Home » చనిపోయే వారికి తులసి తీర్థం ఎందుకుపోస్తారు?

చనిపోయే వారికి తులసి తీర్థం ఎందుకుపోస్తారు?

– తులసి ఒక నమ్మకం కాదు.. వైద్య శాస్త్ర నిజం

అతిముఖ్యమైన రోగనిరోధకశక్తిని శరీరంలో ఉత్పత్తి చేసే పవర్ హౌస్ ఎక్కడ ఉంది?
అష్టాదశమహాపురాణాలు, శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణంలోని ప్రకృతిఖండం లో చాలా ప్రధానమైంది కీలకమైన పితృదేవతారహస్య లో అతిముఖ్యమైన స్తోత్రాలు ఇందులో ఉన్నాయి. అంతేకాక స్వధా మాత జన్మరహస్యాలు కూడా ఇందులో ఉన్నాయి. దీనితో పాటుగా మహాసాధ్వి తులసీదేవి మాహాత్మ్యం కూడా ఇందులో ఉంది.

తిప్పతీగ నుంచీ తయారు చేసే గిల్లోయ్ ఘనవతి, అశ్వగంధ కాప్యూల్స్ (లేదా చూర్ణం), నువ్వుల నూనె (లేదా తినే కొబ్బరినూనె), తాంబూలం వేసుకునేవారు, ఆయిల్ పుల్లింగ్ చేసేవారు. వీరంతా అదృష్టవంతులు అయితే వీరిలో మహాదృష్టవంతులు తులసీమాతను సేవించేవారు.

ఆయుర్వేదం వైద్య విధానంలో అతి ప్రధానమైంది ఓజస్సును పెంపుదల చేయడం. ఈ వైద్యరహస్యం నేటికీ ఆంగ్లవైద్యులకు తెలియదు. అందరికీ రోగనిరోధక శక్తి గురించి తెలుసు. కానీ ఈ శక్తిని శరీరంలో ఉత్పత్తి చేసే కర్మాగారం ఎక్కడ ఉందో అల్లోపతి వారికి తెలియదు. శరీరంలో రోగనిరోధక శక్తిని తయారు చేసేదే ఓజస్సు.

ఆయుర్వేదం ఈ ఓజస్సు అనే అణువిద్యుత్తుకర్మాగారంలో సమిధలు వేయడం ద్వారా వ్యాథులను అంతం చేస్తుంది. అంటే శరీరంలో ఓజస్సును పెంచితే, అది రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. ఈ రోగనిరోధక శక్తి వ్యాథులతో పోరాడి వాటిని శరీరం నుంచీ పారదోలుతుంది. ఈ రహస్యం నేటికీ ఆయుర్వేదం దగ్గర మాత్రమే ఉంది.

దీన్నే ఆయుర్వేద గ్రంథాలు ఈ విధంగా చెప్పాయి..
శరీరంలో ఉన్న అన్నిధాతువులకూ మూలం ఓజస్సు, ఇది చాలా ఉత్తమమైనది. చాలా మృదువైనది. నీటి తత్త్వం ఉన్నది. పరిశుద్ధమైనది. ఎరుపు పసుపు మిశ్రమ రంగులో ఉంటుంది. గర్భంలో శుక్రశోణితాల కలయికతో ఏర్పడే మొదటికణం జీవికి ప్రధానమైనది. అంటే స్త్రీ అండం, పురుష వీర్యం ఫలదీకరణం చెందిన తరువాత ఏర్పడిన పిండకణంలో కూడా ఈ ఓజస్సు ఉంటుంది.

అప్పటి నుంచీ ఇదే హృదయంగా (కేంద్రంగా) ఉంటుంది. ఇదే శరీరంలోని అనేక అంగాలను, భాగాలను ఏర్పరస్తుంది. కనుక శరీరం మొత్తం ఆవరించి, దీని అదుపులో ఉంటుంది. దీని ద్వారానే శరీరం మొత్తం పనిచేస్తుంది. ప్రాణ శక్తి మొత్తం ఈ ద్రవపదార్థం మీదే ఆధారపడి ఉంటుంది.

శరీరంలో ఓజస్సు నష్టం అయ్యే కొద్దీ కోపం పెరుగుతుంది. ఆకలిలో తేడాలు వస్తాయి. ధ్యానం చేయలేరు. దుఃఖం పెరుగుతుంది. శరీరం తొందరగా అలసిపోతుంది. ఎక్కవగా భయం ఏర్పడుతుంది. ఇంద్రియాలు అదుపులో ఉండవు. ఫలితంగా మానసిక వ్యథ పెరుగుతుంది. డిప్రషన్ లోకి వెళిపోతారు. శరీరం కాంతి రహితం అవుతుంది.

