జూన్ 5లోగా మా ఉత్తర్వులు ఏమలు చేయాల్సిందే
– శివశంకర్‌ను ఏపీకి కేటాయించండి
– లేకపోతే కోర్టుధిక్కరణ ఎదుర్కోవలసిందే
– కేంద్రానికి క్యాట్ తలంటు
– పల్నాడు మాజీ కలెక్టర్ లోతేటి విషయంలో కేంద్రంపై క్యాట్ ఆగ్రహం
– ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ఏపీకి కేటాయించాలన్న ఆదేశాలు అమలు చేయకపోవడంపై నోటీసులు
హైదరాబాద్: ఐఏఎస్ అధికారి లోతేటి శివ శంకర్ ఏపీ ఇన్సైడ్ క్యాడర్ కేటాయించాలంటూ ఫిబ్రవరి 28న ఇచ్చిన ఆదేశాలను కేంద్రం అమలు చేయకపోవడంపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యు నల్(క్యాట్) ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 5లోగా ఉత్తర్వులు అమలు చేయాలని లేని పక్షంలో కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఏపీకి కేటాయించాలంటూ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై శివశంకర్ క్యాట్లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై క్యాట్ జ్యుడిషియల్ సభ్యురాలు డాక్టర్ లతా బస్వరాజ్ పట్నే, పరిపాలనా సభ్యురాలు వరుణ్ సింధు కుల్ కౌముదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
క్యాట్ ఆదేశాల అమలుకు 12 వారాల గడువు కావాలని కేంద్రం తరపు న్యాయవాది గడువు కోరగా క్యాట్ నిరాకరించింది. జూన్ 5లోగా ఉత్త ర్వులను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.