Suryaa.co.in

Political News

అవును.. మోదీ ఈ దేశానికి చేసిందేంటి?

యస్. ఇన్నేళ్లలో ఈ దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోదీ చేసిందేమిటి? ఆయన వల్ల ఈ దేశానికి జరిగిందేమిటి? ఒరిగిందేమిటి? పక్క దేశాలతో పోటీ పడేలా దేశాన్ని తీర్చిదిద్దారా? పోనీ ఆహార, రక్షణ, ఉత్తత్పి రంగాల్లో పరాయి దేశాల సరసన నిలిచేలా చేశారా? ఇంకా ఇవేనా? దేశ ప్రజల ముందు అనేక ప్రశ్నలు. ఇంకా చదవండి.
బ్రిటన్ జనాభా సుమారు 7 కోట్లు..
ఆయిల్ లేకా..పాలు లేక కనీసం మంచినీరుకు కూడా కటకట లాడుతున్నారు..
శ్రీలంక జనాభా సుమారు 2.30 కోట్లు..
ఆహార సంక్షోభం..ముందుగా ముసలోళ్ళకి రోగులకు పిల్లలకు పెట్టి మిగిలితే మిగతావారికి..
అమెరికా జనాభా సుమారు 33.5 కోట్లు..
ఆర్ధికంగా ఇబ్బందులు మొదలయ్యాయి..వేల సంఖ్యలో పిట్టలు రాలినట్టు రాలిపోయారు..మొన్ననే చూశాం..మైదానాల్లో తెల్ల జెండాల మీద మరణించినవారి పేర్లతో సహా..వాక్సిన్ కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు..
చైనా జనాభా సుమారు 145 కోట్లు..
వాక్సిన్ సంగతి దేవుడెరుగు కనీసం కరెంట్ లేదు..ఫ్యాక్టరీలు ఎప్పుడు నడుస్తాయో తెలీదు..ఇంట్లోకి కిరసనాయిల్ దీపాలే గతి..మరో నాలుగైదు నెలల్లో ఒక్కపూట భోజనానికే వాళ్ళు లాటరీ కొట్టాలి..
ఇక భారత్..135 కోట్ల జనాభా..
కోట్లాదిమందికి ఉచిత రేషన్..( రేషన్ తీసుకున్నవారిలో ఎక్కువశాతం మంది ఆ రేషన్ ను అట్లు / ఇడ్లీ బండి వాళ్ళకి అమ్ముతున్నారు..)
ఉచిత వాక్సిన్..
సంక్షోభంలో కూడా ఎవరికీ జీతాలు ఆపలేదు పైగా రైల్వేస్ లాంటివి ఈ సంక్షోభ సమయంలో అద్భుతంగా పనిచేయడమే కాకుండా తమను తాము ఆధునీకరించుకున్నాయి..
బాంక్స్ యదావిధిగా పనిచేశాయి..
స్టాక్ మార్కెట్ లైఫ్ టైమ్ హై లో ఉన్నది..
కరెంట్ సంక్షోభం లేదు..
కేంద్ర హై వే ఆదారిటీ ఈ పాండమిక్ సమయంలో వందలాది కిలోమీటర్ల రోడ్లను నిర్మించింది.. ( రాష్ట్రాలు ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ )
ఆహార సంక్షోభం లేదు..
పని కావలసినంత ఉంది..పనిచేసేవాడు లేడు..
దేశంలో పూర్తి స్థాయి రక్షణ..2014 తర్వాత ఎక్కడా సివిలియన్స్ మీద జీహాదీల టెర్రరిస్ట్ దాడులు లేవు..
చైనా వైరస్ భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని..ఆర్ధికమూలాలను కదిలించలేకపోయింది..
సమర్ధ నాయకత్వం భారత్ ను ఈ సంక్షోభ సమయంలో కాపాడింది..
అయినా సరే..కడుపునిండిన మహారాజుల ప్రశ్న..
‘ మోడీ ఏం చేశాడు ‘..
కళ్ళు ఉండీ కనబడకపోతే అది మోదీజీ తప్పు కాదు..
స్వస్తి.

– మోహన్‌కిషోర్ నిమ్మ

LEAVE A RESPONSE