Suryaa.co.in

Andhra Pradesh

సవాల్ కు టీడీపీ సిద్ధమైతే , వైసీపీ తోకముడిచింది

– డ్రగ్స్ పరీక్షలకు టీడీపీ నేతలంతా హైదరాబాద్ కు వెళితే, వైసీపీ వ్యక్తి ఒక్కడూ అక్కడ కనిపించలేదు
– హూ ఈజ్ డ్రగ్ డాన్ ఇన్ ఏపీ అనే ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచమంతా ఉత్సుకతతో ఎదురుచూస్తోంది
– ముఖ్యమంత్రి సాగిస్తున్నచీకటి వ్యాపారాలను కొల్లగొట్టడమే టీడీపీ అంతిమధ్యేయం
– టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
రాష్ట్రముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రగ్స్ కార్యకలాపాలపై పలుమార్లు నిలదీశామని, వైసీపీఎమ్మెల్యే సామినేని ఉదయభానురెండో కుమారుడు ప్రశాంత్ గంజాయి అక్రమరవాణాచేస్తూ తెలంగాణ పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో, తాడేపల్లి ప్యాలెస్ కు, ప్రగతిభవన్ కుఉన్న అవినాభావసంబంధం ప్రశాంత్ ను బయటపడేలా చేసిన సందర్భంలో సామినేని ఉదయభానుకి తాను సవాల్ చేయడం జరిగిందని, ఆయనతోపాటు ఏపీ వైసీపీ నాయకత్వాన్ని కూడా, టీడీపీ యువ నాయకత్వం తరుపున సవాల్ చేశామని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు శుక్ర వారం ఆయన ఇతర టీడీపీయువనేతలతో కలిసి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు వారిమాటల్లోనే …
ఏపీలో జరుగుతున్న డ్రగ్స్ దందాతో, మత్తుపదార్థాల వినియోగం,రవాణా లో సంబంధంలేదని నిరూపించుకోదలుచుకుంటే, అక్టోబర్ 1వతేదీన, ఉదయం పదిగంటలకు, హైదరాబాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు రావాలని, వైసీపీనేతలకు, ఆపార్టీఎమ్మెల్యే ఉదయభాను, అతనికుమారు డుప్రశాంత్ కు తాను సవాల్ విసరడం జరిగింది. వారి రక్త, వెంట్రుకల నమూనాలు వారిస్తే, నాతోపాటు, టీడీపీయువనేతలందరంకూడా తమ తమనమూనాలుఇచ్చి డ్రగ్స్ పరీక్షలుచేయించుకుంటారని చెప్పడం జరి గింది. పరీక్ష ఫలితాలద్వారా ఎవరికి మత్తుపదార్థాలతో, డ్రగ్స్ దందాతో సంబంధాలున్నాయో తేలిపోతుందని చెప్పడంజరిగింది.
ఆవిధంగా తాము విసిరిన సవాల్ కు కట్టుబడి, నేడు (అక్టోబర్ 1వతేదీ) అందరం హైదరా బాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి అందరం వెళ్లాము. మేమంతా ఉదయాన్నే వెళ్లి, అక్కడే చాలాసేపు ఎదురుచూశాం. కానీ వైసీపీ పిరికిసన్నాసులెవరూ అక్కడికిరాలేదు, ఉదయభాను, ఆయన రెండో కుమారుడుప్రశాంత్ కూడా అక్కడికిరాలేదు. దాన్నిబట్టే అందరూ అర్థంచేసుకోవాలి.. వైసీపీప్రభుత్వంలో మాదకద్రవ్యాల వ్యాపారం ఏ స్థాయిలో సాగుతోందో..అధికారపార్టీనేతలు ఎంతలా వాటిమత్తులో జోగుతున్నారో, ఏపీయువతను ఎంతలా పెడదారిపట్టించి, మత్తుకుబానిసల్ని చేసి, తమ జేబులు నింపుకుంటున్నారో అందరు అర్థంచేసుకోవాలి.
హూ ఈజ్ డ్రగ్ డాన్ ఇన్ ఏపీ అనేహ్యాష్ ట్యాగ్ ప్రపంచమంతా ట్రెండ్ అవుతోంది. ఆ ప్రశ్నకు సమాధానంకోసం ప్రపంచమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూ స్తోంది. దేశంలో ఏమూల మాదకద్రవ్యాలు పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ పేరే ఎందుకు వినిపిస్తోంది?ఉత్తరప్రదేశ్ లో గంజాయి పట్టుకున్నా, మహారాష్ట్రలో హెరాయిన్ పట్టుకు న్నా, కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎందుకుంటోంది? గుజరాత్ లోని ముంద్రా పోర్టులో డీఆర్ఐ అధికారులుపట్టుకున్నహెరాయిన్ ఏపీ లోని విజయవాడలో గల ఆషీట్రేడింగ్ కంపెనీ చిరునామాతో ఎందుకుంది? వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో, వైసీపీప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి వినిపించడంలేదా? ఆఫ్రికాఖండం లో హెరాయిన్ కు కేంద్రబిందువైన ఐవరీకోస్ట్ లో తమకు గోదాములున్నా యని, అదేదో గొప్పఘనకార్యమైనట్లు చెప్పుకుంటున్నాడు.
స్వచ్ఛమైన మచ్చలేని నాయకుడైన చంద్రబాబునాయుడి నాయకత్వంలో పనిచేస్తున్న తామందరం, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు వచ్చి, మా నిజాయితీని నిరూపించుకున్నాం. మత్తుపదార్థాలు, డ్రగ్స్ దం దాతో తమకు, తమపార్టీకి సంబంధంలేదుకాబట్టే, దమ్ముగల యువ నాయకులందరం హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కువచ్చాం. కానీ వైసీపీలో దమ్ముగల నాయకులుఎవరూలేరని తేలిపోయింది. తమతో పాటు డ్రగ్స్ పరీక్షలకు రాకుండా తోకముడిచిన పిరికిసన్నాసులెవరో తేలిపోయింది. హూఈజ్ డ్రగ్ డాన్ ఇన్ ఏపీ అనేప్రశ్నకు సమాధానం జగన్మోహన్ రెడ్డే. ఆ విషయం బల్లగుద్దీ మరీచెబుతాం.
420 సీఎం జగన్ రెడ్డి, ఇప్పటికే చేస్తున్న అనేక వ్యాపారాలు చాలవన్నట్లు డ్రగ్స్ వ్యాపారంలో దిగాడు. రాష్ట్రయువత భవిష్యత్ సర్వనాశనంచేస్తూ తన ఖజానా నింపుకుంటున్నాడు. చంద్రబాబునాయుడు యువతభవిష్యత్ కోసం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి, ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ ను చేస్తే, జగన్మోహన్ రెడ్డి, గంజాయి, ఇతరమాదకద్రవ్యాల రవాణాకు ఏపీని కేంద్ర బిందువుగా మార్చి డ్రగ్సాంధ్రప్రదేశ్ నుచేశాడు. ఈ వాస్తవాలను ఏపీ ప్రజలు అర్థంచేసుకోవాలని కోరుతున్నాం. డ్రగ్స్ పరీక్షలకు రాకుండా తోక ముడవడం ద్వారా వైసీపీనేతలే డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల్లో మునిగి తేలుతున్నారని వారికైవారే ఒప్పుకున్నారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీకి పోలీసులుముందే ఎలా క్లీన్ చిట్ ఇస్తారు? వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిఎందుకు విచారించరు?
