జగన్మోహన్ రెడ్డి అప్పుల దాహానికి ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరుడే బలి

– గవర్నర్ పేరుని వాడుకున్న ఈ ప్రభుత్వం, ఏకంగా రూ.25వేలకోట్ల అప్పుతెచ్చింది
– గవర్నర్ పేరువాడకంపై ఎస్.ఎస్.రావత్ పొరపాటైందని చెప్పడం విడ్డూరం
– బ్యాంకులతో ఒప్పందంచేసుకొని, ప్రభుత్వం అప్పులు తీసుకున్నాక, ఒప్పందపత్రాల్లోంచి, గవర్నర్ పేరుని అధికారులు ఎలా తొలగిస్తారు?
– గవర్నర్ నే వాడుకున్న ఈ ప్రభుత్వం, తన స్వార్థానికి ప్రజలఆస్తులు తాకట్టుపెట్టినా ఆశ్చర్యంలేదు.
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ
భారతదేశ చరిత్రలో ఏరాష్ట్రప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రైనా గవర్నర్ ని తమస్వార్థానికి వాడుకోవడం జరగలేదని, తనస్వార్థం కోసం జగన్మో హన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంపై రూ.3లక్షలకోట్ల వరకు అప్పులభారం వేశా డని, అంతటితోఆగకుండా చివరకు గవర్నర్ కే తెలియకుండా, ఆయన్నే తాకట్టు పెట్టే పరిస్థితికి ముఖ్యమంత్రివచ్చారని టీడీపీ రాష్ట్రఅధికా రప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. మంగళవారం ఆయన మంగళ గిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ఆస్తులు తాకట్టుపెట్టేసి, బ్యాంకులురుణాలు విడుదలచేశాక, సదరు వ్యవహారానికి సంబంధించిన పత్రాల్లోని గవర్నర్ పేరుని, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్ ఎలామారుస్తారో సమాధానంచెప్పాలి. తనపేరుని రుణాలకోసం ప్రభుత్వం వాడుకోవడంపై గవర్నరే నేరుగా, ప్రభుత్వాధికా రులను నిలదీయడం జరిగింది. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. అరడజను మంది ఐఏఎస్ అధికారులు, ఆర్థికశాఖ మంత్రి, గవర్నర్ పేరు వినియోగించిన విషయం ముఖ్యమంత్రికి తెలియకుండానే జరిగిం దా అన్నది తమసందేహం.
ఏంచేసైనా సరే, ముందు అప్పులు తీసుకు రండి అన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో, రాష్ట్రమంత్రులు, అధికారులు మరీ ఇంతగుడ్డిగా వ్యవహరిస్తారా? రాష్ట్రప్రభుత్వంఇంతచేస్తుంటే, గవ ర్నర్ గారికి తెలియదా? తెలిసీకూడా తనకు తెలియదన్నట్లుగా ఆయన వ్యవహరించారా? రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించినా, పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నా, స్వయంగా ప్రధానప్రతిపక్షం కార్యాలయంపై దాడిజరిగినా, మాజీముఖ్యమంత్రి ఇంటిగేట్లకు పోలీసులే స్వయంగా తాళ్లుకట్టినా, ఏనాడూ గవర్నర్ గారు స్పందించిందిలేదు. రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా ఏనాడూ నోరువిప్పని గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ గారికి, చివరకు తనదాకా వస్తేగానీ, ప్రభుత్వ తత్వమేమిటో, ముఖ్యమంత్రి అసలుఉద్దేశమేంటో రాష్ట్రప్రథమ పౌరులకు బోధపడిందా?
ప్రభుత్వ నిర్వాకాలపై హైకోర్టులు జోక్యంచేసుకుంటున్నా, రాజ్యాంగానికి లోబడిపనిచేయడం లేదని మొత్తుకుంటున్నాకూడా ఏనాడూ గవర్నర్ గారు స్పందించలేదు. అన్నివిషయాలను గవర్నర్ చూసీ చూడనట్లు వ్యవహరించబట్టే, ఈ ప్రభుత్వం చివరకు గవర్నర్ పేరుని కూడాఅప్పుల కోసం వాడుకుంది. ఈ ప్రభుత్వం చేసినఅప్పులు, ఈ ముఖ్యమంత్రి తీర్చకపోతే, రేపు ఒడిశా నుంచి వచ్చి హరిచందన్ గారు కడతారా? గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో, ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొ ని జగన్మోహన్ రెడ్డి ఎందరో ఐఏఎస్ అధికారులను బలిచేశారు.
శ్రీలక్ష్మి, ఈ.డీ.రాజగోపాల్, బీపీ.ఆచార్య, బ్రహ్మనందరెడ్డి, ఎల్వీ.సుబ్రహ్మణ్యం, ఆదిత్యానాథ్ దాస్ వంటివారు, జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి బలై, ఇప్పటికీ కేసుల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారనే విషయం గవర్నర్ గారు మర్చిపోతేఎలా? గవర్నర్ పేరు వాడకంపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ పొరపాటైందని చెప్పడం విడ్డూరంగా ఉంది. గవర్నర్ కే తెలియకుండా, ఆయనపేరు వాడుకొని ప్రభుత్వం అప్పులు తేవడంపై బిశ్వభూషణ హరిచందన్ తక్షణమే స్పందించాలని కోరుతున్నాం. చేయాల్సింది చేసేసి, అధికారులు పొరపాటు అయిం దంటే, గవర్నర్ స్థానంలోఉన్న వారే ఉపేక్షిస్తే ఎలా? వారం, పది రోజుల్లో రిటైరయ్యే సీ.హెచ్.వీ.ఎల్.మల్లేశ్వరరావు అనే అధికారినికూడా ఈ వ్యవహారంలో బలిచేశారు.
ఈ ప్రభుత్వ అప్పులదాహానికి మల్లేశ్వరరావు లాంటిచిరుద్యోగి మొదలు గవర్నర్ వరకు ఇంకెందరు బలికావాలని తాము ప్రశ్నిస్తున్నాం. ఎవరుచెబితే అధికారులు ఇలా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనే దానిపై గవర్నర్ గారుఆలోచన చేయకపోతే ఎలా? ఈ విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ముఖ్యమంత్రి మొదలు అధికారులువరకు అందరూ తమకుతోచినట్లు వ్యవహరిస్తుంటే, ప్రభుత్వాధినేతగా ఉన్న గవర్నర్ గారు స్పందించకపోతేఎలా? కనీసం ప్రభుత్వవైఖరిపై, ముఖ్యమంత్రి తీరుపై కేంద్రానికి అయినా ఫిర్యాదు చేయాలికదా?
గవర్నర్ అనేది చాలా ఉన్నతమైన పదవి, అలాంటి పదవికి జరిగిన అన్యాయానికి నేడు తాముబాసటగా నిలిచి మాట్లాడాల్సి వచ్చినందుకు నిజంగా బాధపడుతున్నాం. గవర్నర్ గారి పేరుని తాకట్టుపెట్టి, రూ.25వేలకోట్ల రుణం తేవడంఅంటే సామాన్యమైన విషయం కాదు. ఇంత అడ్డగోలు వ్యవహా రంపై జనమంతా ఇప్పటికే పలురకాలుగా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ఆదాయమెంత.. చేస్తున్న అప్పులెన్ని…. తెచ్చినఅప్పులను ఏంచేస్తున్నారనే దానిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టకపోతే ఎలా? ఈ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమకార్యక్రమాలు కూడా అరకొరగానే ఉన్నాయి. టీడీపీప్రభుత్వంలో అన్నివర్గాలప్రజలకు ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ కార్యక్రమాలు అమల య్యాయి.
ఆఖరికి ఈ ముఖ్యమంత్రి మందుబాబులను తాకట్టుపెట్టికూడా రూ.25వేలకోట్ల వరకురుణం తెచ్చాడు. పిచ్చిపిచ్చి మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్న ప్రభుత్వం, మందుబాబులకు షాక్ కొట్టాలనే తాముమద్యం ధరలు పెంచామని చెబుతోంది. మరి అలాగైతే, విద్యుత్ ఛార్జీలుకూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు దారుణంగా పెంచింది. అంటే దానర్థం రాష్ట్రంలో విద్యుత్ ను ఎవరూవాడకూడదనా? విద్యుత్ వినియో గదారులు కరెంట్ ను ముట్టుకోకూడదనా? రాష్ట్రమంతా కటికచీకట్లలో మగ్గిపోవాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారా?
ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థను అసలు నమ్మవద్దని, వారిని కనీసం మీగడపల్లోకి కూడా రానివ్వవద్దని సవినయంగా ప్రజల్ని కోరుతున్నాను. ప్రభుత్వ పథకాలపేరుతో ఆ కార్డులుఇవ్వండి.. ఈ పత్రాలివ్వండి అనే వాలంటీర్లమాటలను ప్రజలునమ్మకుండా ఉంటేనే మంచిది. వాలంటీర్లు చెప్పారని అడిగినచోట సంతకాలు పెట్టారంటే, మీకే తెలియకుండా మీ పొలాలు, ఇళ్లనుకూడా ప్రభుత్వం తాకట్టుపెట్టేసి అప్పులుతెచ్చినా ఆశ్చర్యంలేదు. వాలంటీర్లు బెదిరించినా సరే బెదరవద్దని ప్రజలను కోరుతున్నా. ఎందుకంటే గవర్నర్ స్థాయిలోఉన్న వ్యక్తికే తెలియకుండా వైసీపీప్రభుత్వం అప్పులు తెచ్చిందంటే, సామాన్య ప్రజలను మోసగించి, వారినితమస్వార్థానికి వాడుకోవడం ఈప్రభుత్వా నికి ఒకలెక్కా?