Suryaa.co.in

Andhra Pradesh

ఆ మేనిప్లేషన్ తోనే, తన తమ్ముడిని సీబీఐ అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారు

– వ్యవస్థల్ని మేనేజ్ చేయడం.. మేనిప్లేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. మేనిప్లేషన్ తోనే ఆయన తనఆస్తుల్ని పెంచుకున్నాడు
• భారతదేశంలో ఉన్న అధునాతమైన పరిపాలనా వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేయగలరు. మేనేజ్ చేయకుండా దేశంలోనే అత్యంతధనికుడైన ముఖ్యమంత్రి, ఎలా అయ్యాడో ఆయనే చెప్పాలి
• వివేకాహత్యకేసులో అన్నివేళ్లు అవినాశ్ రెడ్డి వైపే చూపిస్తున్నా, అతని అరెస్ట్ లో సీబీఐ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? పెద్దవాళ్లు మర్డర్ చేస్తే వారికేం అవ్వదా అనే అభిప్రా యంలో ప్రజలున్నారని సీబీఐ గ్రహించాలి
• ఒకప్పుడు దేశంగర్వించిన సీబీఐ గురించి ఇప్పుడు ప్రజలు నానారకాలుగా మాట్లాడుకుంటున్నారు. అవినాశ్ రెడ్డిని రక్షించే క్రమంలో సీబీఐ తన ఇమేజ్ ను తానే పాడుచేసుకుంటోంది. మేనిప్లేటర్ జగన్మోహన్ రెడ్డి మాటలు వింటే సీబీఐ ఇమేజ్ పాడవుతుంది.
• మనముఖ్యమంత్రి మేనిప్లేషన్ వలననే వివేకా కేసులో ప్రధానముద్దాయిగా పేర్కొనబడిన వై.ఎస్.అవినాశ్ రెడ్డిని అరెస్ట్ కాకుండా చూడగలుగుతున్నాడు
• సీబీఐ పదేపదే అవినాశ్ రెడ్డిపై సాక్ష్యాలున్నాయని కోర్టుకు నివేదిక సమర్పించినా ఆయన అరెస్ట్ కాకపోవడానికి కారణం ముఖ్యమంత్రి మేనిప్లేషనే
• 14-03-2019 అర్థరాత్రి నుంచి 15 తెల్లవారుజాము వరకు అవినాశ్ రెడ్డితో ఈ కేసులోని ముద్దాయిలు మాట్లాడిన కాల్ డేటాచూస్తే, ప్రధానముద్దాయి అవినాశ్ రెడ్డని ఎవరికైనా అర్థమవుతుంది
• గతంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సీబీఐ ఈరోజు జగన్ మేనిప్లేషన్ వల్ల వారి ప్రతిష్టకూడా మసకబారుతోందని గ్రహించాలి
• లాబీయిస్ట్ విజయ్ కుమార్ ఈరోజున ఢిల్లీలో జగన్ ఏర్పాటుచేసిన గెస్ట్ హౌస్ లోఉండి, అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా పనులు చక్కబెడుతున్నారని ఢిల్లీలో పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు
• ఢిల్లీలో ఉన్న లాబీయిస్ట్ విజయ్ కమార్ కు, తాడేపల్లిలో ఉన్న సీఎం సెక్రటరీకి మధ్య జరుగుతున్న ఫోన్ కాల్ లిస్ట్ తనిఖీచేస్తే, ముఖ్యమంత్రి మేనిప్లేషన్ బయటపడుతుంది
• ఇప్పటికైనా సీబీఐ వై.ఎస్.అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి, వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
• అవగాహనలేని సజ్జల, చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలడం అతని అవగాహనారాహిత్యానికి నిదర్శనం
– తెదేపా నేత వర్ల రామయ్య

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు యథాతథంగా ఆయన మాటల్లోనే …
“జగన్మోహన్ రెడ్డి, మనరాష్ట్రం ముఖ్యమంత్రి 2004 సంవత్సరంలో వారినాన్న ముఖ్యమంత్రి అవ్వకముందు పెద్ద ధనవంతులేమీకాదు, పేద్ద స్థితిమంతులేమీకాదు, వీరికేమీ పెద్దపెద్ద బంగళాలు, పెద్దగా బ్యాంక్ బ్యాలెన్స్ లు లేవు. వీరి ఇన్ కంటాక్స్ ఒక లక్ష రూపా యలో 2లక్షలో కట్టేవారు ఏడాదికి. బిలో యావరేజ్ లో ఉండేవారు ఆర్థికంగా. అటువంటి వ్యక్తి సడన్ గా, హఠాత్తుగా, అకస్మాత్తుగా వాళ్లనాన్న ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ హి బికేమ్ వెరీరిచ్. ఎంతరిచ్ అయినా ఈనాడు భారతదేశంలోనే అత్యంతధనవంతుడైన రాజకీ యనాయకుడు ఆయన.

ఈ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోని ముఖ్యమంత్రులు అందరి లోకూడా అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రి. ఇది ఎలాసాధ్యమైంది అని నేను చాలా కాలంనుంచి అడుగుతున్నా, బట్ మన గౌరవ ముఖ్యమంత్రిగారు నోరుతెరవరు, సమా ధానం చెప్పరు. ఆయన వ్యవస్థలు మేనేజ్ చేయడం, మేనిప్లేట్ చేయడంలో సిద్ధహస్తుడు. వాళ్లువ్యవస్థలు మేనిప్లేట్ చేస్తారని ఆయన ఎవరెవరి పేర్లో చెబుతాడు. అసలుసిసలైన మేనిప్లేటర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఎలా అవుతుంది. షో మీ వన్ పర్సన్. భార తదేశంలో ఒక్కణ్ణి చూపించండి గౌరవ ముఖ్యమంత్రి గారు. నేనేకాదు వర్లరామయ్యగారు.. పలానా వెంకయ్య, సుబ్బయ్య, ఎల్లయ్యకూడా ఇలా సంపాదించుకున్నారు అని ఒక్కణ్ణి చూపించండి భారతదేశంలో, లేదు.

