Suryaa.co.in

Andhra Pradesh

త్యాగానికి సిద్ధం అంటున్న చంద్రబాబు సీఎం అభ్యర్థిగా పవన్‌ను అంగీకరిస్తారా?

-మరోవైపు తానే పొత్తులను లీడ్‌ చేస్తానంటున్నాడు
-ఇక పవన్‌కళ్యాణ్‌ తానే సీఎం అవుతానంటున్నాడు
-మరి ఇద్దరు సీఎంలు ఎలా ఉంటారు?
-లేదా పవన్, చంద్రబాబును సీఎం చేస్తారా?
-ఎవరు ఏం చేస్తారు? సోము వీర్రాజు అయినా చెప్పాలి
-విపక్ష పార్టీలకు వారిలో వారికే స్పష్టత లేదు
-ఒకరు త్యాగం అంటారు. వేరొకరు తానే సీఎం అంటారు
-మరొకరు తాము ఎవరితోనూ కలవం అంటారు
-సాక్షి మాకు అనుకూలం
-తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన -కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే..:
అనైతిక పొత్తులుండొద్దు:
ప్రజల ఎజెండాకు సంబంధించి.. ఏ పార్టీ అయినా ప్రజల ముందుకు వెళ్లి, మేము ఇది చేయగలమని ఒప్పించి, మెప్పించి వాళ్ల ఆశీస్సులు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో పొత్తులు ఉండకూడదని కాదు. ఉంటాయి. అయితే అవి క్రూడ్‌గా టు ప్లస్‌ టు ఫోర్‌ కావడానికో లేక దాన్ని సిక్స్‌ చేసుకోవడానికో, రెండు కులాల బేస్‌ మీదనో, రెండు వర్గాల బేస్‌ మీదనో లేదా ఎన్నికల ముందు కలవడమూ ఎప్పటికీ మంచిది కాదని.. 1990 దశకంలో వచ్చిన ఫ్రంట్‌లతో తేలిపోయింది. అప్పుడు ఒకేసారి మూడుసార్లు ఎన్నికలు వచ్చాయి. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడనందువల్ల అది జరిగింది.
పొత్తులు ఉండొచ్చు. భావ సారూప్యత కలిగిన పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చు. అయితే భావ సారూప్యత అంటే ఏమిటి? ప్రజల ఎజెండా మీద ఏ పార్టీ వారికైనా ఏకాభిప్రాయం ఉందా? హౌ సీరియస్‌ దే ఆర్‌ ఎబౌట్‌ ది పీపుల్స్‌ ఇష్యూస్‌? పాలసీలు ఏమైనా ఉన్నాయా? సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా?

వ్యూహం అంటే సినిమా రీళ్లా?
నిన్న పవన్‌ కళ్యాణ్‌ అదంతా వ్యూహాత్మకం అంటున్నారు. వ్యూహం అంటే సినిమాల్లో రెండు రీళ్లలో నడిపేదా?. ప్రజలంటే అంత చులకనా? ఇవాళ వారి పత్రికలో, ఎల్లో మీడియాలో చూశాం. అసలు పొత్తులు లేకపోవడమే వైయస్సార్‌సీపీ బలహీనత అన్నట్లుగా ఎల్లో రాతలు. వైయస్సార్‌సీపీని ఎవరూ పట్టించుకోక పోవడం వల్లనే వారికి ఎవరితోనూ పొత్తులు లేవని ఎల్లో మీడియాలో రాశారు. అదేం విశ్లేషణో నాకు అర్ధం కావడం లేదు. అంటే ప్రజలను వారు ఎంత చులకనగా చూస్తున్నారనేది ఒకటి అర్ధమవుతుంది.

