Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటా

– స్వర్గీయ ‘వల్లూరి సురేష్’ మృతి పార్టీకి తీరని లోటు
– సంతాప సభలో మంత్రి వాసంశెట్టి సుభాష్

రామచంద్రపురం : కష్టకాలంలో,ఆపదలో ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. నెలపర్తిపాడు గ్రామంలో ఇటీవల అకాల మరణం పొందిన తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ వల్లూరి సురేష్ బాబు (నీటి సంఘం అధ్యక్షులు) సంతాప సభ సోమవారం కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అధ్యక్షతన జరిగింది.

ఈ సంతాప సభలో మంత్రి సుభాష్ తో పాటు రామచంద్రపురం నియోజవర్గంలోని ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వల్లూరి సురేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. అనంతరం జరిగిన సంతాప సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ మంచి సౌమ్యుడుగా, అందరివాడుగా పార్టీ కోసం అలుపెరగని కృషి చేసిన వల్లూరి సురేష్ సేవలు చిరస్మరణీయమన్నారు. సురేష్ అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని, కుటుంబ యజమానిని కోల్పోయిన కుటుంబానికి తాము ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కూటమి పార్టీ సీనియర్ నాయకులు, మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం, ముక్కుసూటితనం, అందరితో కలిసిపోయే స్వభావం ఉన్న వల్లూరి సురేష్ తమ మధ్య లేరన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు.

LEAVE A RESPONSE