Home » వైసీపీ నేతలే ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా కింగులు

వైసీపీ నేతలే ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా కింగులు

– ఖద్దరు చొక్కాలేసుకున్న వైసీపీ నేతలే ఎర్ర చందనం స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు.
– చంద్రబాబు ఎర్రచందనం అక్రమం రవాణాపై ఉక్కుపాదం మోపారు.
– జగన్ రెడ్డి సంక్షేమాన్ని గాలికొదిలి, సంక్షోభంలోకి నెట్టి దోచుకుంటున్నారు.
– 32 కేసులున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్లను కాక మరెవర్ని పోషిస్తారులే.
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీలోని సహజ సంపదను దోచేస్తా, దాచేస్తా, దోపిడీ దారులను రక్షిస్తా, పదవులిస్తా, పెద్ద మనుషులుగా నిలబెడతాన్న చందాగా వైసీపీ ప్రభుత్వం మారింది. ఈ మాటలను నేను ఊరకే చెప్పడం లేదు..సాక్ష్యాలతో చెప్తున్నాను. వైసీపీ నేతలు వేల ఎకరాలు కొల్లగొడుతున్నారు. లిక్కర్, శాండ్ మాఫియా నడుపుతున్నారు. ఇది రాష్ట్ర, జాతీయ పత్రికలు, మీడియాలో వస్తోంది. రెండేళ్ల నుండి మాఫియా ఎలా చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఇది కాక ఇప్పుడు ఎర్ర చందనం స్మగ్లింగ్ స్వయానా వైసీపీ నేతలే చేస్తూ బహిరంగంగా ఖద్దరు చొక్కాలు వేసుకుని మంత్రుల వెంట తిరగుతూ వైస్ ఛైర్మన్లు అవుతూ, ఉప సర్పంచులు అవుతూ, ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్లు అవుతూ, జెడ్పీటీసీలు చెలామని అవుతూ వేల కోట్లు ఎర్రచందనం దొంగలుగా మారిన వ్యక్తుల గురించి ఇప్పుడు నేను చెప్తా.
అన్నం తినే చోట బియ్యం తరలిస్తూ వాటి కింద అదే వాహనాల్లో ఎర్రచందనం తరిలిస్తూ పట్టుబడ్డారు. అతని అశోక్ రెడ్డి, అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుడిభుజం. చెవిరెడ్డిని ఇతను గెలుపించిన వ్యక్తి. ఉప సర్పంచిగా అతన్ని నిలబెట్టి చెవిరెడ్డి గెలిపించారు.. చెవిరెడ్డి పేరు బయటకు రాకుండా కడపజిల్లాలో ఎక్కడో ఒక మండలాని చెందిన వ్యక్తిగా కేసు నమోదు చేయించారు. అలా చేసినంతమాత్రాన వైసీపీ నేతలు కాకుండా అవుతారా.? చంద్రబాబు ఎర్రచందనం అక్రమంపై ఉక్కుపాదం మోపారు. రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ఛైర్మన్ గా ఐజీ స్థాయి అధికారిని నియమించి 2,150 మంది స్మగ్లర్లను అరెస్టు చేయించి స్మగ్లింగ్ ని అరికట్టి పూర్తిగా రూపుమాపారు.
కానీ ఈ రోజు ఏం జరుగుతోంది.? రెండేళ్లుగా కనీసం రెండు వందల మంది స్మగ్లర్లను కూడా పట్టుకోలేదు. టాస్క్ పోర్స్ ను నిర్వీర్యం చేశారు. దిశ చట్టం వుందో లేదో ఏం చెప్పాలో తెలియని స్థితిలో ప్రభుత్వానికి భయపడుతూ మ్యావ్..మ్యావ్ అనే డీఎస్సీ స్థాయి వ్యక్తులను తూతూమంత్రంగా పెట్టి..మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండిర, మాకు కూడా వాటా ఇవ్వండి ర అన్నట్లుగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారంటే ఏమనాలి.? నిఘా వ్యవస్థను గాలికొదిలారు. వైసీపీ దొంగలు అందరూ కలిసి చందనం దుంగలను దోచుకుని, ఆదాయ వనరుగా మార్చుకుని కోట్లు దండుకుంటున్నారు.
నాలుగు నెలల క్రితం కే.వీ.పల్లి మండలంలో గజ్జల శ్రీనివాస రెడ్డి అరెస్టు అయి, ఇప్పుడు బయటతిరుగుతున్నారు. ఇతను ఎర్రచందనం స్మగ్లర్. వేల కోట్లు సంపాదించిన వ్యక్తి. ఏకగ్రీవంగా తన భార్యను జెడ్సీటీసీ సభ్యురాలిగా నలిబెట్టారు. ఇతనికి ఈరోజుకీ శిక్ష పడలేదు. నిన్న వసంత అశోక్ కుమార్ రెడ్డి బియ్యం చాటున ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుబడ్డడ్డే పట్టుబడి కేసు రూపుమార్చే విధంగా అడ్రసులు మారుస్తున్నారు.