వారిలో వారికే స్పష్టత లేదు:
ఇక డైలాగ్‌లు చూస్తే.. చంద్రబాబునాయుడు తాము త్యాగాలకు సిద్దమని, అలాగే పొత్తులనూ లీడ్‌ చేస్తామంటారు. రెండో ఆయనేమో తన జనసేన అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు ఏదేదో చేస్తానంటున్నాడు. సీఎంగా తానే వస్తానంటున్నాడు. మరి ఇద్దరు సీఎంలు ఎలా ఉంటారో?.
ఇక త్యాగం చేయడమంటే చంద్రబాబు .. ఒకవేళ తనకు సీఎం పదవి వస్తే, త్యాగం చేసి పవన్‌కళ్యాణ్‌ను ఆ పదవి ఇస్తారా? ఆ విషయమైనా చెప్పాలి. లేదా చంద్రబాబుగారిని సీఎంను చేయడానికి పవన్‌ కళ్యాణ్‌ సిద్దంగా ఉన్నారా? అన్న విషయం ఆయన అయినా చెప్పాలి. లేకపోతే సోమూ వీర్రాజు చెప్పాలి. తమకు ఎప్పటికీ వీళ్లను మోయడమే పనా? అన్న విషయం ఆయన చెప్పాలి. ఆయన ఇప్పటికే మేము అసలు మోయం అని చెబుతున్నాడు.
వాస్తవానికి వారికి ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌తో పొత్తు ఉంది. బీజేపీతో పొత్తులో ఉన్న ఆయనేమో (పవన్‌కళ్యాణ్‌) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని అంటున్నాడు. తాము ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమని ఒక పక్క చెబుతూనే, మరోవైపు తాము ఎవరితో పొత్తు పెట్టుకోవాలో ఆలోచిస్తామని అంటున్నారు. అలాగే తాము ఎవరితో సాగాలన్నది మీరెలా డిసైడ్‌ చేస్తారని ఇంకో మాట అంటారు.

పవన్‌ ఎవరితో పొత్తుకు వెళ్తారు?
ఇక్కడ వైయస్సార్‌సీపీని తీసేస్తే, ప్రధానంగా ముగ్గురే కనిపిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు 5 ఏళ్లు పాలించిన తెలుగుదేశం పార్టీ ఉంది. రెండోది జనసేన. మూడోది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. ఇక్కడ మూడు పార్టీలే ఉన్నాయి. వైయస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వబోమని ప్రతిజ్ఞ చేసినప్పుడు, వీరు ఏమైనా కలుస్తున్నారా? అనేది ఓపెన్‌గా కూడా చెప్పడం లేదు. ఒకరేమో త్యాగాలకు సిద్దం అంటున్నారు. మరొకరేమో తామే సీఎం అభ్యర్థి అంటున్నారు. మరొకరేమో వాళ్లతో తామెందుకు కలుస్తామని ప్రశ్నిస్తున్నారు.
ఇంత గందరగోళం మధ్య, పవన్‌కళ్యాణ్‌ అన్నట్లు తెలుగుదేశంను తీసేస్తే, ఇంకా ఆయనకు ఎవరు మిగులుతున్నారు?. బయటి పార్టీలు ఏమైనా ఇతర రాష్ట్రాలలో ఉన్నవి.. బీఎస్పీ, శివసేన, సమాజ్‌వాదీ లేదా కేఏ పాల్‌ పార్టీ. దేంతో పొత్తు పెట్టుకుంటారో తెలియదు.

స్పష్టత లేదు:
రాజకీయ తెర మీద ఏమున్నాయో ప్రస్తావించినప్పుడు ఒక స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు అంటే, రెండే కనిపిస్తాయి. ఒకటి ప్రజలంటే లెక్కలేదు. మరొకటి ఏవో పగటి కలలు కంటూ, వారి ఊహా ప్రపంచంలో కొట్టుకుంటున్నారని అనిపిస్తుంది.

చంద్రబాబు స్క్రీన్‌ప్లే. డైరెక్షన్‌:
కానీ ఒకటి మాత్రం వాస్తవం. 2014 నుంచి చూస్తే, వారి మధ్య నిరంతర అవగాహన ఉంది. చంద్రబాబు స్కీమ్‌ ప్రకారం, ఆయన కధ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ప్రకారమే పవన్‌ కళ్యాణ్‌ నడుస్తున్నాడు. ఇది అందరికీ కనిపిస్తోంది. లేకపోతే 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనా పవన్‌ ఏనాడూ ప్రశ్నించలేదు. విమర్శించలేదు.

