Suryaa.co.in

Andhra Pradesh

నేరస్తులు పాలకులైతే మహిళల మానప్రాణాలకు రక్షణ ఉంటుందా?

– జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గుపడాలి.
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు
తెలంగాణలో గతంలో జరిగిన సామూహిక అత్యాచారఘటనపై ఉభయ తెలుగురాష్ట్రాలు స్పందించాయని, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో రాష్ట్రంలో దిశాచట్టం తీసుకొస్తున్నట్లు అసెంబ్లీలో చెప్పా డని, అదే సమయంలో తెలంగాణ సీఎంకు, ఈ ముఖ్యమంత్రి సెల్యూట్ కూడా చేశాడని, ఆనాడు ఆ విధంగా ప్రవర్తించిన ఏపీ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో తనహాయాంలో ఆడబిడ్డలు, యువతులపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలతో సిగ్గుతో తలదించుకోవాలని టీడీపీ అధికారప్రతినిది పిల్లి మాణిక్యరావు స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణలో జరిగిన ప్రియాంకరెడ్డి ఘటనపై ఆరాష్ట్రప్రభుత్వం స్పందిం చిన తీరుపై అత్యుత్సాహం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి, తన రాష్ట్రంలోని ఆడబిడ్డలకు రక్షణకల్పించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు, తనకుతానే సిగ్గుపడాలన్నారు. అదే తెలంగాణ ప్రభుత్వం, అక్కడిపోలీసులు చిన్నారిఛైత్రను అత్యాచారంచేసిన నిందితుడు భయంతో వణికిపోయి, తనకుతానుగా ఆత్మహత్యచేసుకునేలా చేశారన్నారు. స్వాతంత్ర్యదినోత్సవంనాడు ముఖ్యమంత్రి నివాసానికి అతిసమీపంలోనే రమ్య అనేయువతి దారుణంగా చంపబడితే, ఈ ముఖ్యమంత్రి , ప్రభుత్వం సదరుయువతి కుటుంబాన్ని ఊరడించి, రాజకీయాలుచేసి చేతులుదులుపుకుంది తప్ప, నిందితుడిని శిక్షించ లేకపోయిందన్నారు.
ప్రియాంకరెడ్డి అత్యాచార ఘటనలో తెలంగాణ ప్రభుత్వం నిందితులను ఎన్ కౌంటర్ చేస్తాననిచెప్పి, దాన్ని అమలు చేసిందని, అందుకు గర్వంతో పొంగిపోయినజగన్మోహన్ రెడ్డి మాత్రం, తన స్వరాష్ట్రమైన ఏపీలో ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాలపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రమ్య ఉదంతంతర్వాత, మేడికొండూరుఘటన, దాచేపల్లి ఘటనలుజరిగినా ప్రభుత్వం, ముఖ్య మంత్రి స్పందించలేదన్నారు. తననివాసం పక్కనే సీతానగరం ఘాట్ లో యువతిపై అత్యాచారం జరిగితే, ఈముఖ్యమంత్రి సదరు ఘటనకు కారకుడైన వెంకటరెడ్డిని, నరసరావుపేటలో అనూషను హతమార్చిన విష్ణువర్థన్ రెడ్డిని ముఖ్యమంత్రి శిక్షించలేకపోయాడన్నారు.
పక్క రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై అత్యుత్సాహం చూపుతూ, సెల్యూట్లు చేస్తు న్న జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో, తన రాష్ట్రంలోజరిగే దారుణాలపై స్పందించకపోవడం నిజంగా హేయతిహేయమన్నారు. రాష్ట్రంలో ఆడబి డ్డలు, యువతులపై దాదాపు 500లకు పైగా ఘటనలు జరిగితే, ఏ ఘటనలోనూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ అసలు దోషులను శిక్షించలేకపోయిందన్నారు. డీజీపీ మొదలు ముఖ్యమంత్రి వరకు అందరూ లేని దిశాచట్టంగురించి చెబుతూ, జబ్బలుచరుచుకుం టున్నారు తప్ప నిందితులను శిక్షించడంలేదన్నారు. లేనిచట్టం గురించి చెప్పుకుంటూ, ఆడబిడ్డలు, యువతుల మానప్రాణాలను గాల్లో దీపాలు గా మార్చారని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ తప్పుపట్టి నా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈప్రభుత్వం, ముఖ్యమంత్ర్రి గొప్ప లుచెప్పుకుంటున్నదిశాచట్టం విధివిధానాలు గతప్రభుత్వంలోనే రూపొందించడం జరిగిందన్నారు.
నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం క్రైమ్ రేట్ లో రాష్ట్రం, దేశంలోనే మూడో స్థానంలోఉందని, త్వరలోనే తొలి స్థానానికి చేరుతుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలనుఎత్తిచూపుతూ, ముఖ్యమంత్రి అసమర్థతను ఎండగడుతున్న టీడీపీనేతలను, నారాలోకే శ్ ను అడ్డుకోవడంపై పెడుతున్న శ్రద్ధను పోలీసులు నిందితులను పట్టుకోవడంపై ఎందుకు పెట్టలేకపోతున్నారని మాణిక్యరావు నిగ్గదీశా రు. సీతానగరం ఘటనపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించి, నిందితు డిని కఠినంగా శిక్షించి ఉంటే, వరుసగా రమ్యహత్య, మేడికొండూరు ఘటన, దాచేపల్లి ఉదంతం, నిన్నటికి నిన్న నెల్లూరు ఘటనలు జరిగేవి కావన్నారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీప్రభుత్వం అధికారపార్టీ కార్యకర్తలు, నేతలను రక్షించేందుకే, మహిళలు, ఆడబిడ్డల మానప్రాణాలకు విలువ కడుతోందని టీడీపీనేత ఆగ్రహంవ్యక్తంచేశారు.
పాలకుల చేతగానితనమే నేరస్తులు, నిందితులకు రక్షణకవచంగా నిలుస్తోందన్నారు. ఏడీఆర్ నివేదికప్రకారం చూస్తే చట్టసభల్లో అత్యధికనేరస్తులున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందన్నారు. పరిపాలకులే నేరస్తులైతే రాష్ట్రంలో నిత్యం హత్యలు, అత్యాచారాలు జరగకుండా ఎలాఉంటాయన్నారు. కేంద్రప్రభు త్వం నిర్బయచట్టం కింద రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కూడా జగన్ ప్రభుత్వం దారిమళ్లించిందన్నారు. రూ.80కోట్ల నిధులను వ్యక్తిగత ప్ర యోజనాలకోసం వాడుకుందన్నారు.
ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళ లు, యువతులు, చిన్నారుల రక్షణార్థం కేంద్రప్రభుత్వం వివిధ చట్టాల ను అమలుచేస్తుంటే, వాటిని అమలుచేయకుండా జగన్ ప్రభుత్వం కొత్త చట్టాలపేరుతో దురాగతాలకు పాల్పడేవారిని కాపాడాలనిచూడటం సిగ్గు చేటన్నారు. తెలంగాణలో రాజు ఆత్మహత్యఘటనచూశాకైనా , రాష్ట్రంలోని పాలకులు, ముఖ్యమంత్రి కళ్లుతెరిచి, మహిళల రక్షణపై దృష్టి పెడితే మంచిదన్నారు. దుర్మార్గులు దురాగతాలకు బలైన ఆడబిడ్డలు, వారికుటుంబాలను పరామర్శించకుండా, వారికి అండగా నిలవకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నారాలోకేశ్ ను అడ్డుకోలేదన్నారు.

LEAVE A RESPONSE