చెప్పింది తప్పని రుజువుచేస్తే,మంత్రి పదవికి బొత్స రాజీనామా చేస్తాడా?

– ఓటీఎస్ స్కీమ్ లో ప్రజలనుంచి నిర్బంధంగా వసూళ్లకు పాల్పడటంలేదని బొత్స బొంకుతున్నారు
– ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దుచేసి, ఎన్నికలకు వెళతారా?
– వారివాదనే నిజమని తేలితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేయడానికి సిద్ధం
• రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చిన జగన్మోహన్ రెడ్డి, తెచ్చినఅప్పులు ప్రజలనుంచి పన్నులు, పెంచినధరలరూపంలో వసూలుచేస్తున్నదంతా ఏంచేస్తున్నాడు?
• ది గ్రేట్ లయర్ అయిన జగన్మోహన్ రెడ్డి, ది గ్రేట్ బ్లఫ్ మాస్టర్ గా ప్రజలతో కీర్తింపబడుతూ, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక పిల్లిమొగ్గలు వేస్తున్నాడు.
• పేదలఇళ్లపైకి అధికారులు, వాలంటీర్లను పంపి వారిని భయభ్రాంతులకు గురిచేయకుండా, వారికోసం రూ.4,800కోట్లను ప్రభుత్వం మాఫీచేయలేదా?
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి
ది గ్రేట్ లయర్ అయిన రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గ్రేట్ బ్లఫ్ మాస్టర్ గా కీర్తింపబడు తున్నాడని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక పిల్లిమొగ్గలువేస్తున్నాడని, ఏపీని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేసి, రాష్ట్రాన్ని అదానీకి అమ్మకానికి పెట్టడానికి సిద్ధమయ్యాడని, సంక్షేమం మసుగులో ఎక్కడాలేని భారీదోపిడీచేస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో వి లేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ప్రతిపక్షనేతగా ఊరూరాతిరిగి చేసినవాగ్ధానాలను గాలికివదిలేసిన ముఖ్యమంత్రి, ప్రజాధ నాన్ని దోచుకోవడం కోసం ప్రత్యేకకార్యాచరణతో ముందుకెళుతున్నారు. ప్రజలకు పావలా ఇస్తున్నముఖ్యమంత్రి, మిగిలిన 75పైసలను తనఖజానాకుతరలిస్తున్నాడు. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్ స్కీమ్ (వన్ టైమ్ సెటిల్మెంట్) పై ఏదేదో బొంకుతున్నారు. ఓటీఎస్ స్కీమ్ స్వచ్ఛందం అనిచెప్పామే గానీ, తాము ఎక్కడా, ఎవరినీ బలవంతంచేయడంలేదని బొత్ససత్యనారాయణ అంటున్నారు. పైకి అలాచెబుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, యానిమేటర్లు, సీపీఎమ్ లు, గ్రామ, మండల, జిల్లాస్థాయి అధికారులకు రూ.6వేలకోట్లు వసూలుచేయాలని మౌఖిక ఆదేశాలిచ్చారు.
కొన్ని జిల్లాల్లో అయితే సబ్ కలెక్టర్లు, కలెక్టర్లు ప్రభుత్వఆదేశాల్లోనే నిమగ్నమై, ప్రజలను దారుణంగా వేధి స్తున్నారు. ఓటీఎస్ స్కీమ్ స్వచ్ఛందం అంటున్న బొత్స అదినిజంకాదని నేను నిరూపిస్తే, తనమంత్రి పదవికిరాజీనామాచేస్తారా? అలానే ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వాన్నిరద్దుచేసి, తిరిగి ఎన్నికలకువెళతారా? వారుచెప్పింది నిజమని తేలితే తాను ఎమ్మెల్యేపదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తాను విసిరిని సవాల్ కు మంత్రిబొత్స కట్టుబడుతారా? ఎన్నికలకు ముందు 300చదరపు అడుగులలోపు ఉండే టిడ్కో ఇళ్లను ఉచితంగానే పేదలకు అందిస్తామని జగన్మోహన్ రెడ్డిచెప్పారు.
ఓటీఎస్ పేరుతో ఆఖరికి డ్వాక్రామహిళలు దాచుకున్న పొదుపుసొమ్ముని కూడాకాజేయడానికి సిద్ధమయ్యారు. చెల్లికి జరగాలి మళ్లీ పెళ్లి అన్నట్లుగా ఓటీఎస్ కింద ఈ ప్రభుత్వం దారుణంగా వసూళ్లకు పాల్పడుతోంది. ఇప్పటి కే గృహనిర్మాణాలకు అనేకసంస్థలు అప్పులిచ్చాయి. పేదలు నిర్మించుకున్నఇళ్లకు సంబం ధించిన పత్రాలు ఆ సంస్థలవద్ద ఉన్నాయి. పేదలు ఓటీఎస్ కింద డబ్బుకట్టాల్సిందే అంటున్న ప్రభుత్వం, వాటికి జవాబుదారీగా నిలుస్తుందా అని ప్రశ్నిస్తున్నాం. 1983లో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారుప్రారంభించిన పక్కాఇళ్లనిర్మాణాన్ని తరువాత అనేకప్రభుత్వాలు ఉన్నంతలో కొనసాగించాయి.
అలా ఎప్పుడో నిర్మించుకున్న ఇళ్లకు వసూళ్లంటూ ఈప్రభుత్వం పేదల గోళ్లు ఊడబీకుతోంది. ప్రభుత్వఆదేశాలతో ఇప్పటికే వాలం టీర్లు, ఇతరత్రా ఉద్యోగులు, అధికారులు పేదలఇళ్లపై పడి వారిని పీక్కుతింటున్నారు. కొన్ని చోట్ల ఆయాఅధికారులు, సిబ్బందే కాల్ మనీ వ్యాపారుల్లా మారి, మీదగ్గర డబ్బులేకుంటే మేంఇప్పిస్తాం, అది తీసుకొని వెంటనేప్రభుత్వానికిచెల్లించండి అంటూ హితోపదేశంచేస్తున్నా రు. ప్రజలుఇళ్లు నిర్మించుకోవడానికి అప్పులిచ్చిన సంస్థలకు వెళ్లాల్సిన డబ్బులను ప్రభుత్వం తనబొక్కసంలోఎలా వేసుకుంటుంది?
జగనన్న కాలనీల పేరుతో ఎక్కడా పునాది కూడా వేయని ప్రభుత్వం, ఇప్పుడు తరతరాలనుంచి పేదలు ఉంటున్నఇళ్లపై పన్నులు వేస్తోంది. కూరగాయలుసహా, విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్ డీజిల్ ధరలు, ఇళ్లపన్ను,చెత్తపన్ను ఇతరత్రా పన్నులేస్తూ వసూలుచేస్తున్నదిచాలక, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అదానీకి అమ్మే యడానికి సిద్ధమయ్యాడు. ఎప్పుడో కట్టిన ఇళ్ల పత్రాలు ఇవ్వండి.. ప్లాన్లు ఇవ్వండి అంటున్న ఈముఖ్యమంత్రి శాడిస్ట్ విధానాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సంక్షేమం ముసుగులో ముఖ్యమంత్రి సాగిస్తున్నదోపిడీకి పరాకాష్టే, ఓటీఎస్ పేరుతో చేస్తున్న వసూళ్లు.
పథకాలపేరుతో మీటలునొక్కడానికే ముఖ్యమంత్రి పరిమితమయ్యాడు. కానీ ఎక్కడా ప్రజల ఖాతాల్లో ఆయన చెబుతున్నవిధంగా డబ్బులు పడటంలేదు. కోవిడ్ మృతులకు పరిహారమి చ్చే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అనేక ఆసుపత్రుల్లో ఇప్పటికీ మందులు, పడకల కొరత వేధిస్తోంది. ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన లక్షలకోట్ల అప్పులు ఏమయ్యాయి? ఇరిగేషన్ రంగానికి, రహదారులకు, ఇతరత్రా నిర్మాణాలకు రూపాయి ఖర్చుపెట్టలేదు. స్థానికసంస్థల ఆర్థిక భద్రతను ప్రభుత్వం అపహాస్యంగా మార్చింది. ఆఖరికి పంచాయతీల్లో పారిశుధ్యనిర్వ హణకు, వీధిదీపాలు వేయడానికి కూడా నిధులు లేకుండాచేశారు.
