• 5 సార్లు చెక్కులపై సంతకాలు చేసిన ప్రేమచంద్రారెడ్డి, ప్రాజెక్టును ప్రతిపాదించిన అజేయ కల్లాం రెడ్డిని సిఐడీ ఎందుకు వదిలిపెట్టారు?
• అవినీతి కేసుల్లో పదేళ్లు బెయిల్ పై బయట ఉన్న జగన్ రెడ్డి, ప్రజాసేవ తప్ప మరోటి తెలియని చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపి, టీడీపీకి కొత్తదారి చూపించాడు
• భవిష్యత్ లో జగన్ రెడ్డి అతని కేబినెట్ మొత్తం జైల్లో చిప్పకూడు తింటారు
• చంద్రబాబుతో పెట్టుకొని జగన్ తప్పుచేశాడని వైసీపీ వాళ్లే అంటున్నారు
• స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుపై జీవోలుఇచ్చిన నీలం సహానీ, నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డిలను ఎందుకు విచారించలేదో బుర్రకథల బుగ్గన చెప్పాలి
టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు , మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్
ప్రపంచంలో ఎవరికీ దొరకని అరుదైన అవకాశం జగన్ రెడ్డికే దక్కిందని, జైల్లో ఉండా ల్సిన వ్యక్తి, బెయిల్ పై పదేళ్ల పాటు బయట ఉండటం చూస్తే న్యాయవ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పని చేస్తోందనే సందేహాం ఎవరికైనా కలుగు తుందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అభిప్రాయపడ్డారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే ..
“ న్యాయవ్యవస్థలో ఎవరివిషయంలోనూ ఇంతకాలం జాప్యం జరగలేదు. కేవలం అది ఈ ముఖ్యమంత్రి విషయంలోనే సాధ్యమైంది. పదేళ్లు బెయిల్ పై ఉండటం ఎలా సాధ్య మైందని అందరూ ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి, ప్రజా సేవ తప్ప, మరోటి తెలియని చంద్రబాబునాయుడిని అన్యాయంగా జైలుకు పంపి వికృతానందం పొందుతున్నాడు. చంద్రబాబుతో పెట్టుకొని జగన్ తప్పుచేశాడని వైసీపీ వాళ్లే అంటున్నారు. చట్టపరంగా న్యాయంగా జగన్ రెడ్డి చేసింది తప్పని వారే ఒప్పు కుంటున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు రెండు జీవోలుఇచ్చిన నీలం సహానీ, నిధులు విడుదలచేసిన ప్రేమచంద్రారెడ్డిలను ఎందుకు విచారించలేదో బుర్రకథల బుగ్గన చెప్పాలి
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేసుపై బుర్రకథల మంత్రి బుగ్గన ఇచ్చిన వివరణలు చూస్తే నవ్వొస్తుంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం యొక్క వాటా 10శాతం మించకుండా, ఒక్కో క్లస్టర్ ను రూ.546కోట్లతో సిమెన్స్ సంస్థతో కలిసి నైపుణ్యాభివృద్ధి క్లస్టర్లను నెలకొల్పారని నాటి మంత్రిమండలి 15-02-2015న (కేబినెట్ రిజల్యూషన్ సీ.ఆర్ నెం : 33) లో తీర్మానించిందని చెప్పా రు. అదే బుగ్గన మరలా 04-03-2015న కేబినెట్ రిజల్యూషన్ – 47 లో సిమెన్స్ కేంద్రాల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించాలని మంత్రిమండలి తీర్మానించిందని చెప్పారు . మంత్రి మండలి పాలసీ డెసిషన్స్ ఇలా ఉంటే, వాటిని జీవోల రూపంలో అమలు చేసేది అధికారులేనని బుగ్గనకు తెలియదా?
మంత్రిమండలిలో పైనచెప్పినట్టు రెండు తీర్మానాలు అయ్యాక ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి అప్పటి విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీమతి నీలంసహానీ రెండు జీవోలు ఇచ్చారు. ఆ పని ఎందుకు చేయలేదో బుగ్గన చెప్పరు… ఇతర మంత్రులు మాట్లాడరు. ఆనాడు జీవోలు ఇచ్చిన శ్రీమతి నీలంసహానీని వైసీపీప్రభుత్వం, సీఐడీ ఒక్కసారి కూడా విచారించలేదు.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, అమలుపై జీవోలు ఇచ్చిన అధికారిణి నీలం సహానీని, కార్పొరేషన్ కు నిధులు విడుదల చేసిన ఎల్. ప్రేమచంద్రారెడ్డి, అజయ్ కల్లం రెడ్డిలను విచారించకుండా, ఫిబ్రవరి 2020లో శిక్షణాకేంద్రాల్లో అన్నిరకాల పరికరాలు ఉన్నాయని ధృవీకరించిన అధికారిని విచారించకుండా, అన్నింటికీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యుడని చెప్పడం ముమ్మాటికీ కక్షసాధింపే. మాతృసంస్థ ఎక్కడ ఏ దేశంలో ఉన్నా… ఆ సంస్థ తరుపున కొన్ని శాఖల్ని ఇతర దేశాల్లో ప్రారం భిస్తారు. అది ఎక్కడైనా జరిగేదే. సిమెన్స్ ఇండియా సంస్థతో సిమెన్స్ ఏజీ జర్మనీ వారికి సంబంధంలేదని బుగ్గన చెప్పడం హాస్యాస్పదం.
