– పోలీసులు రేవంత్ కు ప్రైవేటు సైన్యంగా పని చేస్తున్నారు
– మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
మొన్న జరిగిన బీ ఆర్ ఎస్ విద్యార్థి విభాగం మీటింగ్ లో మాట్లాడిన మా వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ భార్య పై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారు అని చెప్పారు.కే టీ ఆర్ వ్యాఖ్యలను జూబ్లీ హిల్స్ ఎస్ హెచ్ ఓ ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
గెల్లు సతీమణి శ్వేత పై హత్యాయత్నం కేసు పెట్టలేదని వాస్తవాలను వక్రీకరిస్తూ పోలీసులు ప్రకటన ఇచ్చారు. శ్వేత కు పోలిసులు ఇచ్చిన నోటీసుల్లో బీ ఎన్ ఎస్ 109 సెక్షన్ కింద కేసు పెట్టామని పేర్కొన్నారు. బీ ఎన్ ఎస్ 109 సెక్షన్ అంటే హత్యా యత్నం కింద కేసు నమోదు అన్నట్టే. జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రజలు పోలిసుల తీరును గమనించాలి. కే టీ ఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదు. రాష్ట్రం లో కొందరు పోలీసులు రేవంత్ కు ప్రైవేటు సైన్యంగా పని చేస్తున్నారు. ప్రజా పాలన అని చెప్పి దుర్మార్గపు పాలన నడుపుతున్నారు.
ఇందిరమ్మ పాలన అని చెప్పి ఎమెర్జెన్సీ పాలన అమలు చేస్తున్నారు. సమాజం లో జరిగే నేరాలు అదుపు చేయాల్సిన పోలీసులు బీ ఆర్ ఎస్ ను లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ శాఖ పని చేయడం లేదు. పోలీస్ శాఖ తప్ప రేవంత్ హోం మంత్రిగా ఉండి బీ ఆర్ ఎస్ నేతలపై కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారు.
కొందరు పోలీసులు కాంగ్రెస్ కో చట్టం ,బీజేపీ కో చట్టం అన్నట్టు పని చేస్తున్నారు. కేసీఆర్ హయం లో ఎపుడూ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయలేదు. అపుడు ఇలా దుర్వినియోగం చేస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేది ? ఈ ప్రభుత్వం అధికారం లోకి రాగానే కొందరు బీ ఆర్ ఎస్ కార్యకర్తలు హత్యకు గురయ్యారు.
ఇప్పుడు శాంతి భద్రతలు దిగజార్చారు. పోలీసులు పద్దతి మార్చుకోవాలి. ప్రజాగ్రహం వస్తే ఏ పోలీసులు ఏం చేయలేరు.మేము జైలు భరో పిలుపు నిస్తే పోలీస్ స్టేషన్లు ,జైళ్లు సరిపోతాయా ? తప్పుడు పనులు చేసే పోలీసులను ఉపేక్షించం.
కే టీ ఆర్ వ్యక్తిగత హననానికి పాల్పడ్డ మహా న్యూస్ పై పిర్యాదు చేస్తే పోలీసులు ఎందుకు స్పందించరు ? మేమిచ్చిన ఫిర్యాదుల పై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు .బీ ఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. చట్టం అందరికీ ఒకేలా అమలు చేయాలి.ప్రెస్ మీట్ లో చిరుమళ్ల రాకేష్ కుమార్ , పల్లె రవికుమార్ , తుంగబాలు , లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.