ఏనాటికైనా యోగి ప్రధాని అవుతాడు

– వైరల్ అవుతున్న ఓ సోదరి పోస్ట్

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం నడుస్తున్న వేళ… తన స్వానుభవంగా చెప్పుకుంటూ డిల్లీలో చిన్న ఫర్నిచర్ యూనిట్ నడిపే ఒక సోదరి వ్రాసిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీలో ముస్లిం ఆధిక్యత ఉన్న ప్రాంతాలలో ఒకప్పుడు హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేది, యోగి ప్రజా జీవితంలోకి వచ్చాకా, ముఖ్యమంత్రి అయ్యాకా అక్కడ ఎలాంటి పరిణామాలు సంభవించినదీ ఆమె తన పోస్టులో వెల్లడించారు. ఆమె పోస్టులోని అంశాలను నేరుగా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం…..

2001 లేదా 2002 ప్రాంతంలో అనుకుంటా మొదటిసారి యోగి పేరు వినడం నేను. మా దగ్గర ఫర్నిచర్ తయారీకి కొందరు కార్మికులు పనిచేసేవారు. అప్పట్లో అందరికీ మొబైల్స్ ఉండేవి కావు. మా ఆఫీస్ నుంచి ఫోన్ చేసుకోడానికి ఆ కార్మికులు కొద్దిగా ముందుగా వచ్చేవారు.

ఒకరోజు మధ్యాహ్నం…. మా వర్క్ షాప్ లో పనిచేసే ఒక వడ్రంగి తన తల్లిదండ్రులు వాళ్ళ ఊర్లోని ఎస్టీడీ బూత్ దగ్గర తన కాల్ కోసం ఎదురుచూస్తుంటారని…. ఒక్క కాల్ చేయమని ఆఫీస్ స్టాఫ్ ను బతిమిలాడుకుంటున్నాడు. మొత్తానికి అతని కాల్ కలిసింది. వాళ్ళ నాన్న చెప్పిన వార్త విని ఆ వడ్రంగి అక్కడే కుప్పకూలిపోయాడు.

సమాచారం ఏమిటంటే… వాళ్ళ చెల్లెలు క్రితం రోజు ఉదయం నుంచీ కనబడ్డం లేదు. అలాగే వాళ్ళ ఆవులని కూడా స్థానిక ముస్లిములు దొంగిలించారని వాళ్ళ తండ్రి వణుకుతూ చెప్పారు.
వెంటనే ఆ కుర్రాడు వర్క్ షాపు నుంచి తనకు రావాల్సింది తీసుకొని దొరికిన ట్రైన్ పట్టుకొని యూ‌పి వెళ్లిపోయాడు.
అతను వెళ్ళిన తర్వాత అతనితో పాటు పనిచేయడానికి వచ్చిన అతని సహాయకుడిని “ఏమిటీ అరాచకం?” అసలు యూపీలో ఏం జరుగుతోంది? అని అడిగాము.

“హిందువులను భయపెట్టడానికి అక్కడి ముస్లిం గాంగులు ఇలా చేస్తారు. ముందుగా నెలకింత అని డబ్బులు కట్టాలి. తర్వాత బ్రతుకు తెరువు కోసం ఇలా వచ్చినందుకు హఫ్తా కట్టాలి. వారికి నచ్చితే ఇంట్లో మహిళలను కూడా ఎత్తుకెళ్తారు. గోవులను తోలుకు వెళ్తారు. ఏం ఎదురు చెప్పలేం. ఎదురు తిరిగితే దొంగతనం అంటగట్టి చెట్టుకు కట్టేసి కొట్టికొట్టి చంపుతారు. మాకు సోదరి కుటుంబ గౌరవం అయితే గోవు మా కులదైవం. ఆ రెంటినీ వాళ్ళు దొంగిలించి మామీద కక్ష తీర్చుకుంటారు. పోలీసులు కూడా వాళ్ళ మాటలే వింటారు.” అన్నాడు.

“ఇంత దారుణమా?” అనుకున్నాం అప్పట్లో……
తర్వాత రెండు మూడేళ్ళకి అనుకుంటా మళ్ళీ అదే టీం మా వర్క్ షాప్ లో పనిచేయడానికి వచ్చింది….
అప్పటి సంగతులన్నీ గుర్తుకు వచ్చి ఆ కుర్రాడిని అడిగాను…. “ఇప్పుడు ఎలా ఉంది మీ యూ‌పి ? ఇంకా అరాచకమే నడుస్తోందా?” అని..

ఆ కుర్రాడు నవ్వి చెప్పాడు “మేం సాబ్! ఇప్పుడు వాళ్లకి సరిగ్గా బదులిచ్చేవాడొచ్చాడు” ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్…. రావడం రావడమే చాలా స్ట్రాంగ్ గా కొట్టాడు…. వాళ్ళు హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్ళినా…. ఆవులను తోలుకెళ్ళినా…. గంటలలోనే దానికి బదులుకు బదులు చేసి చూపిస్తున్నాడు. తప్పు చేసేవాళ్ళు దొరికినోడ్ని దొరికినట్టు విరగ్గొట్టారు….. బస్…. దందా మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు మొత్తానికి కంట్రోల్ చేశాడు ఆ సన్యాసి. చూస్తూ ఉండండి…. మా యూ‌పీకి ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు” అని గర్వంగా చెప్పాడు.

2017 లో యోగి ముఖ్యమంత్రి కాగానే మా వర్క్ షాప్ మొత్తం ఆనందోత్సాహలతో కేరింతలు కొట్టింది. ఎందుకోగాని…. ఆయన అప్పటికి నాకు తెలియకపోయినా నేను ఆయనకు బాగా కనెక్ట్ అయ్యాను. ఆ ఆనందంలో మా స్టాఫ్ 10 మందికీ ఒక నెల జీతం బోనస్ గా ఇచ్చేశాను.

ఆ యూపీ కుర్రాడికి ఆయన సి‌ఎం అవుతాడనిపిస్తే నాకు 2019 లో అనిపించింది ఏనాటికైనా యోగి భారత ప్రధాని అవుతాడని.
ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఔత్సాహికులు కొందరు హిందీలో ఉన్న ఆ సమాచారాన్ని వివిధ భాషల్లోకి తర్జుమా చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. మొత్తానికి ఆ పోస్టుతో ఒకప్పటి యూపీ పరిస్థితులు, యోగి రాకతో ఏర్పడిన పరిణామాలు, యోగి సత్తా, యూపీ ప్రజలలోనూ, వివిధ రాష్ట్రాల్లోని ప్రజలలోనూ యోగికున్న ఇమేజ్… వీటన్నిటినీ వెల్లడి చేసింది.

Leave a Reply