– ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది
– మాజీ మంత్రి రోజా
మహిళలను చంపేస్తుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి కనీసం మాట్లాడటం లేదు. మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చేయాలి.
చిన్న పాపను చంపేసి, పూడ్చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు. తన్మయ్ అనే గిరిజన అమ్మాయి కనిపించడంలేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. ఫిర్యాదును పట్టించుకోక పోవడం వల్లనే తన్మయ్ శవమై కనిపించింది. మహిళల ప్రాణాలు తీయడం, మానాలు తీయడం ఎల్లోస్ కు అలవాటైంది.మహిళలకు అన్యాయం జరుగుతుంటే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు.