– సీఐడీకి సంబంధం ఏమిటన్న ఎంపీ ర ఘురామరాజు
టీడీపీ ఎమ్మెల్సీ ఆశోక్‌బాబు అరెస్టు వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళతానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. అశోక్ అరెస్టును ఆయన ఖండించారు. అసలు జగన్-సీఐడీకి ఉన్న అనుబంధమేమిటో అర్ధం కావడం లేదన్నారు. అశోక్‌ను పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారో తనకు తెలియకపోయినా, ఆయనను ఏ చేస్తారో తనకు తెలుసునన్నారు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని రాజు అన్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు.
పోలీస్ స్టేషన్‌లో ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. జగన్ రెడ్డి డైరెక్ట్‌గా జైలుకు వెళ్లారు.. కాబట్టి ఏమీ తెలియదన్నారు. అశోక్‌బాబు తండ్రి చనిపోతే ఆయనకు ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. లోకాయుక్తలో ప్రభుత్వానికి తెలిసిన వారితో పిటిషన్ వేయించి సీఐడీతో అశోక్‌బాబును అరెస్ట్ చేయించారని విమర్శించారు.అర్ధరాత్రి అరెస్ట్ ఏంటో అర్ధం కావడం లేదన్నారు. సీఎం జగన్‌కు.. సీఐడీకి ఉన్న బంధం ఏంటో తెలియదన్నారు. అశోక్‌బాబును అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని రఘురామ అన్నారు.
అశోక్‌బాబు ఏమైనా తప్పు చేస్తే సర్వీస్ రూల్స్ యాక్షన్ తీసుకుంటుందని, కానీ సీఐడీకి అప్పగించడం ఏంటని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. లేని హక్కును కల్పించుకుని సీఐడీ అధికారులు అశోక్‌బాబుపై క్రిమినల్ కేసు పెట్టారని విమర్శించారు. అశోక్‌బాబుకు ఎలాంటి హాని చేయొద్దన్నారు. ఈ ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.