Suryaa.co.in

Andhra Pradesh

మహిళా దినోత్సవం జరుపుకోవడానికి వైసీపీ నైతికంగా అనర్హులు

-ఆడబిడ్డలపై రోజుకో అఘాయిత్యం జరిగేలా రాష్ట్రాన్ని తయారు చేసినందుకు మహిళాదినోత్సవం చేస్తున్నాడా?
– మహిళల అక్రమరవాణాలో దేశంలోనే రాష్ట్రాన్ని రెండోస్థానంలో నిలిపినందుకు గర్వంతో మహిళాసాధికారత జపం చేస్తున్నాడా?
• ముఖ్యమంత్రికి నిజంగా ధైర్యముంటే, ఆయన మహిళాభిమానే అయితే పోలీస్ పహారా, పరదాలు లేకుండా అమరావతి మహిళల మధ్య నుంచి అసెంబ్లీకి వెళ్లాలి
• సొంత చెల్లెళ్లకి,తల్లికి న్యాయం చేసిన తర్వాత జగన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళల గురించి మాట్లాడితే బాగుంటుంది
• చంద్రబాబునాయుడి హాయాంలో డ్వాక్రామహిళలు బిల్ క్లింటన్ లాంటి గొప్పవారితో కలిసిపనిచేస్తే, జగన్మోహన్ రెడ్డి పుణ్యమాఅని పోలీస్ స్టేషన్లలో పడుకుంటున్నారు
• జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మహిళలను తన స్వార్థానికి వినియోగించుకోవడం తప్ప వారిని ఉద్ధరించడం తెలియదు
• అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బాబాయ్ కుమార్తెను ఢిల్లీ వీధులపాలు చేయడం.. సొంతచెల్లి, తల్లిని హైదరాబాద్ పాలు చేయడమే
– తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు వంగలపూడి అనిత

మహిళల అక్రమరవాణాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండోస్థా నంలోఉందని, అంతగొప్పప్రగతి ఈ రాష్ట్రం సాధించడానికి జగన్మో హన్ రెడ్డి పాలనేకారణమని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగు మహిళరాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవాచేశారు. సోమవారం ఆమె పలువురు టీడీపీమహిళానేతలతో కలిసి మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే …

మహిళలను, యువతులను అంగట్లో బొమ్మలుగా మార్చి, వారిని అక్రమంగా ఇతరదేశాలకుతరలిస్తుంటే దాన్ని కట్టడిచేసి, ఆడబిడ్డ లను కంటికిరెప్పలా కాపాడలేని ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొ ని మహిళాదినోత్సవాలు నిర్వహిస్తున్నాడని ప్రశ్నిస్తున్నాం. మహి ళలంటే గౌరవంలేని వ్యక్తి మహిళలకు శుభాకాంక్షలు చెప్పడం నిజంగా సిగ్గుచేటు. నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదికప్రకారం ఏపీలో మహిళల అక్రమరవాణా తారాస్థాయికి చేరిందనేది పచ్చివాస్తవం.

ఇంతగొప్పప్రగతి సాధించినందుకు గర్వపడుతూ, ముఖ్యమంత్రి, వైసీపీప్రభుత్వం మహిళాదినోత్సవం నిర్వహిస్తోందా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ మూడేళ్లలో ఆడబిడ్డలపై 1500 వరకు అత్యాచారఘటనలుజరిగాయి. అందుకని ఈ ముఖ్యమంత్రి సంబరాలు చేసుకుంటున్నాడా? జగన్ రెడ్డి పాలనలో సరాసరిన రోజుకి ఒకసంఘటన ఆడబిడ్డలపై జరిగిన అత్యాచారాలు, హత్య లు, వేధింపులకు సాక్ష్యంగా కనిపిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేరంచేసిన వారంతా దర్జాగా కాలర్ ఎగరేస్తూ, బయటతిరుగుతుంటే, తమబిడ్డలను, తమవాళ్లను కోల్పోయిన తల్లిదండ్రులు, వారిబంధువులు మాత్రం దుఖంతో విలపిస్తున్నారు. నెల్లూరులో నిన్ననే టీడీపీ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష నిర్వహించాము. ఆ సంఘటన జరిగి 24గంటలు గడవక ముందే కావలిలో మహిళలను దారుణంగా చంపేసి, దహనం చేసేశారు. స్వాతంత్ర్యదినోత్సవం నాడే బీటెక్ చదివిన ఆడబిడ్డను నడి రోడ్డుపై పొడిచిపొడిచి చంపారు.