వైసీపీ నేతలంతా అంతర్రాష్ట్ర స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిలా తయారవుతున్నారు. గంగిరెడ్డి వైసీపీ వ్యక్తే అని గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒక మీడియా ఛానల్ ద్వారా చెప్పారు. ఆయన కడప,నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల వైసీపీ నేతల ఎన్నికల ఖర్చులకు డబ్బులిచ్చారని అందరికీ తెలుసు. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఉన్న వ్యక్తి ఇతను. 2015లో దుబాయ్, మారిషెస్, మొరాక్కో లో తిరిగి పట్టుకుని కడపలో జైల్లో పెడితే గతేడాది బయటకు వచ్చారు. అయినా పశ్చాత్తాపం లేదు.
తిరుపతిలో వైకుంఠపురంలో ఒక హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్తే అతనొక పెద్ద మనిషిలాగా వేసిన ప్లెక్సీలో జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి ఉన్నారు. ఇవన్నీ ఎవరైతే దొంగలు బయట తిరుగుతున్నారో ప్రభుత్వంతో సత్సంభాలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకన్నా వేరు రుజువులేదు. వేల కోట్లు ఎవరి సొమ్మని కొల్లగొడుతున్నారు.? బయటకు ఖద్దరు చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారు. ఈరకంగా ఎర్రచందనం అమ్ముకుని, దోచుకుని దోపిడీదారులను పెంచిపోషించడం దారుణమైన విషయం. ఇప్పటికైనా స్మగ్లింగ్ ను రూపుమాపేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందా లేదా చూడాలి. ఖచ్చితంగా కేంద్రం కలుగజేసుకుని ఎర్రచందనం దొంగలను పట్టుకుని బెయిల్ రద్దు చేసి జైలుకు పంపితేనే స్మగ్లింగ్ ఆగుతుంది.
నెల్లూరు ఆర్టీసీ రిజనల్ ఛైర్మన్ విజయానందరెడ్డి..సాక్షి ఛానల్ లో ఎంతో బాగా చెప్పారో అతను గురించి. ఇతను అరెస్టు అయితే చెవిరెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించారు. ఈ ఎర్రచందనం ఎక్కడికి పంపుతున్నారని అడిగితే చెన్నై పోర్టు ద్వారా తరలించారని చెప్పారని కూడా అందరికీ తెలుసు. సంక్షేమాన్ని గాలికొదిలి.. ఈ సంక్షేమ కార్యక్రమాలను సంక్షోభంలోకి నెట్టి ఈ రకంగా దోచుకుంటున్న వారిని కేంద్రం ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షించాలి. ఎర్రచందనం విషయంలో పోలీసులు, అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ ముగ్గురు ఎంత వరకు మీ ఉద్యోగాలకు న్యాయం చేయగలుగుతున్నారు.? మీరు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారా లేదా ప్రభుత్వానికి లోబడి చేస్తున్నారా ఆత్మవిమర్శ చేసుకోవాలని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నట్లుగా ఈ ప్రభుత్వం స్పందించాలి. స్పందించే వరకు ప్రజలు పోరాడాలి.
ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పదవి ఇచ్చినందుకు విజయానందరెడ్డి , జగన్ రెడ్డికి చెప్పాల్సింది సీఎం పాదాలకు ధన్యవాదాలు కాదు..అక్రమ రావాణా దుంగల్లో వాటా కూడా ఇస్తున్నట్లు కూడా చెప్పాలి. ఎందుకంటే ఛైర్మన్ పదవి ఇచ్చారు కదా. జైలుకెళ్లిన వాళ్లను, స్మగ్లర్లను ఈ ప్రభుత్వం పెంచి పోషిస్తుందన్న విషయం ప్రజలు గమనించాలి.. యదారాజా తథా ప్రజా అన్నట్లు వుంది. 32 కేసులున్న వ్యక్తి ఇలాంటి వాళ్లను కాక మరెవర్ని పోషిస్తారు.? ఇవన్నీ ప్రజలు గమనించాలి. జగత్ కిలాడీతో జగన్ భేటీ అని వచ్చింది. ఈ విజయానందరెడ్డి జగన్ ఇంటికి వెళ్లి రెండు ఏం మాట్లాడారో తెలియదు. దీని పర్యవసానాలు ఏరకంగా స్మగ్లర్లతో ఉన్నారో చూడాలి. 90 శాతం క్రిమినల్ కేసులున్న వాళ్లే వైసీపీలో కీలక పదవుల్లో ఉన్నారు. ఎలాంటి వాళ్లకు ఓట్లేశామో ప్రజలు ఆలోచించాలి. ఇది ఏడీఆర్ రిపోర్టు చూస్తే మనకు అర్థమవుతోంది పైగా క్రిమినల్ కేసులు ఉన్నవారు వైసీపీలో ఉన్నారు.

Leave a Reply