నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ BSNL ను ఆదుకోవాటినికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల Rs.1.64 లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. మన దేశంలోని గ్రామీణ(grameena) ప్రాంతాల్లో(prantalo) టెలికాం సేవలను అందించటంలో, స్వదేశీ టెలికాం టెక్నాలజీ అమలు చేయటంలో మరియు విపత్తు సహాయక చర్యలు చేపట్టటంలో BSNL చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కానీ, 4G సేవలు అందించటంలో ప్రైవేట్(private) రంగ సంస్థలతో పోటీ పడలేకపోయింది, ఇందుకు ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవటం కూడా ఒక కారణం. దాదాపుగా 2015 నుంచి నష్టాల్లో నడుస్తున్న సంస్థను ఇప్పుడు ఆదుకోవటం మంచి పరిణామం. అయితే, ఈ ప్యాకేజీ కొంత నగదు రూపంలో ఇవ్వగా, మిగతాది ఆర్ధిక వనరులు పెంచుకునే తోడ్పాటు ఇవ్వటం జరిగింది.
ప్యాకేజీ వివరాలు:
1. మొదటగా సంస్థకు 4G స్పెక్ట్రమ్ లైసెన్సుకు Rs.44993 కోట్లు కేటాయించింది.
2. అలాగే సంస్థను 4Gకి అనుగుణంగా బలోపేతం చేయటానికి Rs.22471 కోట్ల మూలధన సహకారం అందించింది.
3. గ్రామీణ(grameena) ప్రాంతాల్లోని(prantalo) వైర్ లైన్ సేవలను సరిచేయడానికి Rs.13789 కోట్లు కేటాయించారు.
4. బాండ్స్ రూపంలో BSNL Rs.40399 కోట్లు BSNL సమకూర్చుకోవచ్చు, దీనికి ప్రభుత్వం హామీదారిగా ఉంటుంది.
5. స్థూల రాబడి మరియు GST బకాయిల సెటిల్మెంట్ కి కాను Rs.33404 కోట్లు ఇచ్చి ప్రభుత్వం సంస్థలో తన వాటాను పెంచుకుంది.
6. Rs.7500 కోట్ల విలువైన ప్రిఫెరెన్సు(preference) షేర్లను ప్రభుత్వానికి సంస్థ ఇస్తుంది.
ప్రభావం:
ప్రైవేట్(private) రంగ టెలికాం కంపెనీలతో పోలిస్తే BSNL కు ఆధునిక టెక్నాలజీ ఉందని చెప్పొచ్చు కానీ, కస్టమర్స్ ని పెంచుకునే విషయంలో విఫలమయింది. ఇప్పుడు ఈ ప్యాకేజీతో సంస్థకు మరియు ప్రభుత్వానికి ఉపయోగం అనే చెప్పాలి. మిలిటరీ ఆపరేషన్స్ కి టెక్నాలజీ సహాయం BSNL ద్వారా ప్రభుత్వం తీసుకుంటుంది. అలానే సంస్థకు యొక్క సర్వీసుని మెరుగుపరిచి ఆర్ధికంగా బలపరిచి 2026 -27 సంవత్సరానికి లాభాల బాట పట్టించటమే ఈ ప్యాకేజీ మూల కారణం.
