CPR అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ .. చాలామంది నిద్రలో చనిపోయారు,, సడన్ హార్ట్ అటాక్ తో పోయారు అంటుంటారు,, దీనికి కారణం వెంట్రికులార్ ఫిబ్రిలేషన్., వెంటనే గుండె వేగంగా కొట్టుకొని ఆగిపోవడం.. 3 నిముషాలలో అంతా అయిపోతుంది.మానవుడు బ్రతికుండగా నేను తోపు,,తురుం అనుకుంటాడు.. మన మెదడు 3 నిముషాలు రక్తం సరఫరా కాకుంటే పరలోకప్రయాణమే.ఇది వస్తే అంతే సంగతులు.. CPR అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ గురించి తెలుసు కోండి,నేర్చుకోండి,, అబ్బే నాకెందుకు అనుకోకండి.. ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన బేసిక్ పరిజ్ఞానం.
ముందు ఎవరైనా నడుస్తూపడిపోయినా, తల తిరుగుతోంది అని కుప్పకూలినా, అన్నమో నీళ్ళో తాగుతో పొరపోయి స్పృహ తప్పినా ,,, ఆందోళన చెందకుండా కింద పడుకో బెట్టి షర్టు విప్పతీసి, ఛాతీపై ఎడమ వైపున మధ్యలో, మీ రెండు చేతులు ఒకదానిపై ఒకటి ఉంచి బలంగా నొక్కడం ప్రారంభించండి,, 108 ఆంబులెన్సుకు ఫోను చేయండి,, అది వచ్చేవరకు చేస్తూ ఉండాలి.CPR చేస్తూ అంబులెన్సు పిలవాలి,,సెల్ఫోన్లో ఫోటోలు తీయడం కాదు..గుంపులు గుంపులుగా మూగడం కాదు చేయాల్సింది.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి ఇక్కడ సలహా ఏంటంటే:
మీరు CPR లోశిక్షణ పొందలేదు. ….. మీరు CPRలో శిక్షణ పొందకపోతే లేదా ఊపిరితిత్తులు లోకి గాలి ఊదడానికి సంకోచముందా, దానిని అందించడం గురించి ఆందోళన చెందుతుంటే, హ్యాండ్స్-ఓన్లీ CPRని అందించండి. అంటే పారామెడిక్స్ వచ్చే వరకు నిమిషానికి 100 నుండి 120 వరకు నిరంతరాయంగా ఛాతీ కుదింపులు వత్తడం చేయండి. మీరు రెస్క్యూ శ్వాసను ప్రయత్నించాల్సిన అవసరం లేదు.
మీరు CPR లో శిక్షణ పొందారు సిద్ధంగా ఉన్నారు…. అయితే మీరు బాగా శిక్షణ పొంది, మీ సామర్థ్యంపై నమ్మకంతో ఉన్నట్లయితే, పల్స్ మరియు శ్వాసక్రియ ఉందో లేదో తనిఖీ చేయండి. 10 సెకన్లలోపు పల్స్ లేదా శ్వాస తీసుకోకపోతే, ఛాతీ
కుదింపులను ప్రారంభించండి. నిముషానికి రెండు సార్లు నోటిలో నోరు పెట్టి గాలి ఊదుతో ఇచ్చే ముందు 30 ఛాతీ కుదింపులతో CPR ని ప్రారంభించండి.(1:30)ఇది ఒక బేసిక్ పని.. మనుషులంతా తెలుసుకోవాలి.. బాగా అభివృద్ధి చెందిన దేశాలలో అయితే డీఫిబ్రిలేటర్ అనే షాక్ ఇచ్చే మెషిన్ లు ఎయిర్ పోర్టు లు,షాపింగ్ మాల్సు, వీధులలో కూడా ఉంటాయి.. ఛాతీకి జెల్ పూసి,లేదా పాడిల్సు కు జెల్ పూసి 360 జౌల్సు సెట్ చేసి షాక్ ఇవ్వాలి. కాని మన దేశంలో అంత సీన్ లేదు కావున 108 కుఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి షాక్ ఇచ్చి ఆసుపత్రి కి తీసుకెళతారు..
బాగా డబ్బున్న వాళ్ళు ప్లాస్మా టివిలు, పెద్ద కార్లతో పాటు ఒక డీఫిబ్రిలేటర్ లక్ష రూపాయలవతాది.. కొని ఇంట్లో పెట్టుకొని ఇన్వర్టర్ మాదిరి ఛార్జింగులో పెట్టుకోండి.. అత్యవసర సమయంలో పనికి వస్తుంది.
పైవేం బ్రహ్మవిద్యలు కాదు.. వేదాల మాదిరి అర్ధంకాకపోవడం అనేదే లేదు.. ఉన్నదల్లా మన అజ్ఞానం.. ఎలా మాడ్రన్ గా బతకడం తెలియకపోవడం.. మాడ్రన్ అంటే పబ్ లు మందు అని తిరగడంకాదు,, కొత్తగా ఆలోచించడం..
– Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు