Suryaa.co.in

Features

బ్రహ్మకుమారీలు హిందువులకు ఎందుకు వ్యతిరేకం?

(పోలిశెట్టి)

బ్రహ్మకుమారిస్ ఏయే విధాలుగా హిందువులకు వ్యతిరేకమో తెలిపే కొన్ని విషయాలు:

బొట్టు పెట్టుకోకూడదు
ఆలయాలలో ప్రసాదం తినకూడదు
పెళ్ళి చేసుకోరాదు. చేసుకున్నా పిల్లల్ని కనరాదు
భర్త జీవించి వున్నాసరే స్త్రీలు తెల్లని చీరలు మాత్రమే ధరించాలి
ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్లకు పెళ్ళి చేయకుండా ఆ సంస్థ సభ్యులుగా మార్చాలి
భార్య భర్తను అన్నా అని; భర్త భార్యను అక్కా అని పిలుచుకోవాలి. కొంతమంది రాఖీలు కూడా కట్టుకోవడం విడ్డూరం
శ్రీకృష్ణుడు గీత చెప్పలేదు అంటారు
హిందూ దేవతలను కేవలం సామాన్య మనుష్యులుగానే భావించాలి
శివలింగం పైన ఒక ఎఱ్ఱటి బల్బు పెట్టి దానిని మాత్రమే పూజించాలి
ఎటువంటి గ్రంథ ప్రమాణం లేని వ్యాఖ్యానాలు బోధనలు వారి అజెండా
వ్యాసుడు, వశిష్ఠుడు లాంటి ఋషులు అజ్ఞానులు; జీసస్ మరియూ ప్రవక్త లాంటి వారు ధర్మాత్ములు అంటారు
చర్చి మరియు మసీదులకు వెళ్లే వారికి జ్ఞానాన్ని బోధించరాదు
ఆలయాల్లో స్టాల్స్ పెట్టి అందరికీ దేవుడు ఒక్కడే అని చెప్పాలి.
ఇస్లాం మతం చెప్పినట్టు సృష్టిని కాదు సృష్టికర్తను పూజించండి అంటారు.
హిందువులను మాత్రమే టార్గెట్ గా పెట్టుకొని, హిందువులను నిర్వీర్యం చేసి ఇతర మతాలకు సహాయము చేసే అనేక వ్యవస్థల్లో వీళ్ళు కూడా ఒకరు.
అసలు ఈ సంస్థ ఎప్పుడు ఏ ఉద్దేశ్యంతో ఏర్పడింది అనేది కూడా తెలుసుకోవలసిన విషయం.

ఈ సంస్థ 1935 ప్రాంతంలో ప్రస్తుతం పాకిస్టాన్ లో ఉన్న హైదరాబాద్ ప్రాంతం (అనగా సింధ్ ప్రాంతం)లో ప్రారంభమయ్యింది.

సింధ్ ప్రాంత ఉపఖండంలో స్త్రీలపై పురుషుల ఆధిపత్యాన్ని నేరుగా సవాలు చేయడానికి ‘బ్రహ్మచర్యాన్ని’ ఆయుధంగా చేసుకొని పితృస్వామ్య నియంత్రణ కోసం ఈ సంస్థ ప్రారంభించబడినది.

స్త్రీలు బ్రహ్మచారిణులుగా ఉండేందుకు, ప్రత్యేకించి వివాహంలో తమ హక్కును నొక్కిచెప్పేందుకు వారికి అధికారం కల్పించడం అనేది ప్రధాన అంశం.

కానీ ఇప్పుడు అది ఏ విధంగా పరిణమించింది అంటే, తమ స్వంత ఇంట్లో మగవారి ఆధిపత్యాన్ని సహించలేక బయటివారి (ఆ మత గురువులు, వగైరా) వారి ఆధీనంలో ఆశలు, కోర్కెలు చంపుకొని బ్రతికేవారిగా ఆడవారిని తయారుచేసే విధంగా తయారు చేసింది.

కేవలం ఆడవారి (కుమారీలు) కోసం ప్రారంభింపబడిన ఈ సంస్థ మగవారికి కూడా స్థానం కల్పిస్తూ సంస్థ పేరును ‘ఓం శాంతి’గా రూపం మార్చుకొంది.

ఈ సంస్థ వ్యస్థాపకుడు ‘లేఖరాజ్ కృపలానీ’.

ప్రస్తుతం కడుపు కాలేవాడు, హిండుత్వంపై ఏకారణంగానైనా కడుపు మండినవారు చేరే మతంగా మాత్రమే మిగిలిపోయింది ఈ సంస్థ. అలాంటివారిని ఎరవేసి పట్టడమే అందులో చేరిన వారి పని.

 

LEAVE A RESPONSE