కేంద్ర్రప్రభుత్వం పంటలబీమాకు నిధులుకేటాయిస్తే, ఈప్రభుత్వం తనవాటాగా చెల్లించాల్సిన సొమ్ముచెల్లించకుండా రైతులను వంచించింది. ఈనాడు వరదలవల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతే వారిని ఆదుకునేవారు లేకుండా పోయారు. సంక్షేమానికి, ఇతరత్రా రంగాలకు ఎంతెంత ఖర్చుపెట్టారో ముఖ్యమంత్రి తక్షణమే శ్వేతపత్రం విడుదచేయాలి. సీఎఫ్ఎంఎస్ ముసుగులో డబ్బంతా పక్కదారి పడుతోంది. ఆఖరికి గ్రామాల్లో వీధిదీపాలు కూడా ఏర్పాటుచేయడానికి పంచాతీయలకు నిధులు లేకుండా చేశారు.
పేదవారిగూళ్ల తాలూకాబకాయిలను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దుచేస్తుంది. లక్షలకోట్ల అప్పులు తెచ్చి, సంక్షేమం అమలు చేస్తున్నానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, పేదలఇళ్లకోసం రూ.4,800కోట్లను మాఫీ చేయలేడా? టిడ్కోఆధ్వర్యంలో గతప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తక్షణమే పేదలకు కేటాయించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అధికారులపై ఒత్తిడితెచ్చి ఓటీఎస్ స్కీమ్ కు రూ.6వేలకోట్లు వసూలు చేయాలని లక్ష్యాలు విధించడాన్ని కూడా తీవ్రంగాతప్పు పడతున్నాం. ప్రభుత్వం తక్షణమే వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని రద్దు చేయాలి.
ఓటీఎస్ స్కీమ్ కింద ప్రజలనుంచి బలవంతంగా అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. రూ.6వేలకోట్లు వసూలుచేయాలన్న పాలకులలక్ష్యాలకు అనుగుణంగా వారు పనిచేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు, వాలంటీర్లకు ఈనెలాఖరులోగా రూ.6వేలకోట్లు వసూలుచేయాలనిచెప్పి, ఓటీఎస్ కింద పేదలుకట్టాల్సింది రూ.4,800కోట్లేనని చెబుతోంది.
ఆ సొమ్ముఎంతైనాగానీ, పేదలపై భారంపడకుండా ప్రభుత్వం మొత్తాన్ని మాపీచేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడో 1980కు ముందు నిర్మించుకున్నఇళ్లకు సంబంధించిన కాగితాలు కావాలంటే ప్రజలు ఎక్కడినుంచితెస్తారు? ప్రభుత్వంకొంతసొమ్ము ఇస్తే, హడ్కో వంటి ఇతరత్రా సంస్థలు ఇచ్చినమరికొంతసొమ్ముకి, వారివద్దఉన్న సొమ్ముకలిపి కష్టపడి ఇళ్లునిర్మించుకుంటే, ఈప్రభుత్వానికి డబ్బులు ఎందుకు కట్టాలి?
అనేకమంది వారిఇళ్లను అమ్ముకున్నారు.. ఇప్పుడు వాటిలోఉంటున్నవారికి ఏంచేయాలో పాలుపోవడం లేదు. ప్రజల్లో తనపై వస్తున్న తిరుగుబాటుని గమనించకుండా, ముఖ్యమంత్రి ఇప్పటికీ నియంత్రత్వ విధానాలనే అమలుచేయాలని చూస్తున్నాడు.

Leave a Reply