– విధవలు అంటే అంత చులకన ఎందుకు?
మీ ప్రాస కోసం “వధువు విధవకు తేడా తెలియని వ్యక్తి బీఆర్ నాయుడు, శార్ధకర్మ రోజు వేద ఆశీర్వచనం ఇవ్వడమేంటి? భాగవత వస్త్రాన్ని శార్దకర్మల రోజు వెంకయ్య చౌదరికి కప్పారు. శ్రీవారి ఆలయ పవిత్రతను బీఆర్ నాయుడు ధ్వంసం చేస్తున్నారు” అని పేలా రు .
మీ కు డబ్బుపొరలు కమ్ముకుపోయి దేవుడు అంటే నమ్మకం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా సాంప్రదాయం అంటే మీకు తెలియదు. పెద్ద కర్మ రోజు తలకొరివి పెట్టిన వారు గుడిలో నిద్రచేస్తారు. దంపతులు ఎప్పుడూ ఒకేసారి చనిపోరు. మీరో, , మీ ఇంట్లోనే ఎవరో ఒకరు ముందు ముండమోపి / విధవలు అవ్వకుండా తప్పించుకోవడం కుదరదు. విధవలు అంటే అంత చులకన ఎందుకు? దేవుడి దర్శనం విషయం నుండి దేవుడి ముందు ఎవరైనా ఒక్కటే.
ఇక మీరు ధర్మారెడ్డి కొడుకు చనిపోతే.. పెద్దకర్మకు టిటిడి అధికారులను నంద్యాల పక్కన పల్లెలో వారింటికి తీసుకెళ్లి ఇదేపని చేశా రు . అదేమీ తప్పుకాదు. తిరుమల ఆలయానికి సంబంధించి ఉన్నతాధికారుల కుటుంబసభ్యులు మరణిస్తే….పెద్దకర్మ తంతు పూర్తయ్యాక, ఆలయ మర్యాదల ప్రకారం ..సదరు అధికారికి పరివట్టం కట్టి ,ప్రసాదాలు అందజేసి , పండితులు ఆశీర్వదించడం ఆనవాయితీ.
నువ్వు చేస్తే ఆచారం, ఎదుటోళ్లు చేస్తే అపచారం అవ్వదు.
చనిపోయింది టిటిడి అధికారి వెంకయ్య చౌదరి తండ్రి. ఆయన ధర్మారెడ్డి లెక్కన నిబంధనలకు విరుద్ధంగా.. అడ్డంగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి జగన్ రెడ్డి లెక్కన నియమించబడినట్లు నియమించబడలేదు. ధర్మారెడ్డి చెయ్యని అక్రమం లేదు. ఆఖరికి ఆయన ఊర్లో నాగదేవత పుట్టను త్రవ్వి ఇల్లు కట్టుకున్నాడు.
ఊర్లో ఒక్కరు కూడా పెద్దకర్మకు రాలేదు. వచ్చిన కొంతమంది ప్రభుత్వ, టిటిడి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు, ఎందుకు ఎవరూ రాలేదు అని. అంత పాపిష్టి అధర్మారెడ్డికి దేవుడు తగిన శాస్తి చేశాడు. అందులోనూ వివాదాస్పద చెన్నై ఇసుక శేఖర్ రెడ్డితో మీరంతా కలిసి ధర్మారెడ్డికి వియ్యం సెట్ చేసి నిశ్చితార్థం అయ్యాక, పెళ్ళికి ముందు. అయినా అదే ఆచారాన్ని చేయించిన అప్రాచ్యుడివిగా నువ్వు మొదట క్షమాపణలు చెప్పి తర్వాత మాట్లాడు. మధ్యలో వధువు విధవలు అంటూ ప్రాసకోసం హేళన చెయ్యకు.
మీ గురించి ముందు ముందు జనానికి తెలియాల్సింది చాలా వుంది. ఇప్పుడైనా కొంత నీ కుట్రలను, దుర్మార్గాలను తగ్గించు. అందులోనూ హిందువుల సంస్కృతి, టిటిడి గురించి తప్పుడు ప్రచారం చేయడం మానేయి. అది మీకే మంచిది.
– చాకిరేవు