ఆషీట్రేడింగ్ కంపెనీ యజమాని సుధాకర్ కు, చంద్రశేఖర్ రెడ్డికి ఉన్న సబంధమేంటో పోలీసులు తేల్చాలి కదా? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమ్ముళ్లు చెన్నైకేంద్రంగా ఛేస్తున్న దందాఏమిటి? డీఆర్ఐ వారు ఆదేశించినా కూడా ఏపీపోలీసులు ఎందుకు పనిచేయడంలేదు? డ్రగ్స్ వ్యవహారాన్నికప్పిపుచ్చే ప్రయత్నాలు ఎందు కుచేస్తున్నారు. టన్నులుటన్నుల గంజాయి, ఇతరమాదకద్రవ్యాలు బయటకు వస్తుంటే, పోలీసులు ఎందుకు నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటు న్నారు? ఏపీకి ఏంసంబంధంలేదని డీజీపీఎలా చెబుతారు? వైసీపీ ఎమ్మెల్యేనే స్వయంగా ఐవరీకోస్ట్ లో తనకు గోదాములున్నాయని చెప్పడమేంటి? ఈ వ్యవహారంతోఏపీ సీఎంకు సంబంధముందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?
చింతకాయల విజయ్ (టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి) : తెలుగుదేశంపార్టీ ఏదైనా ఛాలెంజ్ విసిరితే దానికి కట్టుబడుతుంది. దానిలో భాగంగానే తామందరం నేడు హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు డ్రగ్స్ పరీక్షల కోసంవచ్చాము. ఇలా వస్తామని వారంనుంచే చెప్పాముకూడా..కానీ వైసీపీ వాళ్లు ఎవరూ ముందుకురాలేదు. తామువిసిరిన సవాల్ కు వారు ముందుకురాలేదంటే, వారు ఏపరిస్థితిలోఉన్నారో అర్థంచేసుకోవచ్చు. ఇదివరకు ఏపీగురించి సన్ రైజ్ స్టేట్ అని, పెట్టుబడులకుస్వర్గథామమని మాట్లాడుకునేవారు. కియా,హీరో, అపోలో, అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు చంద్రబాబునాయుడి కృషితో నవ్యాంధ్రప్రదేశ్ కు తరలివచ్చాయి. ఈనాడు తామంతా వెళ్లిన సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా చంద్రబాబు నాయుడుగారుఉమ్మడి రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిందే.
డ్రగ్స్ ఛాలెంజ్ అనేపేరుతో నేడు తాము హ్యాష్ ట్యాగ్ కూడా నిర్వహిం చాము. రూ.72వేలకోట్ల విలువైన మాదకద్రవ్యాలు విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీకి ఎక్కడినుంచో వస్తూపట్టుబడితే, ప్రపంచమంతా నివ్వెర పోయింది. ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక, భారీమొత్తంలో హెరాయిన్ ఇండియాకు, మరీముఖ్యంగా ఏపీకి వచ్చింది. ఇదేమీ సాధా రణ వ్యవహారంకాదు. ఆఫ్ఘానిస్తాన్ నుంచి ఏపీకి హెరాయిన్ దిగుమతి అయితే జగన్ రెడ్డి నిద్రలోనుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎందుకు బయటకు రావడంలేదు? డ్రగ్స్ దందాపై ప్రజలకు సమాధానంచెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఏదైనా అంటే జరుగుతున్నవాటి గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి ఏదేదో మాట్లాడతారు. లేకపోతే ప్రశ్నించేవారి ని బూతులుతిడతారు.
