపై ప్రశ్నించేది?మీ నిర్వాకం వల్లే.. 575 టీఎంసీలు రావలసినచోట, 299 టీఎంసీలు వస్తున్నాయి.

మీరు చేసిన తప్పిదం వల్లనే… తెలంగాణ ఏడాదికి 150 టిఎంసి ల నుంచి 175 టీఎంసీలు నష్టపోతోంది
కేవలం మీ వల్లనే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు తీరని నష్టం వాటిల్లింది.మీరు చేసిన తప్పును ఒప్పుకుని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ,ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేస్తున్నాం.పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో.. పొలిటికల్ జిమ్మిక్కు చేస్తూ, పాలమూరు ప్రజలను పచ్చిగా దగా చేస్తున్నారు.నార్లాపూర్ రిజర్వాయర్లో 9 మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉంటే.. కేవలం ఒక్క మోటార్ తో ట్రయల్ రన్ చేసి, మొత్తం ప్రాజెక్టును పూర్తి చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు.

కేటీఆర్… మాటలు జాగ్రత్త, మా అధ్యక్షుడు కిషన్ రెడ్డిని విమర్శిస్తావా? తెలంగాణకు ట్రైబల్ మ్యూజియం, సైనిక్ స్కూల్ మంజూరు చేయించిందే కిషన్ రెడ్డి.తెలంగాణ ట్రైబల్ మ్యూజియం, సైనిక్ స్కూలు, ఎంఎంటిఎస్ లను మంజూరు చేసినా… రాష్ట్ర వాటా కింద భూమి ఇమ్మంటే ఇవ్వరు.

రీజినల్ రింగ్ రోడ్డులో రైల్వే లైన్ కోసం ప్రధానిని ఒప్పించి, సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించింది కిషన్ రెడ్డి కాదా? నిజంగా కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే… రీజినల్ రింగ్ రోడ్డు కు సమాంతరంగా, రైల్వే లైన్ కోసం భూమి కేటాయించాలి.ఎం ఎం టి ఎస్ కు రాష్ట్ర వాటా చెల్లించరు. అయినా కేంద్రం నిధులతోనే రెండవ ఫేజ్ ను పూర్తి చేశాం. దీనిలో కిషన్ రెడ్డి కృషి లేదా కేటీఆర్?హైదరాబాద్కు సైన్స్ సిటీ మంజూరు చేయిస్తే భూమి కేటాయించమంటే మాత్రం కేటాయించరు. తమ దోస్త్ పార్టీ అయినా కాంగ్రెస్ కు మాత్రం 10 ఎకరాల భూమి కేటాయిస్తారు.

బీసీ వ్యతిరేకి బిజెపి అంటున్న ఎమ్మెల్సీ కవితకు… బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించింది బిజెపి అన్నది తెలియదా?బిజెపిలో ప్రధానమంత్రి అయ్యింది ఒక బీసీ. మరి మీ పార్టీలో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయగలరా?కేంద్రంలో 27 మంది బీసీ కేంద్రమంత్రులు ఉంటే… మీ నాన్న కేబినెట్ లో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారో చెప్పగలరా కవితగారు?

బీసీల అభ్యున్నతి కోసం విశ్వకర్మ పథకాన్నిమోడీ ప్రకటించిన విషయం తెలియదా కవిత గారు?17 సార్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించలేని మీ అసమర్థ ప్రభుత్వమా… మా ప్రధానిని ప్రశ్నించేది?అర్హత లేని వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మీరు ప్రతిపాదిస్తే… వారిని నిబంధనల ప్రకారం గవర్నర్ గారు రిజెక్ట్ చేస్తే… గవర్నర్ గారికి రాజకీయాలు ఆపాదిస్తారా?మీ ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలకు, రబ్బర్ స్టాంపుల గవర్నర్ పనిచేయాలా…?రాజ్యాంగానికి లోబడే గవర్నర్ గారు పనిచేస్తున్నారు.

తెలంగాణ సొత్తు దోచుకున్న మీ కుటుంబం… ప్రజలను మాత్రం బికారీలను చేసింది. దోచుకోవడం, దాచుకోవడం తప్ప… అభివృద్ధి అంటే ఏంటో తెలియని మీరా… మా ప్రధానిని ప్రశ్నించేది?తెలంగాణ అభివృద్ధి కోసం 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది.
మీ పిచ్చివాగుడు, వెకిలి చేష్టలకు త్వరలోనే తెలంగాణ ప్రజానీకం గుణపాఠం చెబుతుంది.

LEAVE A RESPONSE