సీఎం జగన్ బందువులమని హల్ చల్

సీఎం జగన్ బందువుమని హల్ చల్

– జిజిహెచ్ వైద్యులపై యువకులు దాడి
– విధులు బహిష్కరించి వైద్యులు ఆందోళన
సీఎం బందవులమంటూ గుంటూరు జిజిహెచ్ అత్యవసర విభాగం లో కొందరు యువకులు హల్ చల్ సృష్టించారు. తమ స్నేహితుడు తలకు గాయం కావడంతో ఆదివారం అర్ధరాత్రి కొందరు యువకులు జిజిహెచ్ కు వచ్చారు. అత్యావసర విభాగం లో ఉన్న జూనియర్ డాక్టర్ లు గాయపడిన యువకుడి ని ప్రాధమిక వైద్యం చేసి ఐదు నిమిషాలు ఆగి కుట్లు వేస్తామని చెప్పాడు. ఇంతలోనే పక్కనే ఉన్న కుర్రాళ్లు జూనియర్ డాక్టర్ లపై దౌర్జన్యానికి దిగారు.
తక్షణమే కుట్లు వేయాలని దాడికి తెగ పడ్డారు. తాము రిపబ్లికన్ పార్టీ కు చెందిన వారి మని , తాము సీఎం జగన్ రెడ్డి కు బందువుల మని గలాటా సృష్టించారు. దీంతో వెంటనే వైద్యం చేసి వారిని పంపించి వేశారు . అనంతరం దాడికి గురైన వైద్య సిబ్బంది జిజిహెచ్ సూపరిండెండెంట్ కు సమాచారం ఇచ్చారు. తనపై దాడి జరిగిన 36 గంట లైన అధికారులు ఎవ్వరూ స్పందించలేదని మెరుపు సమ్మె కు దిగారు. ఉదయం 10 గంటల నుంచి జీజీహెచ్ సూపరిండెండెంట్ కార్యాలయం ఎదుట జూనియర్ డాక్టర్ల ఆందోళనకు దిగారు.
ఓ జూనియర్ డాక్టర్ పై రోగి సహాయకులు దాడి చేశారని చెప్పిన అధికారులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి రోడ్డు పై బైఠాయించారు.దాడి చేసినవారిని తక్షణమే అరెస్టు చేయాలంటూ జీజీహెచ్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
జూనియర్ డాక్టర్ల ఆందోళనతో జీజీహెచ్ లో వైద్య సేవలు నిలిచిపోయాయి. రేపు ఉదయం 9 గంటల లోపు గాడి చేసిన వారిని అరెస్ట్ చేయిస్తానని సూపరిండెండెంట్ ప్రభావతి ఇచ్చిన హామీ మేరకు సాయంత్రం 4 గంటల సమయంలో ఆందోళన విరమించారు. ప్రస్తుతానికి ఆందోళన మాత్రమే విరమించామని , దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తేనే రేపు ఉదయం నుంచి విధులకు హాజరౌతామని జూనియర్ డాక్టర్ లు చెప్పారు. అరెస్టు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.