విజయవాడలో తేజస్వినిని, విశాఖ పట్నంలో శ్రీలక్ష్మిని, పులివెందులలో నాగమ్మ అనే మహిళను, అనంతపురంలో స్నేహలతను, నరసరావుపేటలో అనూషను దారుణంగా దుండగులు హతమారిస్తే, ఆయాఘటనల్లో మృతు రాళ్ల కుటుంబాలకు ఈముఖ్యమంత్రి ఏంన్యాయంచేశాడు. ఆయా ఘటనల్లో దారుణాలకు తెగబడిన దుర్మార్గుల్లో ఏ ఒక్కరిని అయినా ఈ ముఖ్యమంత్రి, ఈప్రభుత్వం శిక్షించిందా? మహిళల్ని హతమార్చిన ఘటనల్లో దోషులకు శిక్షలు వేశాకే ముఖ్యమంత్రి మహిళాదినోత్సవ శుభాకాంక్షలుచెప్పాలి. ఆపనిచేయలేనప్పుడు ఆయనకు మహిళలగురించి మాట్లాడే అర్హతకూడా లేదు.

ఎక్కడో పక్కరాష్ట్రంలో ఏదోజరిగితే ఇక్కడ దిశాచట్టం పేరుతో హడావుడి చేసిన ముఖ్యమంత్రి, 21రోజుల్లో శిక్షలుపడేలాచేస్తామని ప్రగల్భా లు పలికిన జగన్మోహన్ రెడ్డి, ఆచట్టం కింద ఒక్కకేసులో అయినా ఏమహిళకైనా న్యాయంచేశాడా? దిశాపోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేశా మని గొప్పలుచెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, వైసీపీమహిళా నేతలు ఆయాస్టేషన్లలో ఎందరుమహిళలకు న్యాయంజరిగిందో చెప్పగలరా? దిశా పోలీస్ స్టేషన్లు సివిల్ వివాదాల సెటిల్మెంట్లకు నిలయాలుగా మారాయి. ఆయాస్టేషన్లలోని సిబ్బంది భార్యాభర్తల వివాదాలు పరిష్కరిస్తూ బఠానీలుతింటూ కాలక్షేపంచేస్తున్నారు.

దిశాచట్టంచేసి ఆ బిల్లుని కేంద్రానికి పంపామని చెప్పుకుంటుంటే, హోంమంత్రి గారేమో దిశాచట్టం కింద ముగ్గురుకి ఉరిశిక్షలు, 20 మందికి యావజ్జీవ శిక్షలు వేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. చట్టమే లేనిరాష్ట్రంలో ఆచట్టం కింద హోంమంత్రి శిక్షలు ఎలావేసిం దో ఆమెకే తెలియాలి. ఆడవాళ్లమై పుట్టినందుకు సాటి ఆడబిడ్డలకు, చిన్నారులకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించకపోతే ఎలాగనిప్రశ్నిస్తున్నాం.

ఏపీ ప్రభుత్వం పంపించిన దిశాచట్టానికి కేంద్రిం 4సార్లు సవరణలుచేసింది. ఆ సవరణలేంటో కనీసం ముఖ్యమంత్రి, హోంమంత్రి ప్రజలకు చెప్పగలరా? అవేంటో చెప్పాకనే వారు మహిళాదినోత్సవం నిర్వహించాలి.

రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణకల్పించలేని ప్రభుత్వం ఒకపక్కన ఉంటే, కాపాడాల్సిన పోలీసులే వారిని భక్షించేలా తయారైతే ఇక మహిళలు ఎలా సంతోషంగాఉంటారు?భూశంకర్ నాయుడు అనే వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేసి, వ్యభిచారగృహాలవారికి అమ్మేస్తే, ఆ పాప అక్కడినుంచి తప్పించుకొని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై ఈప్రభుత్వం ఏంచర్యలు తీసుకుంది? ఈ ముఖ్య మంత్రి అతనికి ఏం శిక్షవేశాడు? అలాంటి అనేకఘటనలు నిత్యం రాష్ట్రంలో జరుగుతూనేఉన్నాయి. సాధారణవ్యక్తులు, చోటామోటా నాయకులేకాదు, ఏకంగా వైసీపీఎంపీలు, మంత్రులే మహిళలను కించపరుస్తూ, వారి పశుస్వభావాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఒకరేమో గంటా..అరగంట అంటారు.. ఎంపీల్లోనేమో ఒకరిపై అత్యాచారం కేసుంటే, మరొకరిపై గృహహింసకేసు ఉంది. అలాంటి వాళ్లు ప్రజా ప్రతినిధులా? వారే అలాఉంటే కిందిస్థాయిలోఉండే వైసీపీనేతలు, వాలంటీర్లు ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తారో చెప్పాలా?

