గుడివాడలోని కే.కన్వెన్షన్లో జూదం,క్యాసినో జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా

Spread the love

– పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంటా
– లేకుంటే చంద్రబాబు, లోకేష్ ఏం చేస్తారో చెప్పండి
– టీడీపీది అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బతికే చరిత్ర
– పార్టీ, సీఎం పదవి, సైకిల్ గుర్తు ఎలా వచ్చాయో చెప్పండి
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి, జనవరి 21: కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో కే. కన్వెన్షన్ ఉందని, సంక్రాంతి సందర్భంగా అక్కడ జూదం, క్యాసినో వంటివి జరిగాయని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని, పెట్రోల్ పోసుకుని అంటించుకుంటానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సవాల్ విసిరారు. శుక్రవారం సెక్రటేరియేట్ దగ్గర మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. గుడివాడలో జూదం, క్యాసినో జరిగాయని గజ్జి కుక్కలు, కుల కుక్కలు నిరూపించలేకపోతే చంద్రబాబు, ఆయన తొత్తులు ఏం చేస్తారని ప్రశ్నించారు.

చంద్రబాబుకు టైం అయిపోయిందని, ఇటువంటి పనికిమాలిన కార్యక్రమాలే చేస్తుంటాడన్నారు. నిజ నిర్ధారణ కమిటీలో ఎప్పుడూ గెలవని వర్ల రామయ్య, ప్రజల చీత్కారానికి గురై, మహిళలను వేధించి విజయవాడలో ఓటమి పాలైన పనికిమాలిన వాళ్ళను వేశారన్నారు. ప్రశాంతంగా ఉండే గుడివాడలో రచ్చ చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదని చెప్పారు. పెడిగ్రీ తింటున్న కొంత మంది కుక్కలు రికార్డింగ్ డ్యాన్స్ లు జరిగాయని చూపిస్తున్నారన్నారు. మహిళలతో రికార్డింగ్ డ్యాన్స్ లు వేయిస్తున్నట్టుగా తనకు సమాచారం వస్తే వెంటనే గుడివాడ డీఎస్పీకి ఫోన్ చేసి తెలియజేశానన్నారు. అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఆదేశాలు ఇవ్వడంతో డీఎస్పీ అక్కడకు వెళ్ళి ఐదారు గంటల్లోనే అక్కడి నుండి అందరినీ పంపించివేశారన్నారు. దీనికి క్యాసినో ఆడారంటూ తన ప్రతిష్ఠను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు, ఆయన తండ్రి ఖర్జూరనాయుడు వచ్చినా గుడివాడలో తన చిటికెన వేలు మీద వెంట్రుక కూడా పీకలేరన్నారు.

చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు దగ్గర పెడిగ్రీ తింటున్న కుక్కలు మొరుగుతుంటాయని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కే. కన్వెన్షన్లో క్యాసినో నిర్వహించినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. గుడివాడలో ప్రజలు ఉన్నారని, మీడియా వెళ్ళి విచారణ జరపవచ్చని తెలిపారు. చంద్రబాబు పంపించిన వాళ్ళు వెళ్తే ప్రజల చేతుల్లో తన్నులు తిని వస్తారన్నారు. గుడివాడలో నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను ఎవరూ అడ్డుకోలేదని, కే. కన్వెన్షన్ దగ్గరకు వెళ్తే కొట్టి పంపించేవారని అన్నారు. పోలీసులు ఉండబట్టి ఈ పనికిమాలిన సన్నాసులు బతికి వెనక్కి వచ్చారన్నారు. న్యూట్రల్ గా వ్యవహరించే మీడియా వెళ్ళవచ్చని చెప్పారు. క్యాసినో జరగలేదని తేలితే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ఏం చేస్తారో ఈ చెత్తగాళ్ళు చెప్పాలన్నారు. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బతికే చరిత్ర తెలుగుదేశం పార్టీది అని అన్నారు. ఆనాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ కు ద్రోహం చేసి ఆయన పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న కుక్క చంద్రబాబు అని విమర్శించారు. అమ్మాయిని అడ్డం పెట్టుకుని సైకిల్ గుర్తు సంపాదించుకున్న బ్రోకర్ చంద్రబాబు అని అన్నారు. రాజకీయాల కోసం భార్యను రోడ్డెక్కించిన దుర్మార్గుడు చంద్రబాబు అని, ఆయన, పనికిమాలిన మీడియా చేసే విమర్శలను పట్టించుకోనని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

Leave a Reply