Suryaa.co.in

Andhra Pradesh

కరెంటు ఎందుకు పోతుంది?

– బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పి సమాధానం చెప్పాలి
– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు ఫ్యాన్ కు ఓటేశారు అదే ఫ్యాన్ కు ఉరేసుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రజానీకం ఉంది. రాష్ట్ర ప్రజలకు ఫ్యాన్ రెక్కలే కత్తులుగా మారాయి.
వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ, అప్రకటిత విద్యుత్ కోతలను నిలుపుదల చేయాలంటూ కీసర గ్రామంలో ఇంటింటికి ప్రతి ఒక్కరికి అగ్గిపెట్టెలను, కొవ్వొత్తులను,కరపత్రాలను పంచాం.రాష్ట్ర రైతాంగం కన్నీరుమున్నీరవుతుంది రైతు గోడును పట్టించుకునే నాధుడే లేడు.

నందిగామ నియోజకవర్గంలో సుబాబుల రైతాంగానికి టన్నుకు 5 వేల రూపాయలు ఇస్తానని పాదయాత్రలు చేసిన శాసన సభ్యుడు ఎక్కడ? సుబాబుల రైతాంగానికి ప్రతిపక్షంలో మీరు ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చాక వారికి మీరు ఏం చేశారో బహిరంగ సమాధానం చెప్పాలి.నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే బొమ్మ అర్థమైపోయింది మొన్న జరిగిన ప్లీనరీ సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు మీ మీ స్థానాలు తప్పనిసరిగా గెలవాలని గీతోపదేశం చేస్తున్నాడు.గ్రామాలలో అధికార పార్టీ నాయకులు తిరగాలంటే వాళ్లందరికీ వినిపిస్తున్న పాట ఒకటే ప్రజలందరూ బాదుడే.. బాదుడు.కీసర గ్రామ తెలుగుదేశంపార్టీ ఉత్సాహం చూస్తుంటే నూతనోత్సాహం కనబడుతుంది.ప్రతి ఒక్కరు రానున్న ఎన్నికలలో రెట్టింపు ఉత్సాహంతో కలిసికట్టుగా పని చేయాలి.

రాష్ట్రంలో వైసీపీ పార్టీకి చరమగీతం పాడి మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా చేసే వరకు అందరూ శక్తివంచన లేకుండా కష్టపడదాం

LEAVE A RESPONSE