చంద్రబాబునాయుడి నాయకత్వంలో పనిచే సే వారెవరూ నెగటివ్ మైండ్ తో పనిచేయరు. అందుకే దమ్ముగా, ధైర్యంగా తామందరం డ్రగ్స్ పరీక్షలకు వచ్చాము . తాము విసిరి న సవాల్ కు తాము కట్టుబడితే, వైసీపీవారు తోకముడిచారు. దేశంలో ఎక్కడ ఏవిధమైన మత్తుపదార్థాలు బయటపడినా, వాటిమూలాలు ఆం ధ్రప్రదేశ్ లోఉంటున్నాయి. యువత భవిష్యత్ కాపాడాలి.. కొత్త రాజధాని నిర్మించాలన్న ధృడసంకల్పంతో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదంమోపారు. రాష్ట్రంలో ఎక్కడా వాటిచలామణీ లేకుండాచూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నియంతపాలనలా మారింది. డ్రగ్స్ పరీక్షలకు రానప్పుడే వైసీపీ వారికి డ్రగ్స్ వ్యవహారంతోసంబంధాలున్నాయని తేలిపోయింది. తమతో పాటు డ్రగ్స్ పరీక్షలకోసం సిద్ధపడిన తెలంగాణ తెలుగుయువత విభాగాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.
పూరీ జగన్నాథ్ ప్రముఖ సినీదర్శకుడు, అతని సోదరుడు ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే. పూరీ జగన్నాథ్ సహా, ఇతర సినీ ప్రముఖులపై డ్రగ్స్ ఆరోపణలువస్తే, సదరు కేసును విచారిస్తున్న అకున్ సబర్వాల్ అనే అధికారిని బదిలీచేశారు. ఎవరో వేరేవారికి బాధ్యతలు అప్పగించి, పూరీజగన్నాథ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. పూరీజగన్నాథ్ అనేవ్యక్తికి డ్రగ్స్ పరీక్షలుచేశారా..చేస్తేఎప్పుడు చేశారు? ఎప్పుడు జరిగిన పరీక్షలకుఎప్పుడు క్లీన్ చిట్ ఇచ్చారు? ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న డ్రగ్స్ దందాపై ప్రభుత్వాలు స్పందించ వా? పాలకులు నోరువిప్పరా? వారునోరుతెరవకుండా పేమెంట్ బ్యాచ్ తో మాట్లాడిస్తే కుదరదు. హూ ఈజ్ డ్రగ్ డాన్ ఇన్ ఏపీ అనే ప్రశ్నకు సమాధానంకావాల్సిందే. అది బయటపెట్టేవరకు టీడీపీ, ఉభయరాష్ట్రాల ప్రభుత్వాలను వెంటాడుతూనే ఉంటుందని స్పష్టంచేస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డే డ్రగ్ డాని ఎందుకు చెబుతున్నామంటే, ఆయనే పూరీ జగన్నాథ్ ను కాపాడారు. కోదాడలో మరోప్రముఖుడిని కాపాడారు. ఆంధ్రాలో డ్రగ్స్ దందా సాగిస్తున్నది ముమ్మాటికీ వైసీపీనేతలే. డ్రగ్స్ వ్యాపారంచేసేవారు మాట్లాడకుండా, వారితరుపున పోలీసులు సమాధానంచెప్పడమేంటి? ద్వారంపూడిఅనే ఊరిలోనుంచి డ్రగ్స్ కార్యకలాపాలుసాగిస్తున్నవ్యక్తి ఎవరు…అతనికి అక్కడున్నస్థానిక ఎమ్మెల్యేకు ఉన్నసంబంధమేంటి? అక్కడి వైసీపీఎమ్మెల్యేలకు, సముద్రపు దొంగగా పిలువబడే వ్యక్తితో ఉన్న సంబంధాలేమిటి? ఏరోజైతే హెరాయిన్ పట్టుబడిందో, అదేరోజున కాకినాడకుసమీపంలోసముద్రంలోనే ఒక బోటు తగలబడింది. దానికి సంబంధించిన కథనాలనుకూడా తాము నిన్నవిడుదలచేశాము. వీటన్నింటికీ ఉన్నసంబంధమేమిటో ఏపీ ప్రభుత్వం తేల్చదా?