ఈ ఓజస్సును పరిరక్షించేవి, వృద్ధి చేసే పదార్థాలను తీసుకోవాలి. ఇది ఔషథాల ద్వారా పెరుగుతుంది. తీపి పదార్థాలతో పెరుగుతుంది. పాలలో ఉంటుంది. మాంసకృత్తులలో ఉంటుంది. నెయ్యిమొదలైన వాటిలో ఉంటుంది. పై వస్తువులను సేవించడం వలన మరలా శరీరంలో సంతోషం, బలం, ధాతుపుష్టి పెరుగుతాయి. వీర్యవంతులు అవుతారు.

ఆయుర్వేదం శరీరానికి కీలకమైన ఓజస్సును కనుగొంది. నేటికీ ఆంగ్ల వైద్యం దీన్ని సాధించలేదు. కనుకనే రోగి చెప్పే ప్రతీ లక్షణానికి ఒక మందు చొప్పున వేస్తూ క్వింటాళ్ళ కొద్దీ తినిపిస్తుంది. ఈవిధంగా వారు ఇచ్చే మందులు మింగి హరాయించుకోలేక మైఖేల్ జాక్సన్ అనే డాన్సర్ చనిపోయాడు. అతని శవాన్ని పరీక్షిస్తే జీర్ణం కాని అనేక మందుబిళ్ళలు కనిపించాయి.

నేటికీ లక్షణాలకు వైద్యం చేస్తూ ఆంగ్ల వైద్యం కారణాన్ని చేరుకోలేదు. దీనికి సంపూర్ణ వ్యతిరేకంగా ఆయుర్వేదం శరీరంలో రోగనిరోధక శక్తిని కల్పించే పవర్ హౌస్ను పనిచేయించే మందులు కనిపెట్టింది.

ఇటువంటి మందులు ఆయుర్వేదంలో చాలా కీలకం

అవే అశ్వగంధ, అమృతం అనిపిలిచే తిప్పతీగ, ఉసిరి వంటివి. వీటికి తోడుగా మరో మహిమాన్వితమైన మూలిక ఉంది. అదే తులసి. ఆధ్యాత్మికంగా కూడా తులసికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆయుర్వేదంలో కూడా తులసికి అంతే ప్రాధాన్యత ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే శరీరం అనే జీవ అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అవసరమైన యురేనియం వంటిది తులసి.

నిజానికి మరణించేవాని నోట్లో తులసి తీర్థం పోయడం అంటే నాలుగు చేతుల వాడిని చేర్చే ద్రవం కాదు. రోగి శరీరంలో ప్రాణవాయువులను కూడా పనిచేయించే ఓజశ్శక్తిని తిరిగి ప్రజ్వలింప చేసేటటువంటి జలకర్మ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గుండె ఆగిపోయిన వ్యక్తికి ఆధునిక వైద్యులు ఇచ్చే షాక్ ట్రీట్ మెంట్ వంటిది. ఈ విధంగా తులసి తీర్థం పోయడం వలన కొట్టుమిట్టాడుతున్న కొనప్రాణదీపంలో మరలా నూనె పోసి వత్తిపెద్దది చేయడం వంటిది. దీన్నే దింపుడు కళ్ళం ఆశ అంటారు. దీనితరువాత కూడా రోగి కోలుకోపోతే అతడు మృతుడైనట్టు లెక్క.

చాలా ఆశ్చర్యమేమంటే తులసిలోని ఈ పవర్ హౌస్ లక్షణాలు ఆధునిక వైద్యలు గ్రహించారు. అయితే ఇది బయటికి చెబితే తమ వైద్యవ్యభిచారం బయటపడుతుందని నొక్కిపెడుతున్నారు. ఆధునిక పరిభాషలో ఎడాప్టోజెన్స్ పేరుతో కొందరు తులసి, ఉసిరి, తిప్పతీగ వంటివాటి మీద పరిశోధనలు చేస్తున్నారు. అయితే వీరు అత్యంత ప్రమాదకారులు. ఎందుకంటే వీరు రేపు పసుపు మాదిరిగా తులసి, ఉసిరి కూడా మావే అని దోపిడీ లైసెన్సులు పొందుతారు. వీటి మీద మందులు చేయరాదని శాసిస్తారు.