పవన్‌ ఏకైక లక్ష్యం అదే:
అసలు ఆరోజు బాగుంటే అదైనా చెప్పాలి. ఆరోజు నిజంగా బాగా జరిగి ఉంటే, 2019 ఎన్నికల్లో ఎందుకు పక్కకు పోయారో? అలా పోయినట్లు ఎందుకు నటించారో అదన్నా చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఆ రెండు పార్టీలు పక్కకు పోలేదు. పోటీల్లో డమ్మీలు పెట్టడంలోనే ఆ విషయం తెలుస్తోంది. ఆయనకు (పవన్‌కళ్యాణ్‌) కావాల్సింది ఏమిటి, ఆరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏకం కావొద్దు. కానీ ఈరోజు వైయస్సార్‌సీపీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలొద్దు.
ఇది ప్రజలకు సంబంధం లేదు. ప్రజల ఎజెండాకు సంబంధం లేదు. ప్రజాస్వామ్యంతో సంబంధం లేదు. కేవలం చంద్రబాబును తిరిగి అధికారంలో ఎలా కూర్చోబెట్టాలి అనేదే ఏకైక కార్యక్రమం. అదే ఆయన కార్యక్రమం. దానికి సంబంధించినంత వరకు, ఆ ప్రణాళికలో భాగంగానే వీరంతా మాట్లాడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది.

ఆ మాటలకు విలువ లేదు:
జగన్‌మోహన్‌రెడ్డిగారు ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నప్పుడు ఆయనను ఏదో ఒక రకంగా గద్దె దించాలి. అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా గద్దె దించాలి అనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలకు రకరకాల మాటలు వీళ్ల నోటి నుంచి వస్తున్నాయి తప్ప, వాటికి ఎలాంటి విలువ లేదని మేము అనుకుంటున్నాం.
వారు ఇప్పుడు పొత్తులోనే ఉన్నారు. వారి సంసారం నడుస్తూనే ఉంది. మధ్యలో కొద్ది రోజులు వేరుగా ఉన్నట్లు నటిస్తూ సహజీవనం చేస్తున్నారు. లేదా కొద్దిరోజులు పెళ్లి చేసుకుని కూటమిలో నడుస్తున్నారు.

సొంతంగా ఏనాడూ గెలవలేదు:
ఇందులో చంద్రబాబుగారి దివాళాకోరుతనం, ఆయనకు ప్రజలంటే లెక్కలేనితనం, బరితెగింపు ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సొంతంగా అధికారంలోకి రాలేదు.
తొలుత తన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 1999లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఛరిస్మాతో, వారితో అవగాహనతో అధికారంలోకి వచ్చారు. 2004లో ఓడిపోయారు. మళ్లీ 2009లో మహాకూటమి ఏర్పాటు చేసి ప్రయత్నం చేశారు. 2014 వచ్చే సరికి బీజేపీతో జత కట్టారు. అంతకు ముందు మోదీపై అంతులేని విమర్శలు చేసిన చంద్రబాబు, ఆ ఎన్నికల నాటికి ఆయన చెంత చేరారు. మోదీ వేవ్‌లో వచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు, ఏవో లెక్కలు వేసుకుని, పక్కకు జరిగారు. ఆ ఎన్నికల్లో పక్కకు జరిగినట్లు నటించారు. కానీ ఆ తర్వాత బద్వేల్‌ ఉప ఎన్నిక వచ్చేసరికి బీజేపీతో కలిశారు. అక్కడ ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. అది స్పష్టంగా కనిపించింది.
ఈ రాజకీయం ఎంత సేపున్నా, ఎదుటి పక్షాన్ని (అధికార పార్టీ అయినా, విపక్షం అయినా) ఎలా దెబ్బ తీయడం అన్నది చంద్రబాబు ఏకైక లక్ష్యం. అంతే తప్ప పార్టీకి ఒక స్పష్టమైన విధానం లేదు.

