– ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం
– మహిళలలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
– పారిశ్రామిక రంగంలో మహిళలు వేసే ప్రతి అడుగులోను ప్రభుత్వం తోడుగా ఉంటుంది
– సెయింట్ ఆన్స్ తో నా అనుబంధం మరువరానిది
– కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఎన్.సి.సి బలోపేతం చేస్తా
– గ్లోబల్ సిటీగా హైదరాబాద్
– నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: ఆకాశమే సరిహద్దుగా అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని,మహిళా సాధికారతకు ఈ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఆయన చెప్పారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఏదగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని,పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్న మహిళలు వేసే ప్రతి అడుగులోనూ రాష్ట్ర ప్రభుత్వం చేయూత నందిస్తుందని ఆయన చెప్పారు.
గురువారం ఉదయం హైదరాబాద్ మోహిదిపట్నం లోని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రాంగణంలో ఆయన ఇన్క్యూబేసిన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ పాఠశాలలు,కళాశాలల అధ్యక్షురాలు మదర్అంతోనమ్మ, హైదరాబాద్ ప్రావిన్స్ పాఠశాల విద్యాసంస్థలకు చెందిన డాక్టర్ సిస్టర్ ఏ.విజయ రాణి, ఎన్.ఐ-యం.ఎస్.యం.ఇ డైరెక్టర్ డాక్టర్ విజయ ఏరండి, టి.హబ్ సి.ఇ. ఓ సీత పల్లచోల్ల,ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇన్క్యు బేసిన్ కేంద్రాలు ఆర్థిక వ్యవస్థలకు వెన్నుముఖగా నిలబడతాయాన్నారు.ఇలాంటి కార్యక్రమాలు విద్యారంగం పరిశ్రమలతో కలసి ఏర్పాటు చేస్తే ప్రపంచ స్థాయిలో వారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నారు.ఈ ప్రక్రియలో మహిళలు అగ్రభాగాన ఉండాలని ఆయన చెప్పారు.
మహిళా పారిశ్రామిక వేత్తలకు సెయింట్ ఆన్స్ ప్రారంభించిన ఇన్క్యూబేసిన్ ఫౌండేషన్ మార్గదర్శనంగా మారనుందన్నారు. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా హెల్త్ కేర్,విద్య,గ్రామీణాభివృద్ధి డిజిటల్ రంగాల అభివృద్ధిలకు దోహదపడుతుందన్నారు. అందుకు తెలంగాణా ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన చెప్పారు. టి-హబ్,వి-హబ్ స్టార్టప్ లతో సరి సమానంగా సెయింట్ ఆన్స్ లో ప్రారంభం అయిన ఇన్క్యూ బేసిన్ ఫౌండేషన్ మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించేందుకు పునాదిగా మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పారిశ్రామిక వేత్తలను,పెట్టుబడిదారులను పూర్వ విద్యార్థులు కలుపుకుని ఈ ఇన్క్యూబేసిన్ ఫౌండేషన్ ను సామాజిక పారిశ్రామిక వేత్తలకు పరిశోధన కేంద్రంగా రూపొందించాలని ఆయన చెప్పారు. సెయింట్ ఆన్స్ విద్యా సంస్థలతో తన అనుబంధం ఇప్పటిది కాదని తన విద్య మొదలు అయ్యిందే బి.హెచ్.ఇ. ఎల్ సెయింట్ ఆన్స్ విద్యాసంస్థల నుండి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరి అటునుండి పైలెట్ గా జీవితం మొదలు పెట్టిన తాను చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం MIG-21,MIG-23 వంటి యుద్ద విమానాలు నడపడం వరకు పనిచేసిన అనుభూతి, రాష్ట్రపతులు ఆర్.వెంకట్ రామన్,శంకర్ దయాల్ శర్మ ల వద్ద పని చేసిన అనుభవం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
ఆ తరువాత కాలక్రమంలో రాజకీయాలలో అడుగిడిగి వరుసగా ఆరు సార్లు శాసనసభ్యుడిగా, ఒక మారు లోకసభ సభ్యడిగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోను మంత్రి గా పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించానన్నారు. కళాశాలలో ఎన్.సి.సి కేడెట్ల పరేడ్ ను చూసిన ఆయన ఎన్.సి.సి బలోపేతానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.