విరాళాలిచ్చే కంపెనీలకే నీ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, ఇతరత్రా ప్రయోజనాలు ఎందుకు దక్కుతున్నాయి?
– టీడీపీతో పోలిస్తే సగంకూడా కార్యకర్తలు లేని వైసీపీ విరాళాల సేకరణలో జాతీయస్థాయిలో 5 వస్థానంలో, ప్రాంతీయంగా అగ్రస్థానంలో ఎలా నిలిచిందో చెప్పగలవా జగన్ రెడ్డి?
– ఇది క్విడ్ ప్రోకో కాదా జగన్ రెడ్డి?
• తెలుగుదేశం పార్టీ పుట్టుక.. వైసీపీ మాదిరిగా అవినీతి నుంచి..అక్రమార్జన నుంచి జరిగింది కాదు. ప్రజలసొమ్ము కొట్టేసిన వారి మధ్ధతుతో టీడీపీ పుట్టలేదు
• రాష్ట్రవ్యాప్తంగా 1300 బ్యాంక్ ఖాతాల ద్వారా, 60లక్షలకు పైగా క్రియాశీల సభ్యులైన కార్యకర్తల ద్వారా పార్టీకి సభ్యత్వరుసుముల రూపంలో నిధులు వచ్చాయి.
• తప్పుడు సమాచారంతో.. అటున్యాయస్థానాల్ని, ఇటు ప్రజల్ని నమ్మించేందుకు జగన్ రెడ్డి తాపత్రయపడుతున్నాడు
• ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా టీడీపీకి వచ్చిన విరాళాల సొమ్ముని అవినీతి సొమ్ము అని చెప్పడం జగన్ రెడ్డి లాంటి అవినీతి పరుడికే చెల్లింది
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెల్ కంపెనీలు.. క్విడ్ ప్రోకో..ఇన్ సైడ్ ట్రేడింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జగన్ రెడ్డి… అవినీతి నుంచి పుట్టిన అతని పార్టీ, అవినీతి దోపిడీల కలయికగా నడుస్తున్న సాగుతున్న అతని ప్రభుత్వం… చంద్రబాబునాయుడిపై టీడీపీ పై బురదజల్లడం సిగ్గు చేటని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయడు ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుంచి టీడీపీకి వచ్చిన విరాళాల సమాచారం సేకరించి, ఆ సొమ్ముని అవినీతి సొమ్ముగా చిత్రీకరించే ప్రయత్నంచేస్తూ, ప్రజల్ని నమ్మిం చేందుకు.. న్యాయస్థానాల్ని మోసగించేందుకు జగన్ రెడ్డి తాపత్రయపడుతున్నాడు
“ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో.. మొత్తంగా ఆ ప్రాజెక్ట్ అమల్లో నాటి టీడీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రూ.3,300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని నిన్నటి వరకు దుష్ప్రచారం చేసిన జగన్ రెడ్డి అతని ప్రభుత్వం.. నేడు రూ.27 కోట్ల అవినీతి జరిగిందని న్యాయస్థానాల్లో చెప్పే దుస్థితికి వచ్చాయి. చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపి 28 రోజులైనా ఆయనపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేక, చివరకు దిక్కుతోచని స్థితిలో పడిన జగన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతిసొమ్ముగా చూపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతగా దిగజారిన ఈ ముఖ్యమంత్రిని అతనికి ఊడిగం చేస్తున్న విచారణ సంస్థల్ని ఏమనాలి?
దేశంలోని రాజకీయపార్టీలకు ఆ పార్టీ విధానాలు.. పద్ధతులు నచ్చిన వ్యక్తులు.. సంస్థలు.. వ్యవస్థలు విరాళాలు ఇవ్వడం అనేది ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయ మే. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నచ్చిన పార్టీలకు విరాళాలు ఇస్తుంటారు. ఆ బాండ్స్ ద్వారా వచ్చే సొమ్ము వివరాలను అన్ని రాజకీయపార్టీలు ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్ని కల సంఘం ముందు ఉంచుతాయి.
