Suryaa.co.in

Features

అదుపుతప్పి కింద పడితే ఆదుకోదు “లోకం”

అదుపుతప్పి కింద పడితే
ఆదుకోదు “లోకం”
దారిలోనే చీకటైతే తోడుండదు
“నీడ”
చేయిజారి దూరమైతే చేరుకోదు
“ప్రేమ”
అలసిపోయి కన్నుమూస్తే ఆపలేదు
“బంధం”
అందుకే నిన్ను నువ్వు నమ్ముకో
నువ్వే ముందుకు సాగిపో!
జీవితంలో విజయం తాలూకు గుర్తులే కాదు, అపజయం తాలూకు ముద్రలు కూడా కనిపిస్తాయి.. సూర్యాస్తమయం లేకుండా సూర్యోదయం కాదు.. వర్షం తాకిడిని తట్టుకుంటేనే ఇంద్ర ధనుస్సు అనుభూతి దక్కుతుంది..
జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాద్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు.
అపుడే మనిషిగా నీ జన్మకు ఒక అర్ధం వుంటుంది..
నీ జీవితంలో నిన్ను కలిసిన ప్రతీ ఒక్కరిది ఒక్కొ పాత్ర ఉంటుంది..
కొందరు నిన్ను పరీక్ష చేస్తారు కొందరు నిన్ను వాడుకుంటారు..
కొందరు నిన్ను ప్రేమిస్తారు కొందరు నీకు నేర్పిస్తారు ఎవరైతే నీలోని శక్తిని గుర్తించి వెలికి తీస్తారొ వారే నీ జీవితానికి అతిముఖ్యులు.. విలువైన వారు, మరచిపోలేని వారు..
జీవితంలో ఎదగాలంటే ఎప్పుడూ ఏదో ఒకటి తెలుసుకుంటూనే, నేర్చుకుంటూనే ఉండాలి.. మన ఆలోచన విధానాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. కాబట్టి సానుకూలంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి..
మనిషి గుణాలన్నింటికి సాహసం
మొదలు…
సాహసం ఇతర గుణాలకు బాధ్యత
వహిస్తుంది.
తప్పు చేయడానికి ఎవరూ
భయపడడం లేదు…!!
చేసిన తప్పు బయటపడకుండా
ఉండడటం కొసం మాత్రమే…
భయపడుతున్నారు… అంతే!!
పేడ దిబ్బపై ప్రకాశించినా సూర్య కిరణాలు మాలిన్యం కానట్టే దృఢ సంకల్పంతో ఉన్న వాడి మనసు ఎవరూ పాడు చేయలేరు.

LEAVE A RESPONSE