Home » ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ అధినేత

ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ అధినేత

ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కడప జిల్లా భాకరాపురంలో ఆయన ఓటు వేశారు. సీఎం జగన్‌తో పాటు భార్య వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 5 సంవత్సరాల పాలన చూశారని, తన ప్రభుత్వంలో లబ్ది పొందారని భావిస్తే మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసే పాలనకు ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా పలువురు కీలక రాజకీయ నేతలు ఉదయాన్నే ఓటు వేశారు.

Leave a Reply