ఈ వ్యవహా రాలపై కేంద్రప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టాలనికోరుతున్నాం. ఆఫ్ఘనిస్తా న్ లో తాలిబన్లు పాగావేయగానే, అక్కడినుంచి దేశంలోకి హెరాయిన్ దిగుమతులుప్రారంభం అయ్యాయి. వాటివెనకున్నదెవరో తేల్చాల్సింది కేంద్రప్రభుత్వమే. తాము ఈ విధంగా వాస్తవాలు మాట్లాడుతుంటే,ఎవడో ఒక పేటీఎమ్ గాడు వచ్చి తాముఅడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప కుండా బూతులు తిడతాడు. తాముఅలా మాట్లాడము. హూఈజ్ డ్రగ్ డాన్ ఇన్ ఏపీ అనే హ్యాష్ ట్యాగ్ గురించి మాట్లాడుతున్నాం. రూ72వేలకోట్ల విలువైన హెరాయిన్ రూ.2లక్షలకోట్లకుఎలా పెరిగింది? జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా, జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన అడిగిన వాటికి సమాధానంచెప్పకుండా ఎవరో సంబంధంలేనివాడితో ఏవేవో అనిపించారు. అలాంటి పీకే వ్యూహాలు వాడటం మానుకోండి. రేపు చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక, డ్రగ్స్ దందాతో వైసీపీవారికున్న లింకులను బయటపెట్టి, వారందరినీ కటకటాల్లోకి పంపే తీరుతామని, అందుకు సంబంధించిన బాధ్యతనుకూడా తామందంరం సమిష్టిగానే తీసుకుంటామని తేల్చిచెబు తున్నాను.
ఎమ్.ఎస్.రాజు (టీడీపీఎస్సీసెల్ ఏపీ అధ్యక్షులు) : ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక డ్రగ్స్ మాఫియా పేట్రేగిపోతోంది. కిళ్లీకొట్లు,బడ్డీకొట్లలో గంజాయి, ఇతరమాదకద్రవ్యాల అమ్మకాలు సాగు తున్నాయి. వైసీపీప్రభుత్వంలోని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబం ధించిన హవాలాసొమ్ము చెన్నైలోపట్టుబడినా అతనిపై చర్యలులేవు, మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రచందనం దోచేస్తూ, వైసీపీఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి అక్రమంగా ఎర్రచందనాన్ని విదేశాలకు తరలిస్తున్నాడు. ఇసుక, మద్యంతోపాటు, ఎర్రచందనం వ్యాపారంలో మునిగితేలుతున్నారు. వేలకోట్ల సంపాదనే ధ్యేయంగా రాష్ట్రాన్నిదోచేస్తు న్నారు. ఇదంతా ఒకెత్తయితే, కొత్తగా జగన్ ప్రభుత్వం మాదకద్రవ్యాల వ్యాపారం మొదలుపెట్టింది.
కిలో, అరకిలో గంజాయి దొరికితేనే, నిందితు లను పట్టుకునే పోలీసులు, ఇప్పుడువేలకోట్ల విలువైన మాదకద్రవ్యాలు ముఖ్యమంత్రి ఇంటిసమీపంలో పట్టుబడినా ఎందుకుస్పందించడంలేదు? అదేదో చిన్నసమస్యఅయినట్లు డీజీపీస్థాయి అధికారి మాట్లాడటంసిగ్గుచే టు కాదా? ప్రభుత్వానికి వత్తాసుపలికేలా డీజీపీ మాట్లాడటంచూస్తుంటే, పోలీస్ శాఖే ఏపీలో ఉన్న డ్రగ్ డాన్ లకు అండగాఉన్నట్లు అనిపిస్తోంది. బద్వేలు ఉపఎన్నికకు ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఇన్ ఛార్జ్ గా నియమించడం వెనక పెద్దకుట్రే ఉంది. ఇసుక, మద్యం , ఎర్రచందనం అక్రమరవాణాతో పెద్దిరెడ్డి సంపాదించిన సొమ్ముతోనే రేపు, వైసీపీ బద్వేల్ ఉపఎన్నికలో ఓట్లు కొనబోతోంది. అక్రమమద్యం అమ్మకాలతో వచ్చిన సొమ్ముతోనే జగన్ ప్రభుత్వం తాలిబన్లనుంచి డ్రగ్స్ కొని, రాష్ట్రంలో చలా మణీలోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని భావితరాలను కాపాడుకోవడానికి, ముఖ్యమంత్రి సాగిస్తున్న చీకటివ్యాపారాన్ని కొల్లగొట్టడానికి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోతామంతా సమిష్టిగా పోరాడతాం.
టీడీపీ యువ నేతలు విసిరిన ఛాలెంజ్ కు వైసీపీనేతలు ఎందుకు కట్టబడలేదు? ఒక్కరంటే ఒక్కరూ ఎందుకు డ్రగ్స్ పరీక్షలకు రాలేదు? ముఖ్యమంత్రి చేసే అరాచక, నికృష్టపు పనులకు డీజీపీనే స్వయంగా కొమ్ముకాస్తున్నా రు. రాష్ట్రంలో ఆడబిడ్డల మానప్రాణాలుపోతున్నాకూడా డీజీపీకి పట్టడం లేదు. మాజీముఖ్యమంత్రి ఇంటిపైకిదాడికివస్తే, వచ్చినవారికి కొమ్ముకాస్తూ డీజీపీ వారువినతిపత్రాలు ఇవ్వడానికివెళ్లారన్నాడు. తాముకూడా త్వరలోనే కొడాలినానీ వంటివారికి వినతిపత్రాలు ఇవ్వడాని కి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశంపార్టీ ఆదేశాలతో ఏపీ డ్రగ్ డాన్ ఎవరో ఆ రాష్ట్రప్రజలకు తెలియచెప్పేవరకు తమపోరాటం ఆగదు.
బల్లగుద్ది ఆవేశం గా మీడియాముందు మాట్లాడిన పోసాని , వైసీపీవారు తమను తిడుతు న్న బూతులపై ఏంసమాధానంచెబుతాడు? బూతులు మాట్లాడకుండా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తుంటే బూతులు మాట్లాడతారా? వీటన్నింటిపై పోసాని ఏం సమాధానంచెబుతారు? ఆడబిడ్డలనే సంస్కారంకూడా లేకుండా అశ్లీలంగా ప్రవర్తిస్తూ, అసభ్యపదజాలం వాడతా రా? రైతులను లంజాకొడుకులని తిట్టిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు, పోసాని సభ్యత సంస్కారాలు నేర్పించాలి. కొడాలినానీ వెధవలకు పోసాని సభ్యత సంస్కారంనేర్పాలి. తనఫోన్ చూస్తే, వైసీపీకుక్కలుఎంత హీనంగా వ్యవహరిస్తున్నాయో పోసానికి అర్థమవుతుంది. పోసాని కృష్ణమురళి తన నవరసాలను తాడేపల్లి ప్యాలెస్ లో ప్రదర్శిస్తే మంచిది.
శ్రీరామ్ చినబాబు (ఏపీ తెలుగుయువత అధ్యక్షులు) : వైసీపీ వారు భయపడే డ్రగ్స్ పరీక్షలకు రాలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక, మద్యం, భూమాఫియాతో పాటు ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకుతెరలేపింది. చంద్రబాబునాయుడి గారినాయకత్వంలో, నారాలోకేశ్ గారి క్రమశిక్షణలో తామంతా ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రజలను కబ్జాదారులనుంచి విముక్తుల్నిచేయడంకోసం పోరాడుతున్నాం. ఆక్రమంలోనే నేడు తమ నిజాయితీ నిరూపించుకోవడానికి డ్రగ్స్ పరీక్షలకు సిద్ధపడ్డాం. చంద్రబాబు నాయుడి గారి ఇంటిపైకి దాడికి వచ్చేంత దమ్ము, ధైర్యం వైపీపీప్రభుత్వా నికి ఉందా? అలాఅయితే సమయం చెప్పండి..ఎక్కడికి రావాలోచెప్పండి. తేల్చుకుందాము. చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రినిచేసేవరకు పోరాడతాం. ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఏ ఒక్కవైసీపీ నేతనువదిలేదని హెచ్చరిస్తున్నాం.
జయరామ్ (తెలంగాణ విభాగం తెలుగుయువత అధ్యక్షులు) :
ఉభయ తెలుగురాష్ట్రాలప్రజలు వాస్తవాలు గమనించాలి. రెండురాష్ట్రాల్లో నూ దారిమళ్లింపు రాజకీయాలే నడుస్తున్నాయి. ప్రధానసమస్యలు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏదోచిన్నసమస్యను తెరపైకితేవడం, దానిచుట్టూ రాజకీయం నడపడం అనేది రెండుప్రభుత్వాలకు అలవాటైంది. తెలంగాణ లో గ్యాంగ్ స్టర్ నయీమ్ ఉదంతం బయటకువచ్చినప్పుడు, అతనికి అన్నిరంగాల ప్రముఖులతో సంబంధాలున్నాయని తెలిసినప్పుడు, దాన్నుంచి ప్రజలను దారిమళ్లించడానికి డ్రగ్స్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వంతెరపైకి తెచ్చింది. కెల్విన్ అనే మత్తుపదార్థాలసరఫరా దారుని పట్టుకొని విచారిస్తే, అనేకమంది సినీప్రముఖులు బయటకువచ్చారు. సదరుకెల్విన్ 27మంది సినీప్రముఖులపేర్లను బయటపెట్టాడు.
వారంద రినీ విచారిస్తున్నట్టుగా తెలంగాణప్రభుత్వం 30రోజులపాటు ఒకపెద్ద సిని మా చూపించింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడంతో కేటీఆర్ ఉలిక్కిపడ్డారు. దాంతో ఆమెపేరు జాబితానుంచి తొలగిపోయింది. తెలంగాణప్రభుత్వం నియమించిన సిట్ ఏం విచారించింది? అసలు విచార ణ సజావుగానే సాగిందా..లేక తూతూమంత్రంగా సాగిందా? కీలక అధికారి అయిన అకుల్ సబర్వాల్ ను ఉన్నపళంగా ఎందుకు పౌరసరఫ రాల శాఖకు బదిలీచేశారు? గుజరాత్ లోని ముంద్రాపోర్టు అదానీది. అక్క డేంజరిగినా ఏమీ కాదు. ఎలాంటి విచారణా ఉండదని దేశమంతా అనుకుంటోంది.
ప్రధానిమోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్ లోని పోర్టులనుంచి అనేక రాష్ట్రాలకు మాదకద్రవ్యాలు సరఫరాఅవుతున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడంలేదు? పోర్టులపై నిఘాపెట్టాల్సిన విభాగం ఏమైంది? నేషనల్ మీడియా ఈ వ్యవహారాలపై ఎందుకు దృష్టిపెట్టడంలేదు? సుశాంత్ సింగ్ అనే సినీనటుడు చనిపోయినప్పుడు అతని ప్రియురాలిని విచారిస్తే 58గ్రాముల కొకైన్ వ్యవహారం బయటకువచ్చింది. దాన్నే నేషనల్ మీడియా భూతద్దంలోచూపింది. మరిఏపీకి రావాల్సిన రూ.72వే లకోట్ల విలువైన హెరాయిన్ సంగతేంటి? కోదాడలో 150కిలోల గంజాయి పట్టుబడింది. ఇంతజరుగుతుంటే ఉభయరాష్ట్రప్రభుత్వాలు ఏంచేస్తున్నాయి? ఆరేళ్లచిన్నారిఛైత్రను గంజాయికి అలవాటుపడిన ఒక దుర్మార్గుడు చంపేశాడు. రెండు రాష్ట్రప్రభుత్వాలు ప్రజలగురించిఆలోచించడమే లేదు.
