-తెలంగాణ ప్రభుత్వం బిడ్లు వేస్తామని ముందుకు రావడం సంతోషం
-సీఎం జగన్ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా?
-జగన్ పోరాటం చేయకుండా కేంద్రానికి ప్రేమ లేఖలు రాస్తున్నారు
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామనే కోపం, సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ మీద చూపుతున్నారా?
-అఖిలపక్షాన్ని తీసుకెళ్తామన్న సీఎం జగన్ మాటలేమయ్యాయి?
-కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన ఏపీ టీడీపీ నేతలు
-జగన్ మౌనంపై విరుచుకుపడిన బండారు, ధూళిపాళ్ల
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం బిడ్లు వేస్తామన్న తెలంగాణ వైఖరి ఆంధ్రాలో వైసీపీ సర్కారుకు ప్రాణసంకటంగా మారింది. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రమే స్టీల్ ఫ్యాక్టరీ కోసం బిడ్లు వేస్తామని ముందుకొస్తే.. ఏపీకి ఏమయిందని తెలుగుదేశం, వామపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ సర్కారు బిడ్లు వేస్తామని చెబుతుంటే జగన్ ఉండి ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళతామన్న జగన్ హామీ ఏమైందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించడం ద్వారా సరికొత్త రచ్చ లాంటి చర్చకు తెరలేపారు. అమరావతి విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగులో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటామన్న ప్రకటనపై ఏపీ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ల విషయంలో కేసీఆర్ చూపిన చొరవ జగన్ చూపడం లేదంటూ , టీడీపీ నేతల మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు టీడీపీ నేతలు థ్యాంక్స్ చెప్పారు.
ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బిడ్డింగులు వేసే అంశానికే తాము వ్యతిరేకమన్నారు. కానీ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు, తెలంగాణ ప్రభుత్వం బిడ్లు వేస్తామని ముందుకు రావడం సంతోషమని కొనియాడారు. పక్క రాష్ట్ర సీఎం బిడ్లు వేస్తామంటున్నప్పుడు…ఏపీ సీఎం జగన్ ఏం చేస్తున్నారు.? సీఎం జగన్ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా అని ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం బిడ్లు వేస్తామని ఏపీ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. బిడ్లకే తాము వ్యతిరేకం.కానీ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఓ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనేదే తమ డిమాండ్ అన్నారు. ఢిల్లీ వెళ్లి సీఎం జగన్ నేతృత్వంలో పోరాడాలని., మేమూ కలిసి వస్తామని చంద్రబాబు స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. జగన్ పోరాటం చేయకుండా కేంద్రానికి ప్రేమ లేఖలు రాస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్ర సీఎం ప్రైవేటీకరణ కాకుండా బిడ్లు వేస్తామంటూ చూపుతోన్న చొరవ.ఏపీ సీఎం జగన్ ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామనే కోపం, సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ మీద చూపుతున్నారా. ఉత్తరాంధ్ర ఎన్నికల్లో ఓడిపోయిన కోపం ఇలా చూపిస్తామంటే జగన్‌ను ఎవ్వరూ కాపాడలేరు. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవను ఏపీ ప్రభుత్వం ఎందుకు చూపడం లేదు.అని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని గుర్తుచేశారు.స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ మౌనం దేని కోసం, అఖిలపక్షాన్ని తీసుకెళ్తామన్న సీఎం జగన్ మాటలేమయ్యాయి, ఇన్ని సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిన సీఎం.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయాన్ని ఎందుకు వ్యతిరేకించడం లేదు,కేసుల నుంచి తప్పించండని కోరడానికే ఢిల్లీకి వెళ్తున్నారా, ఇంత మంది ఎంపీలను గెలిపించినా. సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు పోరాడడం లేదు,అని ఆయన ప్రశ్నించారు.