అలానే కార్యకర్తల సభ్యత్వాల ద్వారా వచ్చేరుసు ము.. చెక్కులు.. నగదు రూపంలో వచ్చే సొమ్ము వివరాలను కూడా అన్ని పార్టీలు బహిర్గతం చేస్తుంటాయి. అలా వచ్చిన సొమ్ముని స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో జరిగిన అవినీతిసొమ్ముగా చూపే పరిస్థితికి ఈ ప్రభుత్వం.. ఈ ముఖ్యమంత్రి వచ్చారం టే చివరకు వీళ్లు ఎంతగా దిగజారారో ప్రజలు అర్థం చేసుకోవాలి.
జిందాల్ స్టీల్స్.. మెగా ఇంజనీరింగ్ కంపెనీ.. హెటిరో డ్రగ్స్.. వైసీపీ ఎంపీ.. ఎమ్మెల్యేలు ప్రుడెంట్ ట్రస్ట్ కు చేసిన చెల్లింపులపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు?
2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపనుల్ని రద్దుచేసి, రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి మెగా సంస్థకు పనులు అప్పగించాడు. పనులు పొందిన మెగా ఇంజనీరింగ్ సంస్థ 2020-21 లో ప్రుడెంట్ ఎలక్ట్రాల్ ట్రస్ట్ కు రూ.22కోట్లు చెల్లించి, దాని ద్వారా వైసీపీకి విరాళంగా అందచేసింది. అంటే పోలవరం పనులు దక్కించుకున్నందుకు క్విడ్ ప్రోకో భాగంగా మెగా సంస్థ సొమ్ములు జగన్ రెడ్డి పార్టీకి చేరవేసింది నిజం కాదా?
దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు? జిందాల్ స్టీల్స్ సంస్థ 2020-21లో ప్రుడెంట్ ట్రస్ట్ కు రూ.13 కోట్లు చెల్లించింది. దానికి ప్రతిఫలంగా వైసీపీప్రభుత్వం జిందాల్ స్టీల్స్ సంస్థకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కడప ఉక్కు ఫ్యాక్టరీ కట్టబెట్టింది. ఈ విధంగా ఇచ్చిపుచ్చుకోవడాన్ని క్విడ్ ప్రోకో అనక ఏమంటారో ముఖ్యమంత్రి చెప్పాలి.
విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎం.వీ.సత్యనారాయణ గతంలో మొత్తం రూ.11కోట్లను రెండు దఫాల్లో ప్రుడెంట్ ట్రస్ట్ కు విరాళంగా అందించారు. ఆనాడు సత్యనారాయణ ఆ మొత్తం ఇవ్వబట్టే… నేడు జగన్ రెడ్డి అతనికి విశాఖపట్నంలో దోచుకునే అవకాశం కల్పించారు. హెటిరో డ్రగ్స్ సంస్థకు విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లిలో ఉన్న భూము లకు సంబంధించిన సమస్యను వైసీపీ ప్రభుత్వం చక్కబెట్టింది. అందుకు కృతజ్ఞతగా ఆ సంస్థ, ప్రుడెంట్ ఎలక్ట్రాన్ ట్రస్ట్ కు రూ.10కోట్లు విరాళంగా అందించింది.
గుంటూరు, విశాఖపట్నంలో శుభగృహ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు గతంలో వైసీపీకి రూ.1.35కోట్లు విరాళంగా ఇచ్చింది నిజంకాదా? దానికి ప్రతిగా జగన్ రెడ్డి అతనికి ఇసుక రీచ్ లు కట్టబెట్టింది వాస్తవం కాదా? ఈ విధంగా లెక్కాపత్రం లేకుండా తనపార్టీకి వస్తున్న విరాళాలపై.. అవి అందిస్తున్న వ్యక్తులు… సంస్థలపై జగన్ రెడ్డి నోరు విప్పగలడా?