ఎందుకంటే అది మీకేసాధ్యమైంది. హి విల్ మేనిప్లేట్ ఏజె న్సీస్, వ్యవస్థలు. భారతదేశంలో ఉన్న అధునాతమైన పరిపాలనా వ్యవస్థల్ని మీరు మేనేజ్ చేయగలరు. అందుకే సాధ్యమైంది మీకు…లేకపోతే ఎలా అవుతుంది? ఏ పర్సన్ హూ వాజ్ నథింగ్ ఇన్ 2004, హౌ హీ బికమ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా? ఎలా అవుతారు? అందు కే నేను అంటున్నాను ఈరోజున. జగన్మోహన్ రెడ్డిగారు వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో సిద్ధ హస్తుడు. ఆయన దగ్గర ఏటీమ్ ఆఫ్ లాబీయిస్ట్స్ వర్కింగ్ విత్ హిమ్. ఆఫ్ హిమ్. వారంతా అవసరాన్ని బట్టి లాబీయింగ్ చేస్తుంటారు. కాకపోతే ఇదిఎలా సాధ్యమైంది? కాదని చెప్పే ధైర్యముందా?

ఇప్పటికీ కూడా మీ ఆస్తుల విలువ ఎలాపెరిగియాంటే సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రిని మనంనాయకుడిగా రాష్ట్రఅధినేతగా పెట్టుకున్నామంటే రాష్ట్రప్రజలందరూ ఒకింత ఆలోచించాల్సిన అవసరంలేదా? మనముఖ్యమంత్రి ఎటువంటివాడు అని ఒకప్రశ్న వేసుకోరా…5న్నరకోట్ల ఆంధ్రప్రజలు? ఎలా ఈస్థాయికి ఎదిగినాడు? రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ స్థాయికి ఎలాఎదిగినాడు? మొన్నమొన్నటివరకు ఏమీలేని వ్యక్తి, ఈరోజు అన్నీఉన్నవ్యక్తిగా ఎలా ఎదిగాడని ప్రశ్న వేసుకోరా?

జగన్మోహన్ రెడ్డిని మించిన మేనిప్లేటర్ మరొకరు లేరు. మీ బాబాయ్ హత్యకేసులో కుట్రదారుడు, అసలు నిందితుడు అవినాశ్ రెడ్డి అని తెలిసి, మీరు అతన్ని కాపాడుతున్నది నిజంకాదా? అడుగడుగునా సీబీఐని అడ్డుకుంటున్నది మీ అధికారం, మీ లాబీయింగ్ కాదా? వివేకాహత్యకేసులో అవినాశ్ రెడ్డి కాకుండా, సామాన్యుడు ఉండి ఉంటే సీబీఐ ఇలా తుంచేసి అలా లాక్కెళ్లేది.

మీరు ఎంత మేనిప్లేటర్ అనిచెప్పడానికి ఒకటేఒక ఉదాహరణ చెబుతాను. దయచేసి ప్రెస్ సోదరులారా..మీరు, టీవీలో వ్యూయర్స్ కూడా నేను ఒక్కసారి దయచేసి వాచ్ చేయమని చెబుతున్నాను. ఆరోజున ది ఫేత్ ఫుల్ డే, 15వ తారీఖు తెల్లవారుజామున 2019లో వై. ఎస్. వివేకానందరెడ్డిగారు, మనముఖ్యమంత్రిగారికి బాబాయ్, దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డిగారికి సొంతరక్తం పంచుకొని పుట్టినతమ్ముడు ఘోరాతిఘోరంగా ఆయన ఇంట్లో పులివెందులలో హత్యచేయబడినాడు.

ఎవిరీబడీ నోస్ ఇట్. ఇంటివాళ్లే చంపారు.. ఇంటిదొంగలపని ఇదని ఒకమహిళ, ఎవరినైతే అనుమానిస్తూ సీబీఐ ఒకణ్ణి తిరుపతిలో ఆ పరమేశ్వర్ రెడ్డి అనేఆయన్ని ఎంక్వైరీచేస్తుంటే, ఆసుపత్రిలో ఉన్నఆయన్ని విచారణ చేయడానికి వెళ్తే, ఎందుకయ్యా నామొగుడు చుట్టూ తిరుగుతారు, అసలు వాళ్లు ఇంటిదొంగ లే అంది. తేలిపోలా..జగన్మోహన్ రెడ్డిగారు. హూకిల్డ్ యువర్ బాబాయ్? మీకుతెలియకుం డా ఇదంతా జరిగిందా? గుండెమీద చెయ్యివేసుకొని చెప్పండి. ఆరోజున ఎవ్రీఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వై.ఎస్.అవినాశ్ రెడ్డి ఎంపీ, బ్రదర్ ఆఫ్ మిస్టర్ జగ న్మోహన్ రెడ్డి హానరబుల్ చీఫ్ మినిస్టర్, అతనే చేశాడు, అతనే చేయించాడు, అతనే కారకు డు, కుట్రదారుడు అతనే, అతన్ని అరెస్ట్ చేయాలి అని సీబీఐ గగ్గోలుపెడుతూఉంటే, అడుగ డుగునా అడ్డుకున్నది మీరుకాదా జగన్మోహన్ రెడ్డిగారు?