డిజైన్ టెక్ సంస్థతో వ్యాపార వ్యవహారాలు నడిపిన స్కిల్లర్ సంస్థ ఇతర కంపెనీలతో సంప్రదింపులుజరిపితే అవన్నీ షెల్ కంపెనీలా…వాటిలో ఏదో ఒక కంపెనీ తప్పు చేస్తే దానికి చంద్రబాబు బాధ్యుడా?
అలానే డిజైన్ టెక్ సంస్థకు చేసిన చెల్లింపులు తప్పని బుగ్గన చెబుతున్నారు. సిమెన్స్ ఇండియా సంస్థకు డిజైన్ టెక్ సంస్థ అన్ డివైడెడ్ భాగస్వామి. సిమెన్స్ సంస్థ సాఫ్ట్ వేర్ అందిస్తే, దాన్ని అమలుచేసి, ట్రైనింగ్ కు అనుకూలంగా మార్చాల్సిన బాధ్యత డిజై న్ టెక్ సంస్థది. సిమెన్స్ సంస్థ 90శాతం వాటాకింద సాఫ్ట్ వేర్ ను పెట్టుబడి పెడితే, ఆ సాఫ్ట్ వేర్ ప్రకారం నేర్చుకున్న యువతకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. తమ సాఫ్ట్ వేర్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ కావాలన్న ఆలోచనతోనే సిమెన్స్ సంస్థ క్యాష్ ఇన్ కైండ్ పద్ధతిలో పనిచేయడానికి ముందుకొచ్చింది.
సిమెన్స్ సంస్థ సాఫ్ట్ వేర్ ప్రకారం యువతకు శిక్షణ ఇవ్వడానికి డిజైన్ టెక్ సంస్థ నాడు రాష్ట్రవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలు ఎంపికచేసి వాటిలో స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణాకేంద్రాలు నెలకొ ల్పింది. దానిలోభాగంగా డిజైన్ టెక్ సంస్థ శిక్షణాకేంద్రాల్లోఇతర పరికరాల సరఫరా కోసం స్కిల్లర్ సంస్థ భాగస్వామ్యం పెట్టుకుంది. డిజైన్ టెక్ తో సంప్రదింపులు జరిపిన స్కిల్లర్ సంస్థ మరికొన్ని కంపెనీలతో వ్యాపార వ్యవహారాలు నడిపితే, ఆ కంపెనీలను ఈ ప్రభుత్వం షెల్ కంపెనీలు అంటోంది. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలు లేకుండా వేరే సంస్థతో కార్యకలాపాలు సాగించిన స్కిల్లర్ సంస్థకు, దానితో కలిసిన పనిచేసిన ఇతర సంస్థలకు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలా సంబంధం ఉంటుందో జగన్ రెడ్డి, అతని ప్రభుత్వమే చెప్పాలి.
వైసీపీ సర్కార్, సీఐడీ ఆరోపిస్తున్నట్టు శిక్షణా కేంద్రాల్లో పరికరాలు, సాఫ్ట్ వేర్ లేకపోతే ఇదే ప్రభుత్వం శరత్ అసోసియేట్స్ సంస్థతో ఫిజికల్ వెరిఫికేషన్ ఎందుకు చేయించలే దు? కేంద్రప్రభుత్వ సంస్థ సీఐటీడీ ఇచ్చిన వ్యాల్యుయేషన్ సర్టిఫికెట్ ను ఎందుకు పరి గణనలోకి తీసుకోవడం లేదు? ఇలా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో ముడిపడిన అనేక ప్రధాన అంశాలను పక్కనపెట్టి, కేవలం ఎవరో ఒక అధికారి నోట్ ఫైల్లో రాసిన దాన్ని పట్టుకొని చంద్రబాబు చెబితేనే డబ్బులు విడుదల చేశారంటూ ఆయన్ని అరెస్ట్ చేయడం దుర్మార్గం కాదా?
ముఖ్యమంత్రి సహా, ఇప్పుడున్న కేబినెట్ సభ్యులు మొత్తం జైల్లో చిప్పకూడు తింటారు
ఇదే పద్ధతి భవిష్యత్ లో వచ్చే ప్రభుత్వాలు అనుసరిస్తే జగన్ రెడ్డి, అతని కేబినెట్ సభ్యులు జీవితాంతంజైల్లో ఉండక తప్పదు. ఈ విధంగా వ్యవహరించి ఈ ప్రభుత్వమే కొత్తదారి చూపిం చింది. ఇదే దారిలో రేపు టీడీపీ ప్రభుత్వం వెళ్తే ఇప్పుడున్న కేబినెట్లో ఏ ఒక్కరూ ఇంట్లో అన్నంతినలేరు. ముఖ్యమంత్రితో సహా అందరూ జైల్లో చిప్పకూడు తినాల్సిందే.
