వైసీపీ నేతలు ఇక డైపర్లు కొనుక్కోవాల్సిందే – సోమిరెడ్డి

– చంద్రబాబు-పవన్ భేటీపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టిన టీడీపీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసిన విషయం అందరికీ తెలిసిందే.వీరిద్దరూ జీవో-1 వ్యతిరేకంగా పోరాటానికి కలిశారని తెలుస్తోంది. శ్రీకాకుళంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమానికి ఆంక్షలు విధించి ప్రజా గొంతుకను కట్టడి చేస్తున్నారని జనసేనాని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా అనే విషయం చెప్పలేదు.

మరోవైపు చంద్రబాబు, పవన్ భేటీపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వాటిని టీడీపి నేతలు తిప్పికొడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్కల్యాణ్ కలవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ భేటీపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా.. వైసీపీకి భయం పట్టుకుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక డైపర్లు కొనుక్కోవాల్సిందే – సోమిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ భేటీతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా డైపర్లు వాడాలని ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ గల్లంతే – చినరాజప్ప
చంద్రబాబును పవన్ కలిస్తే మీరెందుకు ఉలిక్కిపడుతున్నారని మంత్రులపై మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. ఇద్దరూ కలిస్తే ఓడిపోతామన్న భయంతోనే మంత్రులు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ విశాఖ పర్యటనలో ఇబ్బందులకు గురి చేసారన్న చినరాజప్ప.., ఆ రోజు చంద్రబాబు పవన్ను పలకరించాలని వెళ్లారని గుర్తుచేశారు. ఇప్పుడు కుప్పంలో ఆంక్షలు పెట్టి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంతో చంద్రబాబును పలకరించడానికి పవన్ వెళ్తే వైకాపా వారెందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం-జనసేన కలిస్తే వచ్చే ఎన్నికల్లో అడ్రస్ వుండదనే భయంతోనే నోటికొచ్చినట్టు మంత్రులు, వైకాపా నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply