ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జనం జగన్ ను నమ్మరని తేలిపోయింది

•ఉత్తరాంధ్రలో టీడీపీ గెలుపుతో బొత్స, ధర్మాన, తమ్మినేని పదవులకు రాజీనామాచేస్తారా? – అసెంబ్లీలో రొమ్మువిరిచి అబద్ధాలు చెప్పే జగన్, ఎమ్మెల్సీ ఫలితాలపై ఏం సమాధానం చెబుతాడు?
• రాయలసీమ రారాజునని చెప్పుకునే రామచంద్రారెడ్డి, టీడీపీ గెలుపుని అంగీకరిస్తూ మంత్రిపదవికి రాజీనామా చేస్తాడా?
• జగన్ మాటమీద నిలబడేవాడు అయితే బొత్స, ధర్మాన, పెద్దిరెడ్లను మంత్రివర్గంనుంచి, తమ్మినేనిని స్పీకర్ పదవినుంచి తొలగించాలి
– మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్

ఉత్తరాంధ్ర, రాయలసీమ ఎమ్మెల్సీఎన్నికల్లో తెలుగుదేశం గెలుపుపై ప్రజలు స్వచ్ఛందంగా సంబరాలు చేసుకుంటున్నారని, జగన్ వచ్చేఎన్నికల్లో 175 స్థానాలు ఎలా గెలుస్తాడో చెప్పా లని, ముఖ్యమంత్రి, మంత్రులకు ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా ఎమ్మెల్సీఎన్నికల ఫలితాలకు బాధ్యతవహిస్తూ పదవులనుంచి వైదొలగాలని మాజీఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

 సిగ్గుంటే ముగ్గురూ తక్షణమే వారి పదవులకు రాజీనామాలు చేయాలి
“ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అన్న మంత్రులు, ఇప్పుడేం సమాధానం చెబుతారు? వైసీపీలో రోషంకలిగిన నేతలెవరూ లేరు. అందరూ గాలివాటంగా గెలిచినవారే. నిజంగా మంత్రులు బొత్స, ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేనికి సిగ్గుంటే తక్షణమే వారి పదవులకు రాజీనామాలు చేయాలి. ఉత్తరాంధ్రలో టీడీపీగెలుపుతో వారి మతిభ్రమించింది. ధర్మానప్రసాదరా వు, బొత్స కుటుంబాలు ఏం వ్యాపారాలు చేసి కోట్లు కొల్లగొట్టారు. వారి కుటుంబాలు భూఆక్రమణలతో వేలకోట్లు కొట్టేశారు. తమ్మినేని అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీ పీ ప్రభుత్వం రాగానే ముగ్గుర్నిరోడ్డుపై నిలబెట్టి, దోచేసింది అంతా కక్కిస్తాం. బొత్స, ధర్మాన, తమ్మినేనికి రోషం, పౌరుషం ఉంటే తక్షణమే పదవులకు రాజీనామా చేయాలి. జగన్ గురించి వైసీపీ వాళ్లకంటే నాకే బాగా తెలుసు. జగన్ ఒక అవినీతిపరుడిగానే దేశానికి తెలుసు. కానీ చంద్రబాబుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మర్యాదమన్ననలు ఎవరికీ ఉండవు. అమరావతిని రా జధానిగా ఎందుకు నిర్ణయించారో వైసీపీ వెధవలకు ఏంతెలుసు? రైతులు త్యాగంతో ఇచ్చిన భూముల్లో కొత్తనగరం సృష్టించాలన్నదే చంద్రబాబు ఆలోచన. దానిద్వారా ఆదాయంపెంచి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ప్రజలఆదాయం పెంచాలని చూశారు. ఇలాంటి ఆలోచనలు, వాటివ ల్ల కలిగే ఫలితాలు జగన్ కుఅతని దొంగలముఠాకు ఏంతెలుస్తాయి? ఎవరిసొమ్ముతో కట్టింది అని జగన్ ప్రజావేదిక కూల్చాడు? రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను ప్రజలకు అప్పగిస్తే ఏంచేస్తారు? అన్నంతినేవాడు ఎవడైనా అన్నాక్యాంటీన్లు మూసేస్తాడా? ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేనివాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రా?

నాలుగేళ్లలో దోపిడీ తప్ప, జగన్ రాష్ట్రానికి, ప్రజలకు చేసింది శూన్యం
ఉత్తరాంధ్రతోపాటు, తూర్పు,పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీనే గెలవ బోతోంది. చిత్తూరుజిల్లాకు, ఒకరకంగా రాయలసీమకు తానే రారాజునని భావించిన మంత్రి పెద్దిరెడ్డి, టీడీపీగెలుపుపై ఏం సమాధానంచెబుతాడు? ముఖ్యమంత్రి సొంతనియోజకవర్గం పులివెందులలోనే గ్రాడ్యుయేట్స్ టీడీపీని ఆదరించారు. దానికి ముఖ్యమంత్రి ఏంచెప్పి తప్పిం చుకుంటాడు? సంక్షేమానికి 90శాతం నిధులు ఖర్చుచేస్తున్నట్టు జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రానికి ఆదాయంతీసుకొచ్చి, ఆ సొమ్ముతో ప్రజలకు సంక్షేమం అందించాలి. అప్పు లు తెచ్చి, ఆసొమ్ములో పావలా ప్రజలకు ఇచ్చి, మిగిలింది కొట్టేయడం సంక్షేమ ఎలా అవు తుంది? మేథావులు, వ్యాపారులు, చదువుకున్నవారు జగన్ ను నమ్మడంలేదని తేలిపో యింది. జగన్ ఈ నాలుగేళ్లలో తనసంపద, తనకుటుంబసంపద పెంచుకున్నాడు. ఆయనకు పోటీగా కొందరుమంత్రులు కూడా పదితరాలకు సరిపడా పోగేశారు.

అవినాశ్ రెడ్డిని సీబీఐవారు మూసేస్తారని తెలిసే జగన్ ఢిల్లీ వెళ్లాడు
అసెంబ్లీలో రొమ్మువిరిచి అబద్ధాలు చెప్తూ, ప్రతిపక్షఎమ్మెల్యేలని అనడంకాదు. జగన్ రెడ్డి బయటకు వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలఫలితాలపై నోరువిప్పాలి. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు అని ప్రజలు ఓట్లేశారు.. దరిద్రంకాకపోతే. రాష్ట్ర సరిహద్దులు ఏవో జగన్ కు తెలుసా? చేతగాని నిర్ణయాలతో, అసమర్థతతో ప్రజల్ని రోడ్లపాలుచేశాడు. మాట్లాడితే దేవుడిదయ అనే ముఖ్య మంత్రి భక్తిఅంతా దొంగభక్తే అని అర్థమైంది. అందుకే దేవుడుకూడా జగన్ అహంకారాన్ని తగ్గించేలా చేశాడు. హుటాహుటిన జగన్ ఢిల్లీ ఎందుకువెళ్లాడు? ముఖ్యమంత్రికి జ్ఞానం లేదుకాబట్టే, ఎప్పుడు ఢిల్లీవెళ్లినా, ప్రధాని, కేంద్రమంత్రులతో మాట్లాడినా ఆవివరాలు బయటకు చెప్పలేకపోతున్నారు. అవినాశ్ రెడ్డిని సీబీఐవారు మూసేస్తున్నారని తెలిసే, జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని, అమిత్ షాను బతిమాలుకున్నాడు.” అని జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు.

Leave a Reply