పేర్ని నాని.. చూపించాల్సింది..నువ్వు అక్రమంగా నిర్మించుకుంటున్న గోడౌన్లు !

-ఆత్మ విమర్శ చేసుకొని మీడియా ముందు మాట్లాడు
-రెండేళ్లకే మంత్రి పదవి పీకేశారు ఐదేళ్లకి ఎమ్మెల్యే పదవి పీకేస్తారు
-మీడియాకు నువ్వు చూపించాల్సినది కొల్లు రవీంద్ర శిలాఫలకాలు కాదు నువ్వు అక్రమంగా నిర్మించుకుంటున్న గోడౌన్లు
-సాగనంపేందుకు బందరు ప్రజలు సిద్ధం
-తొర్రి నాని.. సొల్లు అబద్ధాలు చెప్పడం తప్ప నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి..?
-నీ కొడుకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తుంటే మరి నువ్వు ఎక్కడ ఏం చేశావు..?
-టిక్ టాక్ లు మానేసి మాకు మంచాలేస్తా అంటున్నాడు
-మైనారిటీ ద్రోహి పేర్ని నాని
-మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు

మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి పేర్ని నాని పై ధ్వజమెత్తారు.. మండల పార్టీ అధ్యక్షుడు కుంచేనాని, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ , మాజీ జడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్, సమన్వయ కమిటీ సభ్యులు వాలిశెట్టి తిరుమలరావు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఖాజాలు మీడియా సమావేశంలో మాట్లాడారు.

మండల పార్టీ అధ్యక్షులు కుంచేనాని మాట్లాడుతూ… దొంగలు దొంగలు కలిసి ఊళ్లను పంచుకొని మమ్మల్ని దొంగలనీ అంటారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే పేద ప్రజలపై నిజంగా మీకు ప్రేమ ఉంటే నిజమైన పట్టాలు పేద ప్రజలకిచ్చి మాట్లాడండి.

ఆర్ఎస్ నెంబర్ లేకుండా అధికారులు సంతకాలు లేకుండా రాజముద్రలు లేకుండా ఇళ్ల పట్టాలు ఎవరైనా ఇస్తాడా.. ఇది పేద ప్రజల్ని మోసం చేయడం కాదా? కొల్లు రవీంద్ర ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేశారని శిలాఫలకాలు చూపిస్తున్నావు.. నువ్వు చూపించాల్సింది మీడియాకు అవికాదు అక్రమంగా నిర్మించుకున్న నీ గోడౌన్లను చూపించు. ఐదేళ్ల నేను కష్టపడి గోడంల నిర్మించాను ఇదే నేను చేసిన అభివృద్ధి అని మీడియాకు దమ్ముంటే.. బందరు నలుమూలల రహదారులు నిర్మించింది కొల్లు రవీంద్ర అయితే, ఆ రోడ్ల మీద తిరుక్కుంటూ ఏం అభివృద్ధి చేశారని మమ్మల్ని ప్రశ్నిస్తారా?

ఆరోజు అమ్మతోడు పెదపట్నం అన్నావు, గోగులేరుకు పోర్టు అమ్మేశావు ఈరోజు పత్తిత్తు కబుర్లు చెబుతున్నావు. అక్రమంగా పోర్టుకు మట్టి పోసి బిల్లులు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నావు.. విలేకరుల ముందు నీతి ప్రవచనాలు చెప్తున్నావ్. రేపు అధికారంలో రాగానే ఈ అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపించి తప్పకుండా నీ మీద చర్యలు తీసుకుంటాం.

మాజీ జెడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ… పేర్ని నాని 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసావు మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడు. ఎంతసేపు అబద్ధాలు అసత్యాలు మాట్లాడితే ప్రజలు నమ్మేకి సిద్ధంగా లేరు. నీకు ఇష్టం వచ్చిన గ్రామానికి వెళ్దాం ఏ గ్రామానికి మీరు రోడ్లు వేశారు ఏ గ్రామంలో మీరు అభివృద్ధి చేశారు ఆ గ్రామ ప్రజలు మధ్యలోనే చర్చిద్దాం.

ఆక్వా హబ్బు చేస్తానని చెప్పి రాష్ట్రంలో ఆక్వా కల్చర్ ని పూర్తిగా చంపేశారు, బందర్లో ఆక్వా కల్చర్ ని పారదోలారు. చంద్రబాబు నాయుడు హయాంలో 1.75 పైసలు యూనిట్ కి కరెంటు చార్జి ఉంటే, అధికారంలోకి వస్తే ఒకటిన్నరకి ఇస్తానని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదున్నర రూపాయలకు యూనిట్ చార్జి పెంచి ఆక్వారంగాన్ని మత్స్యకారులని రోడ్డును పడేశారు. బందర్లో ఏ మూలకెళ్ళినా అభివృద్ధి చేసి చూపించింది కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీని.

జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ మాట్లాడుతూ.. పేర్ని నాని ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా కానూరులో సరరాజుకు మీరు ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేస్తే 2013లో తెలుగుదేశం సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు దగ్గరికి వాళ్ళు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు.. నువ్వు డబ్బులు ఇవ్వకుండా వాళ్లకి భయపెట్టి లీజు డబ్బు సరిగ్గా చెల్లించకపోతే వాళ్లు ధర్నా చేశారు వాళ్లకి అండగా నిలిచింది మేము నువ్వు మాపైన బురద చల్లుతావా? నీ రాజకీయ జీవితానికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది త్వరలోనే బందరు ప్రజలు నీకు నీ కుటుంబానికి బుద్ధి చెబుతారు.

సీనియర్ నాయకులు వాలిశెట్టి తిరుమలరావు మాట్లాడుతూ.. మచిలీపట్నం అభివృద్ధి గురించి మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధం .. కోనేరు సెంటర్లో మీరు టైం చెప్పినా సరే మేము టైం చెప్పినా సరే మచిలీపట్నం అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.

మేము చేసిన అభివృద్ధి నిరూపించలేక పోతే మీకు క్షమాపణలు చెబుతాం,, మరి నువ్వేం చేస్తావ్ ఆల్రెడీ రాజకీయ సన్యాసం తీసుకున్నావు ఇక నువ్వు చేసేది ఏముంది. బందరు డ్రైనేజీ పై మీ విధానం ఏంటో చెప్పు ఈ 15 సంవత్సరాల ఎమ్మెల్యే జీవితంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పే దమ్ముందా..బందరు పోర్టు గురించి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావే బందరు పోర్టు నవయుగాకి అప్పగించింది నువ్వు కదా దాన్ని రద్దు చేసింది నువ్వు కదా మళ్లీ ఎందుకు ఈ అబద్ధాలు అన్నీ చెబుతున్నావు.

పోర్టు గురించి మాట్లాడే ముందు ఆ పోర్టు నిర్మాణానికి రహదారి ఏర్పాటు కోసం పేద ప్రజల భూములను లాక్కున్నారు వారికి కనీసం నష్టపరిహారమైన చెల్లించారా..? రైతులు ఎంత నరకయాతన పడుతున్నారో మీరు చేసిన దౌర్జన్యానికి ఎవరికి చెప్పుకోవాలో తెలియక జిల్లా కార్యాలయాల ముందు పడిగాపులు కాస్తున్నారు వాళ్లకి మీరేం సమాధానం చెబుతారు.

పోర్టు కోసం ముడాకు అప్పగించిన భూముల రక్షణ ప్రభుత్వం బాధ్యత కదా, మరి ఆ భూముల్లో పెద్ద పెద్ద గోతులు పెట్టి మట్టిని తోడుకొని అమ్ముకుంటున్నారు, మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతుంటే ఆ పదాలు కూడా సిగ్గు పడుతున్నాయి పేర్ని నాని. రండి చర్చిద్దాం ఈ గోతుల ముందరే. ఈ పొలాల మధ్యలో మీరు చేస్తున్న అవినీతి అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యం ఈ పోర్టుకు అప్పగించిన భూములే.

జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ఖాజా మాట్లాడుతూ.. దొంగ పట్టాలు దొంగ వాగ్దానాలు దొంగ శంకుస్థాపనలకు పేర్ని నాని పెట్టింది పేరు. గతంలో కరగ్రహారంలో వేల మందికి దొంగ పట్టాలి ఇచ్చిన ఘనుడు పేర్ని నాని. పేద ప్రజలం పేరు మీద ముసలి కన్నీరు కారుస్తున్న పేర్ని నాని 6400 జి ప్లస్ త్రీ ఇల్లు 5 సంవత్సరాలు అవుతున్న ఎందుకు పంపలేదు.

ముస్లింలకు ఎంత ద్రోహం చేసావో ఒక్కసారి రా చర్చకు సిద్ధం.. జామియా మసీదుకు ఎంపీ గారి ఇచ్చిన 25 లక్షల కక్షగట్టి ఆపేసావ్ నీ కుటుంబానికి ఎంతో సేవ చేసిన జామియా మసీదు ప్రెసిడెంట్ చ్చీ థూ అన్నది నిజం కాదా అంతకంటే ఇంకా ఏం కావాలి.. చివరకు ముస్లింలకు కబరస్థాన్ని అభివృద్ధి చేసే నిధులను కూడా అడ్డుకున్నావు. మైనార్టీలకు తీరని ద్రోహం చేసావ్.

Leave a Reply