Suryaa.co.in

Andhra Pradesh

ఎప్పుడైనా నన్ను కలవవచ్చు… పార్టీ పరంగా మీరు నాకు టాప్‌ టీం

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి .జగన్‌

అమరావతి: ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌ పార్టీకి చెందిన ప్రాంతీయన సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే….
– ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉంది.
– పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లుగా మీరు ఓనర్‌షిప్‌ తీసుకోవాలి.
– మీకు అప్పగించిన వివిధ జిల్లాల్లో పార్టీనేతలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీదే.
– ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే.. వాటిని సరిదిద్ది అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి.
– అంతిమంగా మన అభ్యర్థులకు మంచి మెజార్టీలు రావాలి.
– ఆ లక్ష్యంతోనే మీరు సంకల్పంతో పనిచేయాలి.
– పార్టీ సమన్వయ కర్తలుగా మీరు నాతో ఏ విషయాన్నైనా చర్చించండి.
– ఎప్పుడైనా నన్ను కలవవచ్చు. పార్టీ పరంగా మీరు నాకు టాప్‌ టీం.
– సచివాలయ కన్వీనర్ల రూపంలో, గృహసారథుల రూపంలో కింద చక్కటి యంత్రాంగం ఉంది. వాలంటీర్లను వారితో మమేకం చేయాలి.
– ఈ యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేయించడానికి, క్రియాశీలకంగా ఉండడానికి కార్యక్రమాలను నిర్దేశించాం.
– ఆ కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థవంగా ఆయా నియోజకవర్గాల్లో నడిచేలా మీరు పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలు స్వీకరించండి.
– మీరు, నేను, పార్టీ యంత్రాంగం అంతా కలిసి ముందుకుసాగాలి.

LEAVE A RESPONSE