(రవికుమార్)
మొన్న ములుగు అడవుల్లో పోలీస్ కాల్పుల్లో చనిపోయిన వాళ్లలో, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పిల్లలు.. ప్రొఫెసర్ హరగోపాల్ పిల్లలు.. గద్దరన్న పిల్లలు ( ప్రొఫెసర్ సాయిబాబా గారు ఈ మధ్యనే కన్ను ముసారు వారి ఆశయం నెరవేరిందా?) దేవరాజు మహారాజు గారి పిల్లలు.. వర వరరావు పిల్లలు, ప్రొఫెసర్ కాశీం పిల్లలు ఎవ్వరు లేరే?! ఈ నక్సల్ తయారు చేసే ప్రొఫెసర్స్, వాళ్లకు వకాల్తా, మద్దత్తు ఇచ్చే మీడియా జర్నలిస్టులు, ఎవరు కూడా తమ పిల్లలకు తుపాకీ ఇచ్చి అడవులకు పంపరే?
ఇక్కడ నిత్యం విప్లవ గీతాలు పాడుతూ, ఆ కాలం చెల్లిన విప్లవొద్యమ సిద్ధాంతం గురించి యూనివర్సిటీ లలో ప్రచారం చేస్తూ ఆ యువ రక్తంలో భావోద్వేగాలు రేపి,, వాళ్ళ చదువులు, వారి జీవితాలు, ఎటు కాకుండా చేస్తూ వాళ్లకు ఏ నలభై యాభై ఏళ్ల తరువాత అసలు సత్యం అర్ధం అయ్యేసరికి వారి విలువైన యవ్వనం, ఖర్చు అయ్యి అటు కుటుంబాలతో దూరం అయి ఇటు సమాజానికి ఉపయోగ పడలేక, అటు ప్రభుత్వాలతో వేటాడ బడుతూ ఎటు దారి లేక గత్యంతరం లేని పరిస్థితిలో అడవుల్లోనే జీవితాలు తెల్లారి పోవడమో, రోగాలా బారిన పడి బతుకు చాలించడం లేకపోతె, వృద్దాప్యంలో ఇళ్లకు చేరి శేష జీవితం నిస్సారంగా, కుటుంబ సభ్యుల పై ఆధారపడి గడపడం చూస్తుంటే జాలి కలుగుతుంది.
సిద్దాంత పరంగా వాళ్ళను వ్యతిరేకించె వాళ్ళు కూడా వీళ్ళని చూసి జాలిపడాల్సిందే,. కొంతమంది ఇలాంటి కాల్పుల్లో చనిపోవడం చూస్తుంటే బాధ వేస్తుంది, అసలు ఈ నవీన యుగం లొ ఇంకా ఇలాంటి తుపాకీ గొట్టం తో రాజ్యాధికారం సాధ్యమయ్యే పనేనా అని, ప్రపంచంలో ఇప్పుడు ఒక నలభై యాభై ఏళ్ల చరిత్ర అధ్యయనం చెస్తే అర్ధం కావడం లేదా ఈ ప్రొఫెసర్స్ ముసుగులో ఉన్న అర్బన్ నక్సల్ మేధావులకు?
మన కళ్ళ ముందే విఫలం అయిన శ్రీలంక తమిళ ఈలం అనబడ్డ దేశ విభజన కోసం LTTE కీ నాయకుడు ప్రభాకరణన్ తాను తుపాకీ పట్టడమే కాదు తన కొడుక్కి కూడా తుపాకీ ఇచ్చి పోరాటానికి పంపాడు. తుపాకీ ఉగ్రవాదం,నేర్పిన వాళ్ళు 12 ఏళ్ల చిన్న పిల్లల కు తుపాకీ ఇచ్చి, మేడలో సైనేడ్ క్యాప్సుల్ ధరించి శ్రీలంక సైన్యం తో పోరాడినంత సేపు పోరాడి తీరా సైన్యానికి చిక్కితే మేడలో ఉండే సైనేడ్ క్యాప్సల్ కొరికి నిముషాల్లో చనిపోయేవాళ్లు, నడుముకు బెల్ట్ బాంబులు కట్టుకుని తిరిగే వారు.
అలాంటి వేర్పాటు వాదం ఆ దేశ అధ్యక్షుణ్ణి కూడా చంపారు. అయినా వాళ్ళు కోరిన తమిళ ప్రత్యేక రాజ్యం సాధ్యం అయిందా, వాళ్ళు నలభై ఏళ్ల్లు పోరాడి ఓడిపోయి వేలాది మంది చనిపోయి అటు దేశ ఆర్ధిక పరస్థితి దెబ్బతిని, ఉద్యమం ముగిసింది కాని ఎం సాధించారు, దేశం ఏంతో నష్టపోయింది ఆ నష్టం ఇప్పుడు ఉన్న తరం వాళ్ళు భరించాలి కదా ,, ఇక , మనదేశంలోనే ఇలాంటి ఉద్యమాలు మొదలువ్వడం ముగిసిపోవడం ఎన్నో చూసాము.
ఆ మార్క్స్ సిద్ధాంతం, నక్సల్ సిద్దాంతాలు పుట్టిన సమయంలో ఉన్నట్టు ఇప్పుడు ప్రపంచంలో, ఇటు మన దేశంలో అప్పటి పరిస్థితి ఉందా,, బీదరికం మొత్తం పోయింది అని చెప్పడం లేదు, కానీ ఈ ముప్పై ఏళ్లల్లో బీదరికం తగ్గు ముఖం పట్టింది అనేది ఖాయం,, బీదలు మధ్యతరగతి కీ చేరారు. చేయగలిగే వాళ్లకు పని దొరుకుతుంది,,కాకుకుంటే నాకు ఇదే పని కావాలి.
ఆ పని అయితేనే చేస్తాం అని అనుకునే వారికీ మాత్రం పని దొరకడం కష్టం,,, బూర్జవా,,, పెట్టుబడి దారు, ఫాసిస్ట్ లాంటి కమ్యూనిస్ట్ డైలాగ్స్ కీ మాత్రం విలువ లేదు,, చైనా ఆ పనికిమాలిన సిద్ధాంతం వదిలేసాక ప్రయివేట్ రంగాన్ని ప్రోత్సహించడం తోనే అభివృద్ధి సాధించి ఇవ్వాళ్ళ ప్రపంచంలో రెండో ఆర్ధిక శక్తిగా ఎదిగింది, చైనా ని చూడాలంటే మావో తర్వాత చైనాని చూడాలి.
మరి ఈ దేశంలో నక్సలైట్ల తయారీ పరిశ్రమ ఇప్పటికైనా మూసేయండి,, ప్రొఫెసర్లరా, అనవసరంగా మనుషుల ప్రణాలు పణంగా పెట్టి మీ ఆస్తులు, పెంచుకోవడం,, మీరు మీ కుటుంబాలు మాత్రం నీడ పట్టున హాయిగా జీవిస్తూ మంది పిల్లల జీవితాలతో ఆడుకోవడం ఆపేయండి.