అడుగడుగునా అడ్డుకున్నది మీరు కాదు? ఇదే నేను సీబీఐని అడుగుతున్నా. కొన్నివ్యవస్థల్ని నేనుప్రశ్నిస్తున్నా. ఇదే మరో వెంకయ్యో, పుల్లయ్యో మాములువాడయితే ఎప్పుడో అట్లా తుంచేసి తీసుకెళ్లేవాళ్లు కా దా? నేను అడుగుతున్నా సమాధానంచెప్పండి. అదే జగన్మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి తమ్ముడుకాకుండా సామాన్యుడు అయితే, మాములుపౌరుడు అయితే సీబీఐ అట్లా తుంచి తీసుకెళ్లిపోయేది కాదా? ఈపాటికి కేసు జడ్జిమెంట్ కూడా అయ్యేదేమో? అంటే మనచట్టాలు మీలాంటి వ్యక్తులు ఉండటంవల్ల, కొంతమందికి చుట్టాలుగా మారతాయ అండి.

చట్టాలు కొం తమందికి చుట్టాలుగా మారతాయా? సమాధానంచెప్పాలని చెప్పికూడా నేను ముఖ్యమంత్రి ని, మీరే. ఐఫీల్ యు ఆర్ ది మేనిప్లేటర్. మీవల్లే అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాబడలేదు? మీ వల్లే అడుగడుగునా అవినాశ్ రెడ్డి అరెస్ట్ డిలే అవుతోంది. అదే మాములువాడు అయితే ఊరుకుం టారా అండీ? అందుకని యాక్టివ్ వ్యవస్థలు అన్నింటికీ నేను విజ్ఞప్తిచేస్తున్నా, ఇటువంటి మేనిప్లేటర్స్ ను వదలొద్దు అని విజ్ఞప్తిచేస్తున్నా. దీనివల్ల వ్యవస్థలకు కూడా చెడ్డపేరు వస్తుం దని నేను గుర్తుచేస్తున్నా.

సీబీఐ ఎందుకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మీనమేషాలు లెక్కిస్తోంది? ఆయన ఫోన్ కాల్ సంభాషణల లిస్ట్ ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీరుచూడండి. స్క్రీన్ మీదచూడండి. వై.ఎస్.అవినాశ్ రెడ్డి ఆ రైట్ సైడ్ న స్క్రీన్ మీద ఉన్నారు. (వివేకాహత్య తర్వాత అవినాశ్ రెడ్డి ఎవరితో ఎంతసేపు ఏసమయంలో ఫోన్లుమాట్లాడాడనే వివరాలతో కూడిన ఊహా చిత్రాన్ని విలేకరులకు ప్రదర్శించారు). ఆయన్ని ఏక్షణానైనా సీబీఐ అరెస్ట్ చేయడానికి సిద్థం గా ఉంటే, ముఖ్యమంత్రిగారు తన చక్రాన్ని అడుగడుగునా అడ్డేస్తున్నారు.

తన చక్రాన్ని అడ్డువేసి అరెస్ట్ కాకుండా ఆపుతున్నారు. రెండునెలలక్రితం సీబీఐవారు ఒకప్రాముఖ్యత కలి గిన న్యాయస్థానంలో అఫిడవిట్ వేశారు. ఇంతవరకు అరెస్ట్ ఎందుకు కాలేదు? ముఖ్యమంత్రి గారు ఏంసమాధానంచెబుతారు? ఎందుకు డిలే అయ్యింది. మీరుకాదా కారణం. మీరుకాదా మేనిప్లేటర్? ఏవ్యవస్థను నేను పిన్ పాయింట్ చేయడంలేదు, మీరు మేనిప్లేటర్ అని మాత్ర మే చెబుతున్నా. మీరు మేనిప్లేటర్ అనిచెప్పడమే నా ఉద్దేశం. వ్యవస్థ ఎంతటిదైనా గానీ మీ రు మేనిప్లేట్ చేయగలరని చెప్పడమే నా ఉద్దేశం.

అవినాశ్ రెఢ్డి ఫోన్లో మాట్లాడింది చూడండి. నిందితుల మధ్య మార్చి14 సాయంత్రం 6 గంటనుంచి మార్చి15 ఉదయం 8గంటలవరకు సాగిన ఫోన్ కాల్స్ వివరాలు నేను ఇస్తూఉన్నా. ఇప్పుడు. స్క్రీన్ మీదచూపిస్తున్నా.దయచేసి దీనితర్వాతైనా సీబీఐ వై.ఎస్.అవినాశ్ రెడ్డిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తారా.. లేదా? ఎంపీ అవ్వొచ్చు ఆయన, చీఫ్ మినిస్టర్ అవ్వొచ్చు. మనభారతదేశ రాజ్యాంగం ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, వైస్ ప్రెసిడెంట్ కు, గవర్నర్ కే కొన్నిరాయితీలు ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం, మిగతా ఎవరికీ ఏమీలేదు సార్.

ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎనిబడీ రాజకీయం నుంచి వెళ్లినవాళ్లకు ఎవరికీలేదు. మీరుఅనుకుంటున్నారేమో నేను ఎంపీని, సీఎంని అని ఏంలేదు లేదుసార్, మీరుతప్పుచేసినాకూడా చకచకా లాక్కెళ్లిపోతారు. ఏమీలేదు.. హెల్ప్ ఏమీలేదు. మీరు డిఫైన్ చేసుకోవడానికిలేదు. నేను సీఎంనికదా..చేస్తానంటే ఒప్పుకోరండి.

వివేకాహత్యకు ముందు, హత్యజరిగాక అవినాశ్ రెడ్డి ఎవరెవరితో, ఎంతసేపు ఫోన్ మాట్లాడాడు అనే వివరాల్ని ప్రజలముందు ఉంచుతున్నా
అందుకే ఈ ఫోన్ కాల్ లిస్ట్ ఒక్కసారి మీకు తెలియచేస్తాను. నంబర్ -1 : అక్కడ ఉన్న వ్యక్తి అవినాశ్ రెడ్డి. ఫస్ట్ ఫోన్ కాల్ చేశారు వాళ్ల నాన్నగారికి. ఎప్పుడుచేశారు 14వతేదీన సా యంత్రం 6గంటల10నిమిషాలకు ఫోన్ చేసినారు ఆయన. ఆకాల్ అయిపోయిన తర్వాత వెంటనే ఏ5 శివశంకర్ రెడ్డికి మూడుకాల్స్ చేశారు ఆయన. అదేరోజున 6గంటల45 నిమిషా లకు ఫోన్ చేశారు, మొత్తం 191సెకన్లు మాట్లాడినారు. మూడునిమిషాల పైన మాట్లాడారు. తరువాత మరలా 6.50కి మరలా 56సెకన్లు మాట్లాడినారు. మరలా 8గంటలకు 5సెకన్లు మాట్లాడినారు, 14వతారీఖున అంటే ప్రిపరేషన్లో ఉన్నరోజున అన్నమాట. ఎలా హత్యచేయా లి వివేకానందరెడ్డిని, ఏంచేయాలి, ఎవరెవరు ఎక్కడఉండాలి ఏంటనేదిమాట్లాడారు అంతేకదా ఆబ్యీయస్లీ అదేకదా!

దానితర్వాత అవినాశ్ రెడ్డిగారికి ఈ ఉదయ్ కుమార్ రెడ్డి అనేఅతను, ఎవరితండ్రి అయితే శవానికికుట్లువేశాడో అతను 2 కాల్స్ చేశాడు, అవినాశ్ రెడ్డిగారికి. 15వ తారీఖు తెల్లవారుజామున 6గంటలకు ఫోన్ చేశాడు..8సెకన్లు మాట్లాడాడు. ఆరోజున తెల్ల వారజామున హత్యజరిగిన రోజున, అంటే శవం అయిపోయింది, హత్య అయిపోయింది, పూర్తి అయిపోయింది. వివేకానందరెడ్డి చనిపోయినాడు. వివేకానందరెడ్డి శవం గొడ్డలివేటుకి తలవక్కలైంది. రక్తం మడుగులో గిలగిలా కొట్టుకొని చచ్చిపోయినాడు అతను.

చచ్చిపోయిన తర్వాత దిస్ ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాశ్ రెడ్డికి ఫోన్ చేశాడు. ఇతను ఫోన్ చేసి ఏంచెప్పా డో చెప్పగలడా అవినాశ్ రెడ్డి? అది అయిపోయిన తర్వాత శివశంకర్ రెడ్డి ఫోన్ కాల్ చేసినాడు . 15వ తారీఖున 5గంటల58 నిమిషాలకు ఫోన్ చేశారు, మొత్తం 5సెకన్లు మాట్లాడాడు. ఎస్ మిషన్ కంప్లీషడ్ వర్క్ ఈజ్ ఓవర్, అవినాశ్ రెడ్డి గారు పనిఅయిపోయింది అనిచెప్పేసి ఫోన్ పెట్టేశాడు.

5సెకన్లలో ఎవరైనా ఏంమాట్లాడతారు..పాత్రికేయ సోదరులారా మీరుచెప్పండి. అన్నా పని అయ్యింది అన్నా. అన్నమాట ఎన్నిసెకన్లు వస్తుందో చూడు. సో పని అయిపో యింది అని కమ్యూనికేట్ చేశాడు. ఎవరు శివశంకర్ రెడ్డి ఏ5, ఇతనే కీపిన్, సీన్ లోఉన్న వ్యక్తి అతనే, అసలు ఏ5 అతనే, మొత్తం చరిత్రనడిపింది అతనే. వీళ్లందరినీ ఆర్గనైజ్ చేసింది అతనే. ఇదే శివశంకర్ రెడ్డి ఇదే గంగిరెడ్డి ఏ1కి మరలా ఫోన్ చేసినాడు, 2కాల్స్ చేసినాడు. ఆ రోజున 14వ తారీఖున నైట్ 8ఇంటికి మాట్లాడి 52సెకన్లు మాట్లాడినాడు.

అంటే ఆన్ ది డే ఆఫ్ ప్రిపరేషన్, తర్వాత మరలా అర్థరాత్రికూడా 55సెకన్లు మాట్లాడినాడు, బిఫోర్ గోయిం గ్ టూ కిల్ హిమ్. అతన్ని చంపడానికి ముందుకూడా 55సెకన్లు మాట్లాడినాడు..దిస్ ఈజ్ ఏ1 గంగిరెడ్డి, రేపు కోర్టులో సరెండర్ కాబోతున్నాడు. ఇతను గంగిరెడ్డి. ఈ గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఏ2తో మాట్లాడినాడు. 14వతారీఖున 2కాల్స్ చేసినాడు. ఇతను ఏ2 వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ అతను ఉమాశంకర్ రెడ్డి ఈకేసులో ఏ3. అతనికి 5 అవుట్ గోయింగ్ కాల్స్ చేసినాడు.

2 ఎస్.ఎమ్.ఎస్ చేసినాడు. ఇతను ఏ2 సునీల్, షేక్ దస్తగిరి అని ఏ4 ఉన్నాడు, అప్రూవర్ గా మారినాడు. అతనికి 2కాల్స్ చేసినాడు. ఇతను మరలా అతనికి 3 కాల్స్ చేసినాడు. ఏంటి ఆ నైటే, ఆనైటే. అంటే ఈ లింక్ అంతా, నేనుచెప్పేది అంతా, బట్ ఇక్కడున్నదాన్ని బట్టి, నేను స్పాట్ లో లేను..ఇన్వెస్టిగేషన్ చేయలేదు. కాల్ లిస్ట్ ఇది. దీన్ని ఇంకాలోతుగా వెళితే, మనం గూగుల్ టేకౌట్ లోకి వెళ్తే, అన్నీస్పష్టంగా ఉన్నాయి. ఎస్.ఎం.ఎస్ లు కూడా బయటకువస్తాయి.

ఇంత జరుగుతున్నా కూడా ఇప్పుడు అడుగుతు న్నా గౌరవముఖ్యమంత్రిగారిని, మీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయాలా..వద్దా? చాలా ఇన్వెస్టిగే షన్లో స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అతనేకదా? రక్తంకడిగిన దగ్గరనుంచి కుట్లువేయించిన దగ్గర నుంచి, శవపేటికదగ్గర నుంచి, కట్లుకట్టించిన దగ్గరనుంచి, సీఐని తిట్టిన దగ్గరనుంచి, సీఐని నోరుమూసుకో అన్నదగ్గరనుంచి, వాడేం పోలీస్ ఆఫీసరో.. బఫూన్ ఆ సీఐ. ఆసీఐని నోరు మూసుకో అనిచెప్పిన దగ్గరంనుంచీ ఇతనేకదా? ఇంకానేను అడుగుతున్నా గౌరవ జగన్మో హన్ రెడ్డిగారు. ఇంకా ఆపుదామా…తమ్ముడుగారి అరెస్ట్?

ఇంకా మేనిప్లేట్ చేయాలని ప్రయ త్నం చేస్తారా మీరు? ఇంకా మేనిప్లేట్ చేయాలని ప్రయత్నంచేస్తారా మీరు గౌరవముఖ్యమం త్రి గారు అని నేను అడుగుతున్నా. ఈరకంగా వ్యవస్థలు ఉంటే ఎలాగండీ న్యాయం? సామా న్యుడు ఏమనుకుంటాడు? నేను ఇంకొకప్రశ్న అడుగుతున్నా. తెలుగుదేశంపార్టీ రాజకీయం గా డిమాండ్ చేయడంలేదు. వ్యవస్థల గౌరవాన్ని కాపాడాల.

జగన్మోహన్ రెడ్డి మాటలు వింటే సీబీఐ ఇమేజ్ పాడవదా?
ఈరోజున మీకు తెలుసో లేదో అండీ సీబీఐ గురించి నానారకాలుగా మాట్లాడుకుంటన్నారు. ఒకప్పుడు ఉన్నతమైన ఇతర దేశాల్లోకూడా ఇండియన్ సీబీఐకి పెద్దపేరున్నది, ఆ పేరుప్రతిష్టలన్నీకూడా ఈ అవినాశ్ రెడ్డి, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాశ్ రెడ్డి రక్షించే దీంట్లో చాలావరకు యువర్ ఇమేజ్ హ్యజ్ బీన్ టార్నిష్డ్ టూ సమ్ ఎక్స్ టెంట్. మీ గౌరవం.. మీ విలువ తగ్గిందండీ సీబీఐ. మరలా మీ గౌరవాన్ని రెస్టోర్ చేసుకోవాలి.. మరలా మీ గౌరవాన్ని కాపాడుకోవాల. ఎంతటి వాడైనా మాకు ఒకటే, చట్టంముందు ఎవరైనా ఒకటే అనిచెప్పాలనేది నాఉద్దేశం. అందుకే ఈ అవినాశ్ రెడ్డిఎంపీని, ఎంపీ అయితే మీకేంటిసార్? వెరీ లిటిట్, ఎంపీ అయితే ఫరక్ ఫడతా నై. ఏముంది.. మినిస్టర్ ఏముంది?
ఇంకాపెద్ద మినిస్టర్ ఏముంది? లోపలేయడమే, తప్పుచేశావు వెళ్లిపో. ఇందిరాగాంధీగారిని లోపలేశారు కదా! ఆవిడకంటే పెద్దోళ్లా వీళ్లేమన్నా? ఇందిరా గాంధీని లోపలేసి కానిస్టేబుల్ గడి పెట్టేసినాడు. పేపర్ న్యూస్ పేపర్ కూడా ఇవ్వలేదు కానిస్టేబుల్ చదువుకోవడానికి. కోర్టు పర్మిషన్ ఉంటే తప్ప, న్యూస్ పేపర్ మీకు ఇవ్వను అ న్నారు. అదీ మనభారతదేశచట్టం. కానీ అవినాశ్ రెడ్డిని ఇంతకాలం అట్లా ఉంచడంవల్ల, భారతదేశ వ్యవస్థలగౌరవం కూడా ఏమన్నా తగ్గుతుందేమోనని ఆలోచించాలని కూడా నేను పెద్దలందరికీ విజ్ఞప్తిచేస్తున్నా.

