– ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ జాతీయ జెండా ఆవిష్కరణకు కూడా బయటకు రాకపోవడం శోచనీయం. ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగురవేయని మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా @ysjagan నిలిచిపోయారని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర విమర్శించారు. జెండా ఎగురవేయకపోవడం.. దేశాన్ని, స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని, జాతీయ జెండాను అవమానించడమే. పులివెందుల ఓటమి తెచ్చిన తీవ్ర ఫ్రస్టేషన్ దీనికి కారణం కావచ్చు. అయినా సరే బయటకు వచ్చి జాతీయ జెండా ఆవిష్కరించలేని స్థితిలో జగన్ ఉండడం అతని మానసిక స్థితికి అద్దంపడుతోందన్నారు.
రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు వంటి కష్టజీవులు కూడా కూడళ్లలో జాతీయ పండుగ జరుపుకుని దేశభక్తిని చాటుకుంటారు. కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ జాతీయ జెండా ఆవిష్కరణకు రాకపోవడం విచారకరమని ఆయన అన్నారు.