ఎందుకో అలా అనిపిస్తోంది.!
ఒక పోలిక…..
2004-2009 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసినదే 2014 తర్వాత నరేంద్ర మోడీ మొదలుపెట్టాడు, మనం గనక నిశితంగా గమనిస్తే.. మోడీ నడుస్తున్న ప్రతి అడుగు రాజశేఖరరెడ్డి అడుగుజాడలలోనే.!
నాడు రాజశేఖరరెడ్డి తన బినామీల సామ్రాజ్యాలను విస్తరించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామోజీరావు లాంటి వటవృక్షాలను కూల్చాలని ప్రయత్నంచేశాడు, పరిటాల రవి లాంటి వాళ్లను అంతమొందించాడు, సీపోర్టులు బలవంతంగా లాగేసుకున్నాడు, వేలాది ఎకరాల ప్రవేట్ ఎస్ ఈ జెడ్ లను తన బినామీలకు కేటాయించాడు,ఫార్మా రంగంలో చాలామంది నైతికంగా ఎదిగిన ఇతరులను బలవంతంగా అణచివేశాడు, వాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాడు. ఫార్మాలో బినామీలైన తనవాళ్ల కంపెనీలలో అనుమతుల్లేని నార్కోటిక్ డ్రగ్స్ తయారుచేయించి కృష్ణపట్నం గంగవరం కాకినాడ సీపోర్టుల నుండి విదేశాలకు అక్రమంగా ఎగుమతులు చేయించి లక్షలకోట్లు పోగేశాడు.
అదేవిధంగానేమో ఇది కూడా….
దక్షిణభారతంలో బెంగుళూరు కేంద్రంగా చేసుకుని దూకుడుతనంతో అనతికాలంలోనే వ్యాపారసామ్రాజ్యాన్ని ప్రపంచస్థాయికి విస్తరించి తరువాత లండన్ పారిపోయినట్లు ప్రచారంగావించబడుతున్న విజయ మాల్యా , లండన్ లో ఈమధ్య ఒక భారతీయ పోడ్ కాస్టర్ కి ఇచ్చిన ఒక పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ని నేను మొత్తం చూసిన తరువాత, ఆ నాలుగు గంటల నిడివి కలిగిన విజయ మాల్యా ఇంటర్వ్యూలో అతని ముఖ కవళికలను బాడీ లాంగ్వేజ్ ని ఆమూలాగ్రం నఖశిఖ పర్యంతం గమనించిన తరువాత నాకు అనిపించింది ఏమిటంటే…..విజయ మాల్యాను బలిపశువును చేసింది గుజరాత్ మాఫియానే అని గట్టిగా చెప్పగలను.
మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే దక్షిణభారతానికి చెందిన విజయ మాల్యా సామ్రాజ్యం మీద దెబ్బ వేటు వేశారు అనిపిస్తుంది. భారతదేశంలో గుజరాత్ ప్రాంత అంబానీ అదానీ కుటుంబాలకు చెందిన వ్యాపారసామ్రాజ్యాలను దేశవిదేశాలలో విస్తరించడానికి, గుజరాత్ మినహా దక్షిణభారతం నుండి ఉత్తరభారతం నుండి మరెవ్వరిని పెరగకుండా నిరోధించడానికి, భయపెట్టడానికి ముందుగా విజయ్ మాల్యా ను ఎంచుకున్నారు.
తరువాత అదే దక్షిణభారతానికి చెందిన తెలుగు పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డిని కూడా ముబాయ్ ఎయిర్పోర్టు నుండి తప్పించారు, బలవంతంగా మెడపట్టి గెంటేశారు, ఆ ఎయిర్పోర్టును అదానీ లాగేసుకున్నారు.
గుజరాత్ కి చెందిన అదానీ అంబానీలకు మరియు ఇతర గుజరాత్ పారిశ్రామికవేత్తలకు రాందేవ్ బాబా లాంటి మోసగాళ్లకు లక్షలకోట్ల రూపాయల రుణమాఫీలు చేసిన మోడీ కేవలం ఆరువేల కోట్ల రూపాయల విజయ్ మాల్యా రుణాన్ని రీషెడ్యూల్ చేయకుండా, అతను వ్యాపారపనుల నిమిత్తం విదేశాలకు వెళితే అతను దేశంవదలి పారిపోయాడు అని తన కిరాయి మీడియాతో ప్రచారంచేసి అతనిని బలిపశువుని చేశారు.అతను తిరిగి భారతదేశానికి రాకుండా అన్ని దారులు మూసేశారు అనిపిస్తోంది.
అందుకనే తనకు మార్గదర్శకుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నరేంద్రమోదీకి అమిత్ షాలకు అంత ప్రేమ మమకారమేమో?
ఏమో….!
~సువేరా.