వికలాంగుడిపై వైసీపీ సర్పంచ్ భర్త దాడి

– సచివాలయ సిబ్బంది పై సర్పంచ్ ప్రతినిధి మద్యం మత్తులో విచక్షణా రహితంగా దాడి
– మితిమీరిపోతున్న షాడో సర్పంచులు

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కవిటి అగ్రహారం సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ సిబ్బంది పై వైసీపీ సర్పంచ్ భర్త బొమ్మాలి గున్నయ్య వికలాంగుడు అని కూడా చూడకుండా దాడి పాల్పడ్డాడు..మద్యం మత్తులో సచివాలయం పరిధిలోకి వచ్చి వికలాంగుడైన డిజిటల్ అసిస్టెంట్ పై దాడి చేశాడు.అర్హులైన పెన్షనర్ల కు పెన్షన్ మంజూరు చేయడంతో డిజిటల్ అసిస్టెంట్ కు సర్పంచ్ కు మధ్య వాగ్వాదం నెలకొంది.

తన అంగీకారం లేకుండా మంజూరు ఎందుకు చేసావంటూ డిజిటల్ అసిస్టెంట్ పై సర్పంచ్ ప్రతినిధి బొమ్మాలి గున్నయ్య దాడి చేశాడు. అడ్డుకున్న సిబ్బంది పై కూడా విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.

 

Leave a Reply