అదీ జగన్‌ విశ్వాసం:
ఇక 2004లో వైయస్సార్‌పొత్తులు అంటారా? అది జాతీయ పార్టీ. అప్పుడు కూడా ఆయన వ్యతిరేకించాడు. అయినా పైనుంచి ఆదేశాలు రావడంతో ఒప్పుకున్నారు. కానీ ఇవాళ జగన్‌గారు తన పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత స్పష్టతతో ఉన్నారు. ప్రజలకు తాము జవాబుదారీ తప్ప, వేరే వారి అండతో గెలిస్తే, ప్రజలకు తగిన విధంగా సేవ చేయలేమని జగన్‌గారు నమ్ముతున్నారు.

ఇదీ సినిమానే అనుకుంటున్నాడు:
పవన్‌ కళ్యాణ్‌ సినిమా హీరో కాబట్టి. రాజకీయం కూడా సినిమానే అనుకుంటున్నారు. సినిమా కధ రీల్‌ రీల్‌కు మారుతుంది. ఇవాళ ఆయన కౌలు రైతులను ఆదుకుంటామంటూ తిరుగుతున్నారు. ఆయన చేస్తున్న ప్రతి పని చంద్రబాబు డైరెక్షన్‌ ప్రకారమే. ఆయన కార్యక్రమాలు, నినాదాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు మాటలే ఈయన మాట్లాడుతున్నారు. వారు కలిసి పోటీ చేసినా, విడిగా చేసినా.. ముందుగా అనుకుని చేసేవే. పొత్తు పెట్టుకోవడమే విప్లవాత్మక ఆలోచన అనుకుంటే, నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు.

ఎల్లో మీడియా–గోబెల్స్‌ ప్రచారం:
ఎల్లో మీడియా వైఖరి దారుణం. చంద్రబాబును సమర్థిస్తూ, ప్రభుత్వంపై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. 5 కోట్ల మంది ప్రజలను ఆమాయకులుగా చూస్తున్నారు. 2019లో చంద్రబాబును, పవన్‌కళ్యాణ్‌ను ప్రజలు దారుణంగా తిరస్కరించినా, దింపుడు కల్లం రాజకీయం చేస్తూ, తమ అనుకూల మీడియాలో గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. అయితే ఎంత చేసినా ప్రజలకు స్పష్టత ఉంది.
నిజం చెప్పాలంటే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, బీజేపీ అందరూ కలిసి ప్రజలను ఫూల్స్‌ను చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ పనిలో లోపాలుంటే చెప్పొచ్చు. లేదా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది చెప్పాలి. కానీ అవేవీ చేయకుండా రోజూ విషం చిమ్ముతున్నారు. తమ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.
ఏదో ఒక అంశాన్ని తీసుకోవడం దానిపై విమర్శలు గుప్పించడం, ఆ తర్వాత పవన్‌ టూర్‌. నాలుగు రోజులు తిరిగి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రెస్ట్‌ తీసుకుంటాడు. అప్పుడు చంద్రబాబు వస్తాడు. అవన్నీ విపరీతంగా ప్రచారం చేస్తారు.

ఆ విషయాన్ని ధైర్యంగా ఒప్పుకోరు:
దుష్ట చతుష్టయం. ఎల్లో మీడియా తాము టీడీపీ అనుకూలమని చెప్పే ధైర్యం కూడా చేయదు. మేము చెప్పుకుంటాం. సాక్షి మాకు అనుకూలం అని.
ఎల్లో మీడియాలో రాస్తారు. దానిపై చంద్రబాబు, ఆయన కుమారుడు ట్వీట్‌ చేస్తారు. టీడీపీ నేతతో తిట్టిస్తారు. దానిపై ఎల్లో ఛానళ్లలో చర్చలు పెడతారు. మర్నాడు వాటన్నింటినీ మళ్లీ రాస్తారు. ఇదే వారి పని. 2019 ఎన్నికల తర్వాత ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తున్నా, చంద్రబాబులో మార్పు రావడం లేదు. అది ఆయనకు పుట్టుకతో వచ్చిన బుద్ధి.. అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

LEAVE A RESPONSE