తెలుగుదేశం పార్టీ … వైసీపీలా అవినీతి, అక్రమార్జన నుంచి పుట్టలేదు
తెలుగుదేశం పార్టీ పుట్టుక.. వైసీపీ మాదిరిగా అవినీతి సొమ్మునుంచి..అక్రమార్జన నుంచి.. ప్రజలసొమ్ము కొట్టేసిన వ్యక్తుల మధ్ధతుతో టీడీపీ పుట్టలేదు. తెలుగుదేశం పార్టీలో చేరే ప్రతి ఒక్కరూ నిర్ణీత సభ్యత్వ రుసుము చెల్లించాకే పార్టీలో చేరతారు. అలా చెల్లించేందుకు సభ్యతరుసుముగా తొలుత పదిరూపాయలు నిర్ణయిస్తే..నేడు అది వంద రూపాయలు అయ్యింది. క్రియాశీలక సభ్యత్వం పొందాలనుకునే సభ్యులు ఎవరై నా తెలుగుదేశం పార్టీకి రూ.100లు చెల్లించాల్సిందే.
అలా 2014-16 మధ్యకాలంలో 52లక్షలమంది క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే, తద్వారా రూ.52కోట్ల సొమ్ము తెలు గుదేశం ఖాతాలోకి వచ్చింది. 2016-17లో మరలా సభ్యత్వాల రెన్యువల్ ద్వారా 60 లక్షల మంది సభ్యులుగా చేరితే, పార్టీకి రూ.60కోట్లు వచ్చాయి. అలానే 2017-18లో పార్టీలో క్రియాశీలసభ్యులుగా చేరిన వారి ద్వారా రూ.కోటి70లక్షలు పార్టీకి వచ్చాయి. 2018-19లో ఆ విధంగానే పార్టీకి రూ.43లక్షలు వచ్చాయి.
ఈ విధంగా వచ్చిన నిధులన్నీ పార్టీ కార్యకర్తలు సభ్యత్వనమోదుకు చెల్లించిన రుసుము రూపంలో వచ్చిన వే. ఈ విధంగా ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ అకౌంట్ కు వచ్చిన సొమ్ము మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1300 బ్యాంక్ ఖాతాల ద్వారా, పారదర్శకంగా రావడం జరిగింది. ఇంత స్పష్టంగా, బహిరంగంగా కార్యకర్తల నుంచి పార్టీకి వచ్చిన సొమ్ముని జగన్ రెడ్డి.. అవినీతి సొమ్ముగా చూపే ప్రయత్నం చేస్తున్నాడంటే.. అతన్ని ఏమనాలి?
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల సభ్యత్వాల ద్వారా వచ్చే సొమ్ము తప్ప ఇతరమార్గాల్లో ఎక్కడా ..ఎప్పుడూ ఒక్కరూపాయి కూడా రాలేదు. 2018లో పాలకొల్లు నియోజకవ ర్గంలో లక్షా03వేల మంది తెలుగుదేశం పార్టీ క్రియాశీలసభ్యత్వం తీసుకుంటే, రూ.కోటి03లక్షలు నేనే స్వయంగా టీడీపీ అకౌంట్ కు పంపించాను. ఇలా ఆంధ్రాతో పాటు తెలంగాణ నుంచి తెలుగుదేశంపార్టీకి వచ్చే విరాళాలపై తప్పుడు లెక్కలు చెప్ప డం ఈ అవినీతి ముఖ్యమంత్రికి, దోపిడీ ప్రభుత్వానికే చెల్లింది.
వైసీపీప్రభుత్వానికి.. ముఖ్యమంత్రికి అంటే మతిలేదు. కానీ ఏఏజీగా (అడిషనల్ అడ్వకేట్ జనరల్) ఉన్న వ్యక్తే న్యాయస్థానాలను తప్పుపట్టేలా వ్యవహరించడాన్ని ఏమనాలి? పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వ న్యాయవాదిగా, ప్రభుత్వం నుంచి ప్రజలసొమ్ముని జీతం తీసుకుంటున్నారు గానీ..వైసీపీ నుంచి.. జగన్ రెడ్డి నుంచి జీతం తీసుకోవడంలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రభుత్వం చేసిన విచారణ..సేకరించిన ఆధారాలను న్యాయస్థానాల ముందుఉంచాలిగానీ…. ఇలా ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ నుంచి తీసు కున్న సమాచారంతో ప్రజల్ని, న్యాయమూర్తుల్ని తప్పుదారి పట్టించే చర్యలు మాను కోవాలి.
ఏఏజీ వైసీపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్యకర్తల ద్వారా వచ్చిన సొమ్ముని తిరిగి కార్యకర్తల సంక్షేమానికి వినియోగిం చాలన్న ఉత్తమమైన ఆలోచన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ చేశారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి సభ్యత్వ రుసుము రూపంలో పార్టీకి వస్తున్న సొమ్ముని వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కార్యకర్తల సంక్షేమానికే వినియోగించేలా లోకేశ్ ప్రణాళి కలు అమలు చేశారు.
అలా ఖర్చుపెట్టిన సొమ్ము వివరాలు మొత్తం ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం ముందు ఉంచడం జరుగుతోంది. అవినీతి పరుడికి అందరూ అవినీ తి పరుల్లానే కనిపిస్తారు. కార్యకర్తల కష్టార్జితంతో పార్టీకి అందిస్తున్న విరాళాలను కూడా అవినీతి సంపాదనగా ముద్రవేయడం జగన్ రెడ్డి వక్రబుద్ధికి నిదర్శనం.
టీడీపీతో పోలిస్తే, సగం కూడా కార్యకర్తలు లేని వైసీపీ.. విరాళాల సేకరణలో జాతీయ స్థాయిలో 5వ స్థానంలో.. ప్రాంతీయ పార్టీల జాబితాలో అగ్రస్థానంలో ఎలా నిలిచిందో జగన్ రెడ్డికే తెలియాలి.
కార్యకర్తలు కష్టపడి సంపాదించిన సొమ్ముతో పార్టీ సభ్యత్వం తీసుకుంటే…. ఆ సొమ్ము ని అవినీతి సొమ్ముగా చూపుతున్న జగన్ రెడ్డి…అతని అవినీతి ప్రభుత్వం.. వైసీపీకి వస్తున్న పార్టీ విరాళాలపై సరైన వివరాలు వెల్లడించగలదా?
దేశంలోని జాతీయ పార్టీలకు ధీటుగా పార్టీ విరాళాలు ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీకి ఎలా వస్తున్నా యో.. తన పార్టీ విరాళాల సేకరణలో జాతీయ స్థాయిలో 5వస్థానంలో ఎలా ఉందో జగన్ రెడ్డి చెప్పాలి. విరాళాల సేకరణలో ప్రాంతీయపార్టీల్లో వైసీపీ అగ్రస్థానంలో ఎలా ఉందో… ఆపార్టీకి వచ్చే నిధులన్నీ సక్రమంగానే వస్తున్నాయని జగన్ రెడ్డి చెప్పగలడా? ఈస్థాయిలో వైసీపీకి విరాళాలు ఎలా వస్తున్నాయి… ఆపార్టీ ఏమైనా తెలుగుదేశం పార్టీలాగా సభ్యత్వరుసుముల ద్వారా కార్యకర్తల నుంచి విరాళాలు పొందుతోందా అంటే అదీ లేదు.
టీడీపీకి ఉన్నన్ని కార్యకర్తల సభ్యత్వాలు.. వైసీపీకి లేవు. సభ్యత్వా లు లేకుండా.. విరాళాల సేకరణలో జాతీయ స్థాయిలో వైసీపీ 5వస్థానంలో ఎలా నిలిచిందో.. ఏ మార్గాల్లో తనకు పార్టీ ఫండ్ వస్తోందో జగన్ రెడ్డి చెప్పాలి. తన పార్టీకి వచ్చే విరాళాల వివరాలను జగన్ రెడ్డి ఎప్పటికప్పుడు సక్రమంగా… ఎన్నికల కమిషన్ ముందు ఉంచుతున్నాడా?” అని నిమ్మల నిలదీశారు.