దిస్..మైడిమాండ్ ఈజ్ నాట్ పొలిటికల్ డిమాండ్. ఆ యామ్ వెరీ క్లియర్. మేంచెప్పే డిమాండ్ పొలిటికల్ డిమాండ్. వ్యవస్థల గౌరవం కాపాడాలి అని నేను కోరుతున్నా. ఏవ్యవస్థని కూడా నేను పిన్ పాయింట్ చేయడంలేదు. ఒకప్పుడు సీబీఐకి పెద్దపేరుందని చెప్పాను. ఇప్పుడు ఉందోలేదో వాళ్లే ఆలోచించుకోవాలి. ఈ రకంగా ఉంటే ఇమేజ్ టార్నిష్ అయ్యే ప్రమాదం ఉందో లేదోకూడా వాళ్లే ఆలోచించుకోవాలి. ఈ మేనిప్లేటర్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని, మీరు ఈరకంగా ఉంటే మీ ఇమేజ్ పాడవట్లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా.

ది గ్రేట్ లాబీయిస్ట్ విజయ్ కుమార్ ఇప్పుడు ఎక్కడున్నారో, ఢిల్లీలో ఎవరి గెస్ట్ హౌస్ లో ఉండి ఎవరికోసం పనిచేస్తున్నారో, ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ సెక్రటరీతో ఏం మాట్లాడుతున్నారో, కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్ వ్యవస్థలు కనిపెట్టాలి
ఒక్కటే స్ట్రెయిట్ క్వశ్చన్ సార్.. విజయ్ కుమార్ దిగ్రేట్ లాబీ యిస్ట్. నేను లాస్ట్ టైమ్ ఒక15రోజుల క్రితంకూడా చెప్పాను నేను. ఆయన్ని మైసూర్ నుంచి విమానంలో గన్నవరం తీసుకొచ్చి, గన్నవరం నుంచి నంబర్ సరిగాలేని కార్లో తీసుకొచ్చి, ముఖ్యమంత్రిగారు ఐదున్నర గంటలసేపు మాట్లాడిన విషయంకూడా గతంలో మీకు తెలియచేశాను. ఆ విజయ్ కుమార్ గారు ఇప్పుడుఎక్కడున్నారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా?

నా ఇన్ ఫర్మే షన్ హిఈజ్ ఎట్ ఢిల్లీ. ఎందుకున్నారు? ఏమన్నా యజ్ఞయాగాదులు చేస్తున్నారా అక్కడ? ఏమన్నా రాజశ్యామల యజ్ఞంచేస్తున్నారా అక్కడ? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 కాలాలపాటు ఉండాలని చేస్తున్నారా? ఎవరికైనాజ్యోతిష్యం చెబుతున్నారా? లేదే? లాబీయింగ్ చేస్తున్నారు ఆయన. విచ్ టైప్ ఆఫ్ లాబీయింగ్ విత్ హూమ్? ఎంక్వైరీ చేయమంటున్నానేను.

ది ఇండియన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజన్సీస్ ఈ లాబీయిస్ట్ మీద ఒక కన్నువేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వేర్ ఈజ్ హి నౌ. ఎవరి పంపనఉన్నా రు? ఏ హోటల్లో ఉన్నారు? ఐ కేమ్ టూ నో దట్ హిఈజ్ ఇన్ ఏ ప్రైవేట్ గెస్ట్ హౌస్. ఎవరి గెస్ట్ హౌస్ అది? ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కాంట్రాక్టర్ గెస్ట్ హౌస్ లోఉన్నారు ఆయన, నాకుతెలిసి. ఆకాంట్రాక్టర్ ఎవరు? ఆ గెస్ట్ హౌస్ ఏమిటి? ఆగెస్ట్ హౌస్ కి ఎవరెవరు వెళ్తున్నారు? ఆయన ఫోన్ కాల్స్ ఏమిటి? ఆయన సీఎంఆఫీసులో ఒక సెక్రటరీతో మాట్లాడుతున్నారు.. ఎవరు ఆ సెక్రటరీ? నేను సీఎంతో మాట్లడుతున్నారు అనొచ్చుగా, అనలా. సీఎం ఆఫీసులో ఉండే ఒక సెక్రటరీతో మాట్లాడుతున్నారు. దిస్ లాబీయిస్ట్ విజయ్ కుమార్.

వివేకాహత్యకేసులో అన్నివేళ్లు అవినాశ్ రెడ్డి వైపే చూపిస్తున్నా, అతని అరెస్ట్ లో సీబీఐ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? పెద్దవాళ్లు మర్డర్ చేస్తే వారికేం అవ్వదా అనే అభిప్రా యంలో ప్రజలున్నారని సీబీఐ గ్రహించాలి

లాబీయిస్ట్ లాబీయింగ్ చేయడంవల్లే అరెస్ట్ డిలే అవుతోందా? నా ప్రెస్ మీట్ నేను గొంతుచిం చుకొని మాట్లాడుతున్నా, ఒకకర్రకూడా తీసుకొచ్చి, అవన్నీ కూడా చూపించాను. ఫోన్ కాల్స్ చూపించాను. సీబీఐ ఈనంబర్స్ 2 అఫిడవిట్స్ లో వేసింది. ఎస్ హియాజ్ టుబీ అరెస్టె డ్ అని. అతన్ని మేం కస్టడీలోకి తీసుకొని దర్యాప్తుచేయాలని కూడా వేసినారు సీబీఐ. వాట్ ఎల్స్ యు రిక్వైర్డ్? మీనమేషాలు ఎందుకు లెక్కపెడుతున్నారు?

