రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి DPR ఎందుకివ్వడం లేదు..?

– నీటి కేటాయింపులు లేకుండా ఎలా ఇస్తారు ?
– RDS పై కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది ?
– కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఏమైంది..?
– ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఫైర్

తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రధాన విషయాలను సీఎం కేసీఆర్ మరిచిపోయారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ విమర్శించారు. ఆయన ఇచ్చిన హామీలున గుర్తు చేసేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర జోగులాంబ గద్వాల జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో పాల్గొన్న ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ సందర్భంగా టీఆర్ఎస్ వైఫల్యాలపై, అసమర్థతను ఎండగట్టారు. నేడు ఈయాత్రలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వేదిరే శ్రీరాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భాంగా మాట్లాడిన ప్రహ్లాద్ సింగ్ పటేల్ కేసీఆర్ అసమర్థ పాలనపై మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు గడిచినా నీళ్లు, నిధుల, నియామకాల సమస్యకు పరిష్కారం కాలేదన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

కానీ.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి DPR ఎందుకివ్వడం లేదని సూటిగా ప్రశ్నించారు. నీటి కేటాయింపులు లేకుండా ఎలా ఇస్తారు ? తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రధాన విషయాలను సీఎం కేసీఆర్ మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇచ్చిన హామీలున గుర్తు చేసేందుకు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిచడం జరుగుతోందని తెలిపారు. RDSపై ఇచ్చిన హామీ ఏమైంది ? కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఏమైంది అని ప్రశ్నించారు.

RDS లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రహ్లాద్ పటేల్ అన్నారు. 2014 నుంచి అధికారంలో ఉన్న కేసీఆర్ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ను ఎందుకు పూర్తిచేయలేకపోయిండు..? కుర్చీ వేస్కొని కూర్చొని ఆర్డీఎస్ పూర్తి చేస్తానని చెప్పి మాట తప్పిండు.

కేసీఆర్ కు కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజక్ట్ లపై చూపడం లేదని చురకలు అంటించారు. రాష్ట్రంలో హత్యలు, దాడులకు పాల్పడడం సమంజసం కాదన్న మంత్రి ప్రహ్లాద సింగ్ తెలంగాణలో అత్యంత అవినీతి పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు.

Leave a Reply