ఏపీకి వస్తూ పట్టుబడిన రూ.72వేలకోట్లవిలువైన హెరాయిన్ వ్యయం మొత్తం రెండురాష్ట్రాల్లో అయ్యే ఎన్నికలవ్యయంతో సమానం. డ్రగ్స్ తయా రీనే హైదరాబాద్ లో జరుగుతోందని సిద్ధిఖీ అనేవ్యక్తి చెప్పాడు. ఇంత జరుగుతుంటే తెలంగాణ పోలీసులు, హోంమంత్రి ఏంచేస్తున్నారు? ఏపీలో నవరత్నాలు అన్నారు….తెలంగాణలో రైతుబంధు అన్నారు..చివరకు ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంటికొక మాదకద్రవ్యాల పౌడర్ ప్యాకెట్ ను సరఫరాచేస్తారా అని అడుగుతున్నా. చంద్రబాబునాయుడు తెలంగాణలో సైబర్ సిటీని, ఏపీలో స్మార్ట్ సిటీలనుతయారుచేస్తే, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు డ్రగ్స్ సిటీలుతయారుచేస్తున్నారు. వాట్సాప్ ద్వారా తెలంగాణలో గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం వీధికొక క్లబ్ ఏర్పాటుచేసింది. డ్రగ్స్ పరీక్షలకు టీడీపీ యువనేతలందరం సిద్ధపడ్డాం. ఈ డ్రగ్స్ వ్యవహారంపై అసలుదోషులు ఎవరో తేలాలని, అందుకోసం అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సిద్ధమవుతాం. ఉభయరాష్ట్రాల్లోని యువత మేల్కొని, చంద్ర బాబునాయుడుగారికి, తెలుగుదేశానికి పట్టంకడితేనే, తెలంగాణ, ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రాలు బాగుపడతాయి. పోసాని ఎవరు..అతనికి సిగ్గుందా? అతనె వరు మాట్లాడటానికి? పవన్ కల్యాణ్ డ్రగ్స్ వ్యవహారంపై ఒక్కమాట మాట్లాడితే బాగుండేది. మీడియాసంస్థలుకూడా ప్రభుత్వాలకు భయపడ కుండా వాస్తవాలు ప్రజలకు అందించాలని విజ్ఞప్తిచేస్తున్నాం.
ప్రణవ్ గోపాల్ (రాష్ట్ర టీ.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు) : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ గంజాయి, ఇతరమాదకద్రవ్యాలు విచ్చలవిడిగా లభిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లతోకలిసి, వైసీపీ తాలిబన్లుఏపీలో డ్రగ్స్ వ్యాపారానికి తెరలేపారు. జగన్మోహన్ రెడ్డిగానీ, ఆయన మంత్రులుగానీ హూ ఈజ్ డ్రగ్ డాన్ఇన్ ఏపీ అనేప్రశ్నకు సమాధానం చెప్పగలరా?
టీడీపీ పక్షాన పట్టాభిరామ్ తోపాటు పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శులైన మద్దిపాటి వెంకటరాజు, చింతకాయల విజయ్,టీడీపీఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్.ఎస్. రాజు, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, టీ.ఎన్.ఎస్.ఎఫ్ విభాగం అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, టీ.ఎన్.టీ.యూ.సీ అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామరాజు, తెలంగాణ తెలుగుయువత అధ్యక్షులు జైరామ్, ఏపీ టీడీపీరాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం, వాణిజ్యవిభాగం అధ్యక్షులు డూండీరాకేశ్, తెలుగుయువత నాయకులు బండారువంశీ తదితరులు డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమైనవారిలో ఉన్నారు.

LEAVE A RESPONSE