టీడీపీ శ్రేణులు ఆగ్రహిస్తే ఏపీ మరో మణిపూర్ అయ్యేది
అమరావతిలో వేయని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ పేరుతో తప్పు చేశారని మరో అభియోగం మోపుతున్నారు. అలానే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై ఆరోపణలు చేస్తు న్నారు. ఇలా ఒక దాని తర్వాత మరోదాన్ని తెరపైకి తెస్తూ ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి తమ పతనాన్ని తామే కోరి తెచ్చుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కింద పనిచేస్తున్న సీఐడీ రిమాండ్ రిపోర్ట్ లోనే చాలా తేడా ఉంది. ఒకపేజీలో ఒకలా.. మరోపేజీలో మరో లా పొంతనలేని అంశాలు ప్రస్తావించారు. వివేకాహత్యకేసులో ముద్దాయి అయిన అవి నాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తుందా?
మరి ఏ తప్పూ చే యని చంద్రబాబుని జైల్లో పెట్టినందుకు టీడీపీ శ్రేణులు ఆగ్రహిస్తే ఏపీ మరో మణిపూర్ అయ్యేది. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే పార్టీ కాబట్టే టీడీపీ సంయమనంతో వ్యవ హరిస్తోంది. జగన్ రెడ్డి అవినీతికి సహకరించి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎలాగైతే జైలుకెళ్లారో, చంద్రబాబు విషయంలో తప్పుచేసిన వారికి టీడీపీ ప్రభుత్వం రాగానే అంతకు రెట్టింపు దండన ఉంటుంది. చంద్రబాబు గెలుపును ఆపడం.. ప్రజా జీవితం నుంచి ఆయన్ని విడదీయడం ఎవరితరం కాదు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తనతప్పు తెలుసుకొని పశ్చాత్తాప్పడితే మంచిది. లేకుంటే మరలా చిప్ప కూడు తినడం ఖాయం.” అని అశోక్ బాబు హెచ్చరించారు.
వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో రూ.13కోట్ల ప్రజలసొమ్ము దుర్వినియోగం చేసిన బొత్స చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటు : ద్వారపురెడ్డి జగదీశ్
“విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు డబ్బులు కొట్టేశాడని చెప్పడం ఆయన మిడిమిడి జ్ఞానానికి నిదర్శ నం. తెలుగురాష్ట్రాలకు షెల్ కంపెనీలు.. క్విడ్ ప్రోకో.. మనీ ల్యాండరింగ్ వంటి పదాలను పరిచయం చేసింది జగన్ రెడ్డే. వోక్స్ వ్యాగన్ కంపెనీ వ్యవహారంలో వశిష్ట వాహన్ అనే ఫేక్ కంపెనీ సృష్టించి ప్రభుత్వసొమ్ము (ప్రజల సొమ్ము) రూ.13 కోట్లు దుర్విని యోగం గంచేసిన ఘనత బొత్స సత్యనారాయణది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉ న్నందున ఆ కేసు నుంచి ఆయన తప్పించుకోగలిగారు.
నాడు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వస్తే చాలా తేలిగ్గా వాటిని కొట్టిపారేశారు. అందులో అక్యూజ్డ్ గా ఉండాల్సిన బొత్స, నాటి ప్రభుత్వ దయతో విట్ నెస్ గా ఉండి బయటపడ్డాడు. అలాంటి బొత్స నేడు చంద్రబాబుపై నిందలు వేయడం నిజంగా సిగ్గుచేటు. నేడు చంద్రబాబుకి మద్ధతుగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయంటే దానికి కారణం.. ఆయనపై తెలుగుప్రజలకు ఉన్న నమ్మకం. దుర్మార్గపు ఆలోచనతో అబద్ధాన్ని నిజం చేయాలని వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి ఎంతగా ప్రయత్నించినా, అంతిమ విజయం ధర్మానిదే. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగితే దానికింద నెలకొల్పిన 40 శిక్షణా కేంద్రాల్లో పరికరాలు, సాఫ్ట్ వేర్ ఎలా వచ్చాయి?
2లక్షలకు పైగా యువత శిక్షణ ఎలా పొందారు? రాష్ట్ర పాలకులు రాజ్యాంగవ్వవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఈనాడు అధికారంలో ఉన్నామని అహంకారంతో విర్ర వీగే జగన్ రెడ్డి అండ్ కంపెనీ భవిష్యత్ లో చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం.” అని ద్వారపు రెడ్డి జగదీశ్ స్పష్టం చేశారు.