తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
వైసీపీ నాలుగేళ్ళ పాలనలో రాష్ర్టంలో జరిగిన అభివృద్ధి ఏంటో మంత్రి ఉష శ్రీ చరణ్ చెప్పాలి.గ్రామాల్లో నిజంగా అభివృద్ధి జరిగేతే గడప గడపకు వెళ్లిన వైసీపీ నేతలపై ప్రజలు చెప్పు లెందుకు విసురుతున్నారు ? పంచాయతీల నిధులు దారి మళ్లిoచడం తప్ప గ్రామాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి?కళ్యాణదుర్గంలో దళితుల భూములు గుంజుకున్న నీకు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే నైతిక విలువ లేదు. దోచుకో, పంచుకో, తినుకో అనేది జగన్ రెడ్డి సిద్దాంతం. తన అవలక్షణాలను ఎదుటి వారిపై రుద్దటంలో జగన్ సమర్థుడు. ఎన్నికలముందు స్టంట్లు వేయడం, బాబాయిని చంపి ఇంటి ముందు టెంట్ వేయడం వైసీపీకే అలవాటు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని ఉష శ్రీ చరణ్ కి ముందే తెలుసు, వైసీపీని వీడే మంత్రుల జాబితాలో ఉషశ్రీ చరణ్ ముందు వరుసలో ఉన్నారు.