సీబీఐ మీనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరమేంటి? అన్నివేళ్లు అతనివైపే చూపిస్తున్నాయి, అతన్నిఅరెస్ట్ చేసి, కస్టడీ లోకి తీసుకొని, కొంతమందితో కన్ ఫ్రాంట్ చేయించాలి.. ఎక్యూజ్డ్ తో కూడా మేం మాట్లా డించాల అని అంటున్న సీబీఐ. ఇకఏమీ నాకుతెలిసి మీకు లీగల్ ఆప్ష్టికల్స్ కూడా ఏమీలేవు . న్యాయస్థానాలు మీకు ఫ్రీడమ్ ఇచ్చాయి, గోఆన్ విత్ యువర్ ఇన్వెస్టిగేషన్అని. దెన్ వై? ఇంకాఎందుకు? దీనివల్ల ఏమవుతుంది? ప్రజల్లో ఏమవుతుంది? ఓహో పెద్దవాళ్లు మర్డర్ చేస్తే, పెద్ద ఏం అవ్వదా?

పెద్దవాళ్లు హత్యలుచేస్తే వాళ్లకేం అవ్వదా.. బయటే ఉంటారా? పైగా ఎదురుదాడిచేస్తారా? ఏం ఎదురుదాడిచేస్తారు? మచ్చంతా మీదగ్గరపెట్టుకొని. క్రైమ్ అంతా మీరుచేసి? ఆరోజన ట్రై చేశారు.. చంద్రబాబుమీద పెడదాం..వాళ్లమీదపెడదాం..వీళ్లమీద పెడ దాం అని. ఆస్కార్ అవార్డ్ పాపం వాళ్లకు ఇచ్చారుగానీ, జగన్మోహన్ రెడ్డికిఇవ్వాలి ఆస్కార్ అవార్డ్. ఏం నటించినాడయ్యా ఆన్ ది డే. 15 మార్చి 2019న, పాత్రికేయులు ముందు, ఆ శవంముందు నటించినతీరుకి ఆయనకుఆస్కారో, భాస్కారో ఏదో ఒకఅవార్డ్ ఇవ్వాలి.

10 సంవత్సరాలక్రితం జగన్ అవినీతికేసులపై ఛార్జ్ షీట్ వేస్తే ఇప్పటికీ ట్రయల్ కు ఎందుకు రాలేదన్నది న్యాయస్థానాలు చూసుకుంటాయి
అందుకు నేను అంటున్నాను. అవినీతిసొమ్ముతో మేనిప్లేట్ చేసినా, అధికారాన్ని అడ్డుపెట్టు కొని మేనిప్లేట్ చేసినా, భారతదేశంలోని వ్యవస్థలు ఇంకా దిగజారిపోలేదని గౌరవముఖ్యమం త్రి గారికి నేను తెలియచేస్తున్నా. ఆయనకేసుల విషయం నేను వెళ్లను. ఆయన ఛార్జ్ షీట్లు ఎప్పుడు వేశారు? ఎందుకు డిలే అవుతున్నాయి వెళ్లను నేను, న్యాయస్థానాలు చూసుకుం టాయి. 10సంవత్సరాలక్రితం ఛార్జ్ షీట్ వేస్తే, ఇప్పటికికూడా ట్రయల్ కు రాలేదన్న విష యం న్యాయస్థానాలు చూసుకుంటాయి. ఐడోంట్ పాయింట్ ఆన్ దట్. ఎందుకు ట్రయల్ జరగడంలేదు… ఎందుకు ఇతను కోర్టుకు వెళ్లడంలేదు.

ప్రతిశుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వాడు ఏదోవంకపెట్టి, దాదాపు 4, 5 సంవత్సరాలనుంచి ఎవైడ్ చేస్తున్నారు..ఏం జరుగు తోంది అని నేనువెళ్లను. దటీజ్ అప్ టూది లీగల్ ఫ్రెటర్నటీ వాళ్లుచూసుకుంటారు. బట్ ఇదేంటండీ? ముద్దాయిని అరెస్ట్ చేయకుండా ఎంపీ అనిచెప్పి మీనమేషాలు లెక్కేయడం కరెక్ట్ కాదుఅని గౌరవపెద్దలకు, పాత్రికేయమిత్రులకు, అందరికీ తెలియచేస్తున్నా, మీరు కూడా పుంఖానుపుంఖాలు వ్రాయాలి మీరు.ఫోన్ కాల్ లిస్ట్ బయటకువచ్చింది. రేపు ఎస్. ఎం.ఎస్ ల్లో కూడా ఏముందో దే కెన్ బ్రింగ్ ఇట్ అవుట్. ఈ వ్యవస్థల్ని ఎలా మేనిప్లేట్ చేస్తు న్నారు అనేదికూడా మనకు కళ్లకుకట్టినట్టు తెలుస్తోంది. దీనిమీద అండి..ఏదన్నావస్తే డైవర్ష న్ టాక్ టిక్స్.

సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్ని బట్టే తెలుస్తోంది.. సిట్ ను అడ్డంపెట్టుకొని చంద్రబాబుపై ఈ ప్రభుత్వం కక్ష సాధించాలని చూస్తోందని
అతను ఎవరు.. సజ్జల రామకృష్ణారెడ్డి అమాయకచక్రవర్తి. అతని గురించి ఏమీ తెలియదు. 4ఏళ్లక్రితం సజ్జల ఎక్కడున్నాడంటే ఎక్కడో చెక్కబల్ల వేసుకొనికూర్చునేవాడు. అతన్ని సలహాదారగాపెడితే, అతను అంటాడండీ.. ఇకచంద్రబాబుగారి వంతు అంటా. చంద్రబాబు ఏంచేశారయ్యా? సుప్రీంకోర్టులో ఏం డెసిషన్ ఇచ్చింది? కేసుకొట్టేశారు అంటా ..ఇకచంద్రబాబుగారి అరెస్టే మిగిలింది అంటా? అవగాహన పూర్తిగాలేని ఆవ్యక్తి సజ్జల రామ కృష్ణారెడ్డి మాట్లాడతాడు. నేనే హైకోర్టులోవేశా.