ముఖ్యమంత్రి ఇంటిపక్కనే కాబోయే భర్తతో కలిసి బయటకువచ్చిన యువతిని దారుణంగాచెరిచి చంపేస్తే ఏంచర్యలు తీసుకున్నారు? ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే వాటికి సమాధానంచెప్పలేని ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు వైసీపీపేటీఎం కుక్కలను తమపైకి ఉసిగొల్పుతారు. వారితో నానాఛండాలంగా తమను అన రాని మాటలు అనిపిస్తారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళాసాధికారత అంటే మహిళా మంత్రులు, మహిళాప్రజాప్రతినిధులకే వర్తిస్తోంది. సాధికారత అంటే మహిళలను ఆటబొమ్మలుగా మార్చి అమ్మేయడం కాదు. అసలైన మహిళాసాధికారతఎలాఉంటుందో చంద్రబాబుగారిని అడగండి చెబుతారు. ఆయనహాయాంలో డ్వాక్రామహిళలను ఆర్థికంగా బలోపేతంచేసి, వారిని బిల్ క్లింటన్ లాంటి వ్యక్తులతో మాట్లాడించారు. అదీ మహిళాసాధికారత అంటే.

కానీ జగన్మోహన్ రెడ్డేమో అదే డ్వాక్రామహిళలు వడ్డీలుకట్టలేదని, పొదుపుసొమ్ము సక్రమంగా చెల్లించలేదని వారిని పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టాడు. చంద్రబాబుగారి మహిళాసాధికారతకు, జగన్ రెడ్డి మహిళాసాధికా రతకుఉన్న వ్యత్యాసం అది. డ్వాక్రామహిళలకు ఆర్థిక స్వావలంబ న అందించడం అంటే వారి పొదుపుసంఘాల్లో దాచుకున్న సొమ్ము రూ.218కోట్లుకొట్టేయడమా? అదేగా ఈ ముఖ్యమంత్రి చేసింది. మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా కుంగ దీసిన ముఖ్యమంత్రి, మహిళాదినోత్సవం పేరెత్తుతున్నాడంటే నిజంగా యావత్ మహిళాప్రపంచమే సిగ్గుపడాలి.

ముఖ్యమంత్రి కావడంకోసం సొంతబాబాయ్ నిచంపి, ఆయన కుమార్తెనుఢిల్లీ వీధుల్లో పిచ్చిపట్టినదానిలా చేశాడు… జగన్ రెడ్డి. అదేనా ఆయన చెప్పే మహిళాసాధికారత. తనతోడబుట్టిన చెల్లిని, తల్లినేమో ఎన్నికలప్రచారానికి వాడుకొని నేడు వీధుల పాలుచేశాడు. అదేనా జగన్ రెడ్డి అమలుచేస్తున్న మహిళా సాధికారత. తాను అధికారంలోకి రావడానికి తల్లిని, చెల్లిని వాడుకొని వదిలేసినవాడు… తన ముఖం ప్రజలకు చూపించడాని కి భయపడి, వెంటభార్యను వేసుకొని తిరుగుతున్నాడు.

రాష్ట్రంలోని ఆడబిడ్డలకు, చిన్నారులకు న్యాయంచేయలేని ముఖ్య మంత్రి, కనీసం తండ్రిని పోగొట్టుకొన్న సొంతచెల్లికైనా న్యాయం చే యాలని డిమాండ్ చేస్తున్నాం. ఆమెకు న్యాయంచేశాకే జగన్ రెడ్డి మహిళాసాధికారత, మహిళాదినోత్సవం అని మాట్లాడాలి.

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకకూడా సొంతచెల్లికి ఎందుకు న్యాయంచేయలేకపోయాడు? ఆమెఢిల్లీ వీధుల్లో కాలికిబలపం కట్టుకొని తిరిగినా ఈ ముఖ్యమంత్రి మనసుఎందుకు కరగలేదు?
మహిళా ఉద్యోగుల పీఆర్సీ, ఫిట్ మెంట్లు అడిగితే వాళ్లని పోలీసు లతో కొట్టించడం, జీతాలుపెంచండి..ఉద్యోగభద్రత కల్పించండి అంటూ ఆశా, అంగన్ వాడీ సిబ్బంది రోడ్లెక్కితే వారిని లాఠీలతో కొట్టించడం, అమరావతికిభూములిచ్చి సర్వంకోల్పోయినవారు 810రోజులకుగా ధర్నాలుచేస్తుంటే, దీక్షలు చేస్తుంటే వారిని కాళ్లతో తన్నడం, కడుపులమీదతన్నడం…ఇవేగా ముఖ్యమంత్రి సాధించిన మహిళాసాధికారత అంశాలు.

జగన్మోహన్ రెడ్డి గర్వంగా తాను ముఖ్యమంత్రిని అనిచెప్పుకుంటాడుకదా… పోలీసుల సాయం లేకుండా అమరావతి మహిళలమధ్యనుంచి అసెంబ్లీకి వెళ్లగలడా.. అలావెళితే ఆయనకు మేమే సెల్యూట్ చేస్తాం. ముఖ్య మంత్రి కదా.. ధైర్యం చేయమనండి చూద్దాం. వేలమంది పోలీసుల ను అడ్డుపెట్టుకొని, పహారాలు, పరదాలమథ్యన అసెంబ్లీకి వెళ్లే ముఖ్యమంత్రి కూడా ఒక ముఖ్యమంత్రేనా?

హోంమంత్రి సుచరిత, మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఇతరమంత్రులు, రోజా పండగచేసుకోవాలంటున్నారు. అవును పండగచేసుకోవాల్సిందే..వారు తమతో వస్తే తాముకూడా పండగలో పాల్గొంటాము. కాకపోతే తేజస్విని, స్నేహలత, అనూష, శ్రీలక్ష్మి, నాగమ్మల కుటుంబసభ్యులతో కలిసి వారిఇళ్లల్లో పండగలుచేసుకుందాం రమ్మంటున్నాం. తమతోకలిసి మహిళా మంత్రులు, ప్రజాప్రతినిధులు వస్తారా? తమబిడ్డలను కోల్పోయి పుట్టెడుదుఖంతోఉన్నవారంతా పండగలు చేసుకోవడానికి సిద్ధం గాఉంటే వారితోకలిసి మీరు, మేము పండగ చేసుకుందాము.

మహిళాసాధికారత అనే మాటకు అసలైన నిర్వచనంచెప్పింది… దాన్ని ఆచరణలో అమలుచేసింది చంద్రబాబు. ఆయన అధి కారంలోకి వస్తేనే రాష్ట్రంలోని మహిళలంతా సుఖసంతోషాలతో ఉంటారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ లో నిజమైన మహిళాసాధికారత అమలవుతుంది అని బల్లగుద్ది చెబుతున్నాం.
పోలీసుల్నే దారుణాతిదారుణంగా అధికారపార్టీనేతలు దూషిస్తే, రక్షకభటసంఘాలమని చెప్పుకుంటున్న సంఘాలు ఏం చేస్తున్నా యి? నాపైనే మాపార్టీ మహిళానేతలపైనా పోలీసులను ఏదో అన్నామని ఎగిరెగిరి పడేవారంతాగతంలో వైసీపీనేతలు, మహిళానేతలు పోలీసులను ఎంతదారుణంగా దూషించారో గ్రహించాలి. (పోలీసులను ఉద్దేశించి శ్రీమతిరోజా సహా పలువు రు అధికారపార్టీ నేతలు, ఆపార్టీఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన పరుషవ్యాఖ్యల తాలూకా వీడియోలను ఈ సందర్భంగా అనితగా రు విలేకరులకు ప్రదర్శించారు)

మొన్నటికి మొన్న మంత్రి సీది రి అప్పలరాజు పోలీసులను అనరాని మాటలంటే, ముఖ్యమంత్రి సంతోషపడిపోయి, చనిపోయిన గౌతమ్ రెడ్డి గారిశాఖలనుకూడా అప్పలరాజుకి అప్పగించేశారు. అదీ ఈముఖ్యమంత్రి చేసే గొప్ప పని. మహిళాపోలీసులకు మగవారితోకొలతలుతీయిస్తే దానిపై తాముప్రశ్నించకూడదా.. అలాంటి ఘటనలే మీ ఇళ్లల్లో ఉండే ఆడ బిడ్డలకు జరిగితే మీరుచూస్తూ ఊరకుంటారా అని పోలీసులను ప్రశ్నిస్తే వారికెందుకు అంతకోపం?పోలీసులు రాజ్యాంగబద్ధంగా విధినిర్వహణ చేస్తే వారినినెత్తిన పెట్టుకుంటాము. మేమేకాదు వారు అలాపనిచేస్తే ప్రజలుకూడా హర్షిస్తారు.

నెల్లూరుజిల్లాలోని సర్వేపల్లిలో గ్రావెల్ దందా జరుగుతోందని తెలి సి, టీడీపీనేతలు, కార్యకర్తలు అక్కడ జరుగుతున్న తంతుని చూడటానికి వెళితే, మండుటెండలో మిట్టమధ్యాహ్నం వైసీపీనేత లు టీడీపీవారిపై గిరిజనమహిళతో అత్యాచారయత్నం కేసు పెట్టిం చారు. పోలీసులే ఆ పనిచేసేలా సదరుగిరిజన మహిళను ప్రలోభ పెట్టారని తెలిసింది. ఖాకీలు అలాచేయడం సబబేనా?వారి డ్యూటీ వారు చేయకుండా అయినదానికి, కానిదానికీ అధికారపార్టీకి ఊడి గం చేయడమేంటి?విలేకరుల సమావేశంలో టీడీపీ అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE