Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగసంఘం నేతల స్వార్థంతో,14లక్షలమంది ఉద్యోగులు మోసపోయారు

 -ప్రభుత్వనిర్ణయంతో ఎవరిజేబుకైతే చిల్లుపడిందో, వారే పాలకులపై ధ్వజమెత్తాలి
• ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వానికి తాకట్టుపెట్టిన ఉద్యోగసంఘం నేతలు పాలకులకు తొత్తులుగా మారారు
• 2 ఏళ్ల వయోపరిమితి నిబంధనకు ఆశపడి, లక్షలాది మంది ఉద్యోగులజీవితాలను నాశనంచేస్తారా?
• 100 గొర్రెలకు ఒకసింహం నాయకత్వం వహిస్తే యుద్ధంలో గెలుపుసాధ్యమవుతుందిగానీ, 100 సింహాలకు గొర్రె నాయకత్వం వహిస్తే ప్రయోజనం శూన్యం
• ఉద్యోగులవిషయంలో ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, దుర్మార్గంగా వ్యవహరించింది
• అక్కాబావ కబుర్లు చెప్పే నాయకత్వం మాకు అక్కర్లేదని ఉద్యోగులు తెగేసిచెబుతున్నారు.
• 23శాతం పీఆర్సీ ప్రకటనకు రెండురోజుల సమయం తీసుకున్నవారు, సీపీఎస్ రద్దు పేరుతో జూన్ వరకు అని ఎందుకుఅంటున్నారు?
• ప్రాణాలైనా అర్పిస్తాం.. సీపీఎస్ సాధిస్తామన్న వారు ఇప్పుడేం సమాధానం చెబుతారు?
• తానేమీ టీడీపీఎమ్మెల్సీగా మాట్లాడటంలేదు… మాజీ ఉద్యోగసంఘంనేతగానే వాస్తవాలు చెబుతున్నాను
-టీడీపీ ఎమ్మెల్సీ, పార్టీ కేంద్రకార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు

వైసీపీప్రభుత్వం తాను అనుకున్నవిధంగానే పే రివర్స్ ఉత్తర్వులు ఇచ్చిందని, ఉద్యోగుల ప్రయోజనాలు, వారివేదన పట్టించుకోకుండా, పాలకులు వారుఅనుకున్నవిధంగా పీఆర్సీని 23శాతానికి తగ్గించడం ముమ్మాటికీ దుర్మార్గమేనని టీడీపీఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తేల్చిచెప్పారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

గతంలో ఎన్జీవో నాయకులు రెండుచేతులతో ఈ ప్రభుత్వానికి ఓట్లేశామని చెప్పారు… అలానే వారే తాము, తమకుటుంబసభ్యులు కలిపి 60లక్షలవరకు ఓట్లున్నాయని, కావాలంటే ప్రభుత్వాన్ని దించుతామనికూడా ఒకసందర్భంలో ప్రకటించారు. ఉద్యోగసంఘం నేతలు చూపిన విశ్వాసంగానీ, వారుచేసిన హెచ్చరికతోకూడినభయం గానీ ఈప్రభుత్వానికి లేవని తాజాగా ప్రకటించిన జీవోలతో స్పష్టమైంది. రెండులేకుండా ప్రవర్తించేది దుర్మార్గులు మాత్రమే . ఉద్యోగసంఘ నేతల పరిస్థితి ఎలాఉండాలో అలాఉంది. కొందరుఉద్యోగులు సంఘనేతల వైఖరిపై వారిపై చేయిచేసుకోవాలన్నంత తీవ్రఆగ్రహంతో ఉన్నారు. 62ఏళ్ల వయోపరిమితి పెంపునిర్ణయం సామాన్యఉద్యోగులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించేది కాదు. కేవలం కొందరు ఉద్యోగసంఘం నేతలే దానివల్ల లబ్దిపొందుతున్నారు.

ఉద్యోగసంఘ నేతలు మగాళ్లైతే, వారిలో నిజంగా సత్తా, ధైర్యంఉంటే, 60ఏళ్ల వయోపరిమితి చాలనిప్రభుత్వానికి తెగేసి చెప్పాల్సింది. ఫిబ్రవరిలో రిటైరయ్యేవారు వయోపరిమితి నిర్ణయం వెలువడినప్పుడే వెంటనే రాజీనామాలుచేసి సంఘాలనుంచి వైదొలిగిఉంటే, అప్పుడు కిందిస్థాయి ఉద్యోగులు వారి మాటలు నమ్మేవారు. పీఆర్సీవద్దు, 62ఏళ్ల వయోపరిమితి కావాలనడం ఎక్కడైనా ఉందా? 62ఏళ్లకు ఒప్పుకున్నరోజునే ఉద్యోగసంఘనేతల నిజాయితీ మంటగలిసింది. అంతా అయిపో యాక ఇప్పుడు ప్రభుత్వం విడుదలచేసిన పీఆర్సీజీవోలను తాముసమ్మతించం అంటే సరిపోతుందా? ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీవల్ల కేవలం కొద్దిమందికి మాత్రమే లబ్ధికలుగుతోంది. ఇప్పుడు ప్రకటించిన పీఆర్సీ అమలుకానప్పుడు, 62ఏళ్ల నిబంధన కూడా అమలుకాదు. ఉద్యోగసంఘనేతలు పీఆర్సీ నివేదికను కాకుండా అన్నింటినీ తిరస్కరించి ఉంటే బాగుండేది. వారిలో ఇంకా నిజాయితీ,ఏమాత్రం తెగువ ఉన్నా, ఇప్పటికైనా ఉద్యోగులు అందరి ప్రయోజనాల గురించిఆలోచించాలి. ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలు భౌతికంగా పోరాడటంమానేసి, వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్ లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఉద్యోగులు కేవలంఅల్పసంతోషులు. ప్రభుత్వం ఏదిప్రకటిస్తే దానిపై ఉద్యోగసంఘాలనేతలు సంబరాలు చేసుకుంటారా?

రాష్ట్రపౌరుడిగా ముఖ్యమంత్రి ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీని అభినందిస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు తనకు గతంలోచేసిన సాయాన్ని, ఇప్పుడు ఉద్యోగ సంఘాలనేతలుచేసిన వేడుకోళ్లు, హెచ్చరికలను బేఖాతరుచేసి, తాను అనుకున్నదే చేశారు.4శ్లాబులుగాఉన్న హెచ్ ఆర్ ఏ (హౌస్ రెంట్ అలవెన్స్ ) ను 3శ్లాబులకు కుదించా రు. వాటిలో ఒక శ్లాబ్ అసలు రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులకు వర్తించదు. ఎక్కడో ఢిల్లీలో ఏపీ తరుపున పనిచేసే 50, 60 మంది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.రాష్ట్రంలో ఉన్నదాదాపు 60శాతం ఉద్యోగులకు 8శాతం అన్న హెచ్ఆర్ ఏ నిబంధన మాత్రమే వర్తిస్తుంది.5ఏళ్లకు వచ్చేపీఆర్సీని కాదని పదేళ్లపీఆర్సీని అమలుచేయడం ద్రోహమే అవుతుంది. ఇంతకంటే రాష్ట్రఉద్యోగులు కొత్తగా నష్టపోయేది ఏమీలేదు. 4లక్షల వరకు ఉన్న ప్రభుత్వఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విభాగాలుకలిపి దాదాపు 14లక్షలమంది ఉద్యోగులుఅందరూ, ఉద్యోగసంఘనేతల స్వార్థంతో మోసపోయారు. అలాంటప్పుడు ఉద్యోగులు వారినేంచేసినా తప్పులేదు.

గతంలో టీడీపీప్రభుత్వంలో ఉద్యోగులకోసం పోరాడినవారే ఇప్పుడు సంఘనేతలుగాఉన్నారు. వారి అనుభవం, విజ్ఞత ఇప్పుడుఏమయ్యాయి? 23శాతం పీఆర్సీ అన్నప్పుడే నేతలు తమకొద్దని ప్రభుత్వంతో చెప్పి ఉండాల్సింది. ప్రభుత్వం ఏదో ఒరగబెడుతుందని నమ్మి, ఉద్యమాన్ని ఆపేశారు. ఇప్పుడు ఉద్యోగులు ఎవరైనాతిరిగి సంఘనేతలతోకలిసివచ్చే పరిస్థితిఉందా? రాష్ట్రఆర్థికపరిస్థితి బాగోలేకపోతే, ప్రభుత్వం ఉద్యోగ సంఘనేతలకు, ఉద్యోగులకునచ్చచెప్పి, ఒప్పించుకోవాల్సింది. అంతేగానీ కేంద్రప్రభుత్వ పీఆర్సీ అమలుచేస్తా మనడం ముమ్మాటికీ వారిని వంచించడమే. నాయకత్వ ఆలోచనలు తప్పుదారిలో వెళ్లిన ఫలితం ఉద్యోగులకు మోసాన్నే మిగిల్చింది. తమమాటలపై 14లక్షలమంది ఉద్యోగుల జీవి తాలు ఆధారపడి ఉన్నాయన్న విజ్ఞతను ఉద్యోగసంఘంనేతలు విస్మరించబట్టే, నేడు ఇంత నష్టంజరిగింది. 23శాతం పీఆర్సీ అన్నప్పుడే మాకు కుదదరదని ప్రభుత్వానికి తెగేసిచెప్పి ఉంటే, ఉద్యోగసంఘం నేతలకు కాస్తైనా గౌరవం ఉండేది. 100 సింహాలకు ఒకగొర్రె నాయక త్వం వహిస్తే యుధ్ధంలో గెలవలేమని, కానీ 100 గొర్రెలకు ఒకసింహం నాయకత్వం వహిస్తే కచ్చితంగా గెలుపుసాధ్యమవుతుందని ఆంగ్లసామెత ఉంది. ఏపీలో ఉద్యోగ సంఘాల నాయకత్వంచూస్తే అది నిజమనిపిస్తోంది. ఉద్యోగసంఘంనేతలు చెప్పేది విని, ఉద్యోగులు మౌనంగా ఉంటారా…తిరగబడతారో అదివారిష్టం.

సీపీఎస్ రద్దువారంలో అని ముఖ్యమంత్రి చెబితే, దానికి టైమ్ లిమిట్ లేదని ఆర్థికమంత్రి అసెంబ్లీలో చెప్పారు. ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డేమో సీపీఎస్ రద్దు అంశం లాంటి లోతైన అంశాలు తమకుతెలియవని, ఇప్పుడు తెలుసుకున్నామని సన్నాయి నొక్కు లు నొక్కారు. ఇప్పుడేమో కంటితుడుపు చర్యగా జూన్ లోపు నిర్ణయం తీసుకుంటామని చె బుతున్నారు. అలాచెప్పడం ఉద్యోగులను మోసగించడం కాక మరేమిటి? రాష్ట్రప్రభుత్వాలు కేంద్రానికి ఇదివరకే సీపీఎస్ కు సంబంధించి ఒక ఒప్పందానికి వచ్చిఉన్నాయి. సీపీఎస్ రద్దు అనేది సాధ్యం కాదనితెలిసీ ఇంకాఎన్నాళ్లూ ఇలా మోసంచేస్తారు?

చంద్రబాబునాయుడి హాయాంలో ఉద్యోగులకు తొలిసారి ఫ్యామిలీ పెన్షన్ ఇప్పించాము. సీపీఎస్ ఉండి గ్రాట్యుటీ ఇస్తున్నరాష్ట్రంగా కూడా ఏపీ నిలిచింది. సీపీఎస్ ఉద్యోగి చనిపోతే, సాధారణంగా వచ్చే పింఛన్ కంటే, ఫ్యామిలీ పెన్షన్ ఎక్కువవస్తుంది. సీపీఎస్ రద్దు నిర్ణయంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకే క్లారిటీలేదు. కానీ దాన్ని కొందరు ఉద్యోగసంఘంనేతలు స్వార్థానికి వాడుకున్నారు. ప్రాణాలైన అర్పిస్తాం..సీపీఎస్ సాధిస్తామని గతంలో తమను కార్నర్ చేసిన వారు ఇప్పుడేం సమాధానంచెబుతారు? ఈ ప్రభుత్వంపై పోరాడినా వారిప్రాణాలేమీ పోవనే అనుకుంటున్నా. మహా అయితే క్రమశిక్షణాచర్యల కింద సంఘనేతలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒక్కసారి జీవోలు ఇచ్చేసిన తర్వాత ఉద్యోగసంఘం నేతలు చేసే ఏ ఉద్యమానికి నిజాయితీ ఉండదు. ఎందుకంటే సంఘనేతల్లో నిజాయితీ లేదుకాబట్టి.

ప్రభుత్వం రాజకీయంగా ఉద్యోగులను ఇప్పుడు ఏమీచేయలేకపోవచ్చు..కానీ 2024 ఎన్నికలవేళ పరిస్థితి ఎవరికి అనుకూలమో ఆలోచించుకోవాలి. ఫ్యూడల్ పాలన ప్రజాస్వామ్యంలో నడుస్తోంది.. దానికి ఉదాహరణే ఏపీలో ప్రకటించిన పీఆర్సీ. రాజకీయంగా తెలుగుదేశం ఏదైనా చెప్పొచ్చు.. కానీ అవిఇప్పుడు ముఖ్యంకాదు. టీడీపీహాయాంలో ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి దాదాపు 50జీవోలు ఇవ్వడంజరిగింది. వైసీపీప్రభుత్వం ప్రజలతోఎలాఉండాలి.. ఉద్యోగులకు ఏంచేయాలనే ఆలోచనలో లేదు. ఉద్యోగులు ప్రభుత్వానికి బాధ్యతగా వ్యవహరి స్తుంటే, ఉద్యోగసంఘంనేతలు ప్రభుత్వానికి తొత్తులుగా మారి నాయకత్వహీనులుగా మారా రు. ఉద్యోగసంఘంనేతలు తమకు, టీడీపీకి సమాధానంచెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో వారికైవారే ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఉద్యమం జరిగితే తప్ప, ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఆలోచించేలా కనిపించడంలేదు. గతంలో టీడీపీకి ఏంన్యాయంచేయలేదని ఉద్యోగసంఘాలనేతలేచెప్పారు.. కానీ సామాన్య ఉద్యోగికి అన్యాయం జరుగుతోందనే తాము మాట్లాడుతున్నాంగానీ, ఏదో ఆశించికాదు.

ప్రభుత్వం ఉద్యోగులవిషయంలో ఇచ్చిన జీవోలన్నీ దారుణాతిదారుణం. పీఆర్సీ నివేదిక కూడ ఉద్యోగసంఘాలకు ఇవ్వకుండా జీవోలివ్వడం దేశచరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం. ప్ర భుత్వ నిర్ణయంతో ఎవరిజేబులకు చిల్లు పడిందో, వారే ప్రభుత్వంపై ధ్వజమెత్తాలి. అంతేగానీ వాట్సాప్ యుద్ధాలు, పేపర్ల యుధ్దాలు, బ్యాడ్జీల యుధ్దాలతో ఉపయోగం లేదు. ఉద్యోగులకు న్యాయం జరిగేవరకు తెలుగుదేశం నేతగాకాకుండా, అశోక్ బాబుగా నామద్ధతుఎప్పుడూ వారికి ఉంటుంది. ఉద్యోగసంఘం నేతలు ఇప్పుడు పీఆర్సీ వద్దంటున్నారు.. పీఆర్సీ వద్దంటే వయోపరిమితి పెంపుని కూడా వద్దంటున్నారనే అనుకోవాలా?

LEAVE A RESPONSE