తులసిని సేవించడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం
తమ వద్ద ఎప్పుడూ పదో ఇరవయ్యో తులసీ దళాలు ఉంచుకోవాలి. వీటిలో కొన్నింటిని వాటర్ బాటిల్లో నలిపి వేసి ఉంచుకోవాలి. మరికొన్నింటిని చిన్న భరిణలోనో జిప్ప్డ్ ప్లాస్టిక్ చిన్న కవర్ లోనో పెట్టుకోవాలి. తాము తాగే టీలో వాటిని వేసుకోవాలి. అన్నంతిన్నతరువాత, టిఫెన్ చేసినప్పుడూ మౌత్ రిఫ్రషర్గా ఒక తులసీదళం నోట్లో వేసుకోవాలి.

గృహిణులు కూడా నీటిలో ఈ తులసీదళాలు వేసి ఉంచుకోవాలి. ఇలా చేయాలంటే తులసికోటల సంఖ్య పెంచుకోవాలి. నిర్ణీత ప్రమాణాన్ని మించి మొక్కల నుంచీ తులసి తుంచకూడదు. కుటుంబ సభ్యులు అందరినీ తరచుగా తులసి ఉన్న నీటిని తీసుకునేలా చేయాలి. దీని వల్ల ప్రధానంగా మానసిక సమస్యల నుంచీ దూరం అవుతారు. అందువల్ల ఇతర సమస్యలు రావు.

ఈ చిట్కాలు ఆయుర్వేదం చెప్పిందని భారతప్రభుత్వ ప్రత్యామ్నాయ వైద్యాభివృద్ధి సంస్థ చెప్పింది.

తులసి అద్భుతమైన స్ట్రెస్ రిలీవర్. మానసిక వత్తిడిని క్షణంలో దూరం చేస్తుంది. అజీర్ణతను నిరోధించి ఆహారం జీర్ణం అయ్యేందుకు సహకరిస్తుంది. ఈ విధంగా చెప్పుకొంటూ పోతే ఒక పుస్తకం చాలదు. మహా ఉద్గ్రంథాలు వ్రాయాల్సి వస్తుంది. కనుక క్లుప్తంగా చెప్పాలంటే శరీరంలో రోగనిరోధక శక్తిపెంచి, రక్త మాంస ఎముక మూలుగు చర్మ కేశాది సమస్తధాతువుల చేతా పనిచేయించే పవర్ హౌస్ ఓజోస్సును క్షణంలో పెంచుతుంది.

కనుక నిన్నమొన్నటి వరకూ అమ్మానాన్నలు తాతమామ్మలు తిడతారని తులసిమొక్కను కోటలో కాకుండా విరిగిపోయిన ప్లాస్టిక్ పాత్రల్లో పెంచినవాటిని విరివిగా ఎపార్ట్ మెంట్లలో పెంచుకొని ప్రతి ఒక్కరూ కనీసం పది తులసి దళాలు స్వీకరిస్తే కరోనా కాదు కదా దాని బాబులు, అక్రమబాబులు వెయ్యిమంది కూడా ఏమీ చేయలేరు.

లేదా, మీకు ఓపిక ఉంటే ఆయుర్వేద మందుల దుకాణాలు గాలించి తులసీ ఘనవటీ సాధించండి. లేదా తులసితో తయారు చేసిన ఏ ఔషథం దొరికినీ సేవించండి. అయితే ఇవి దొరుకుతాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఉత్తరాదిలో ఉత్పత్తి అవుతున్న ఈ తులసీ ఘనవటి అక్కడే ఖర్చైపోతోంది. వారి పంపిణీ ఇక్కడి వరకూ రావడంలేదు.

తులసి ఒక నమ్మకం కాదు. వైద్య శాస్త్ర నిజం. ఒక మతానికి పరిమితం అయింది కాదు. విశ్వమానవశ్రేయస్సు కోసం పరమాత్మ ఇచ్చిన దివ్యఔషథం. తులసి మానసిక వ్యాధులకు పనిచేస్తుంది. కిడ్నీని, లివర్ ను కాపాడుతుంది. చర్మవ్యాథుల నుంచీ కాపాడుతుంది. జ్వరాలు రానివ్వదు. ఊపిరితిత్తులు, గుండెజబ్బులు, కేన్సర్ వంటివాటిని చేరనివ్వదు. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

కనీసం నేడైనా దీన్ని పాటిస్తే రేపు సుఖంగా ఉండవచ్చు.

– ఎంబిఎస్ గిరిధర్‌రావు

Leave a Reply