ఈ సిట్ వేయడానికి వీల్లేదు. జీవోనెం – 344 డేటెడ్ 21 ఫిబ్రవరి 2020. ఈజీవో ఇచ్చారు.. ఏమని ఇచ్చారు? కాన్ స్టిట్యూషన్ అండ్ కంపోజిషన్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, టు ఇన్వెస్టిగేట్ ది ఇర్రెగ్యులారిటీస్ హై లెటెడ్ బై కేబినెట్ సబ్ కమిటీ ఫామ్డ్ బై జీవోనెం-1411. ఆ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిట్ ఫామ్ చేశారు. ఎంక్వైరీ వేశారు. ఈసిట్ కు ఎవరుంటారు…ఆటోమేటిగ్గా? నీ బాంచన్ దొ రా అని చెప్పుచేతుల్లో పనిచేసే మనిషిని వేశారు. ఆ కొల్లి రఘురామిరెడ్డి అంటే ఎవరు. నీ బాంచన్ దొరా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏంచెబితే, అది చేస్తాడు ఈ ఆఫీసర్.

ఈ ఆఫీసర్ క్రె డిబులిటీ అంతా మీకుతెలుసు..మేంకూడాఎన్నోసార్లుచెప్పాం. క్రెడిబులిటీ లేనిపోలీస్ అధికారి అతను. అతను ఒంగోలులోపనిచేసినప్పుడు, అక్కడ పనిచేసినప్పుడు పాతచరిత్రలుకూడా ఉన్నాయి అతనిగురించి, అందులోకి నేను వెళ్లడంలేదు. దీనిమీద నేనే పిటిషనర్ని. ఈ సిట్ ఎలా వేస్తారు..వేయడానికి లేదుకదా? అంతకుముందు ప్రభుత్వంచేసింది ఎంక్వైరీ చేసుకోవ చ్చుగానీ, ఇదేమిటన్నాను? హైకోర్ట్ స్టే ఇచ్చింది. దాన్ని ఇప్పుడు వెకేట్ చేసి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మేం ఈరోజున ఇచ్చిన తీర్పు ఇన్ ఫ్లుయెన్స్ కి గురికావద్దు మీరు, మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి, డెసిషన్ తీసుకోండి అని హైకోర్ట్ కి ఇస్తే, దిస్ వండర్ ఫుల్ గై సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతాడు అండీ… ఇక చంద్రబాబు వంత అంటా.

చంద్రబాబుగారు ఏమన్నా మీనాయకుడిలా 16నెలలు రిమాండ్ కుపోయినారా? 11 చార్జ్ షీట్లు వేయించుకున్నారా? ప్రతి శుక్రవారం కోర్టుకివెళతారా? 11కేసుల్లో ట్రయల్ కి ఏమైనా అటెండ్ అవుతారా? ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో ఏమైనా కేసులున్నాయా? ఏమచ్చాలేని చంద్రబాబునాయుడు గారు. ఆ మాటలోనే తెలుస్తోంది మీరు ఈ సిట్ ను అడ్డంపెట్టి ఏదోచేయాలని. ఈ సిట్ ను కొల్లి రఘురామిరెడ్డి  సేవల్ని అక్రమంగా వినియోగించుకొని చంద్రబాబుగారికి ఏదోమరక అం టించాలని ప్రయత్నిస్తున్నారు అని. అది సూర్యుడుకి మరక అంటించడమే అవుతుంది. నేను వేసిన పిటిషన్ హైకోర్ట్ స్టే ఇచ్చింది దీనిమీద. ఆ స్టేను వెకేట్ చేస్తూ, దాన్ని విచారణ చేసుకోండి.. బట్ ఇదంతా కూడా హైకోర్ట్ మా ఇన్ ఫ్లుయెన్స్ కు లోనుకాకుండా చేసుకోండి అని సుప్రీంకోర్టు స్పష్టంగాచెప్పింది. దీనికేదో చంద్రబాబుగారి మీద అదటా..ఇదటా?

చంద్రబా బుగారిమీద అవాకులుచవాకులు పేలొద్దనికూడా తెలియచేస్తూ. చివరగా ఇదంతా కూడా నేను చెప్పేది వై.ఎస్.వివేకానందరెడ్డికేసులో జగన్మోహన్ రెడ్డిగారు మేనిప్లేట్ చేస్తున్నారు..లా బీయిస్ట్ లను ఉపయోగిస్తున్నారు అని. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈవెన్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆర్ స్టేట్ ఇంటిలిజెన్స్ సమ్ఆఫ్ ది ఏజన్సీస్. అన్నీకూడా ఈ లాబీయిస్ట్ విజయ్ కుమార్ ఎక్కడున్నాడు? ఏ గెస్ట్ హౌస్ లోఉన్నాడు? ఎవరిపంపన పనిచేస్తున్నాడు? ఎవరికోసం పని చేస్తున్నాడు.. ఇవన్నీ కూడాదర్యాప్తు చేయాలని చెప్పి తెలియచేస్తున్నాను. ఇవన్నీ కూడా ఉపయోగించి, లాబీయింగ్ చేస్తున్న ఓ జగన్మోహన్ రెడ్డిగారు, చట్టాలని తనపని తాను చేసుకోనివ్వండి. చట్టాలకు అడ్డుపడకండి..మేనిప్లేట్ చేయకండి చట్టాలని అనిచెప్పి కూడా తెలియచేస్తున్నాను.”

LEAVE A RESPONSE