ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారు

-ఉద్యోగులు పనిచేయనట్టు చిత్రీకరణ
-జీతాలు, పెన్షన్ ఇప్పటివరకు రాలేదు
-ఫిబ్రవరి 5న కర్నూలు లో అమరావతి ఐకాస రాష్ట్ర మూడవ మహాసభలు
-ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పని చేయనట్టు వైసీపీ ప్రభుత్వం చిత్రీకరిస్తోందని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు ఆరోపించారు. ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఐకాస రాష్ట్ర మూడవ మహాసభలు ఫిబ్రవరి 5న కర్నులులో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యిందని ఏపీజేఎసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూలులో అన్నారు. ఈ సభలకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని కర్నూలులో నిర్వహించారు.

ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ఉద్యోగులు పనిచేయనట్టు, పని చేయకపోతే ప్రభుత్వం కావాలని ఫేషియల్ తెచ్చినట్టు దానికి స్క్వార్డులు కూడా ఇస్తున్నట్లు ఒక చిత్రీకరణ చేస్తున్నారు. ఉద్యోగులని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఒక వైపు ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక,ఆర్థికేతర సమస్యలు కొల్లలుగా పెండింగ్ పడిపోతుంటే అవి ప్రశ్నిస్తారేమోనని ఇవన్ని చేస్తున్నారు. ప్రజల్లో మాపై తప్పుడు భావం కలికగేటట్టు చిత్రీకరిస్తున్నారని అనిపిస్తుంది. అని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

ఉద్యోగులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫిబ్రవరి నెలలో జరిగే రాష్ట్ర సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కరాలను ప్రభుత్వం వాయిదాలు వేస్తూ వస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు మొత్తం చెల్లిస్తామని స్వయానా ముఖ్యమంత్రి చెప్పినా.. ఇంతవరకు బకాయిలు చెల్లించలేదన్నారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలన్నారు.

ఓపీఎస్ను తప్ప ఎలాంటి పింఛన్ విధానాన్ని అంగీకరించమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పక్క రాష్ట్రంలో క్రమబద్ధీకరణ చేస్తుంటే.. మన రాష్ట్రంలో పట్టించుకోవడం లేదని బొప్పరాజు అన్నారు. జీతాలు, పెన్షన్ ఇప్పటివరకు రాలేదని.. గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగులకు ఒకటవ తేదీ జీతాలు పడడం లేదన్నారు.

Leave a Reply