Suryaa.co.in

Telangana

డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి

– బీఆర్ఎస్ ట్రోల్ చేస్తున్న ఫొటోల్లో తప్పు ఏముందో కేసీఆర్ భార్య శోభమ్మ చెప్పాలి.
– సిగ్గు లజ్జ ఉంటే బట్టలు లేకుండా తిరుగు
– ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్ కి ఉంది.
– ట్రోలింగ్ పై కేటీఆర్, హరీష్ స్పందించాలి
– కేసీఆర్ భార్యకు మంత్రి కొండా సురేఖ సూటి ప్రశ్న

హైదరాబాద్: ఇంచార్జి మినిస్టర్ గా మెదక్ జిల్లాకు వెళ్ళాను. ఎంపీ రఘునందన్ చేనేత సమస్య లు చెప్పి, గౌరవంగా చేనేత మాల నా మెడలో వేశాడు. చేనేత మాల చేసేప్పుడు దాన్ని పరీక్షగా చూశాను. చేనేత వృత్తుల వారికి సంబంధించిన గౌరవప్రదమైన నూలు అది.

నాకు నిద్ర, తిండి లేకుండా చేస్తున్నారు. కొంతమంది పోగై నన్ను ట్రోల్ చేస్తున్నారు. మానసికంగా నన్ను వేధిస్తున్నారు. పద్మశాలి కుటుంబ సభ్యులు చాల ఆవేదనకు గురి అవుతున్నారు. నాకు మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్తే వాళ్ళని కొట్టారు. అధికారం కోల్పోయి పిచ్చిపట్టి దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారు. చెప్పుకోలేని విధంగా ట్రోల్ చేస్తున్నారు.

మొన్నటి వరకు జైలుకు వెళ్లిన మీ చెల్లి విషయంలో నువ్వు బాధ పడలేదా? డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు. కేటీఆర్, హరీష్ ఇంటి ఆడవాళ్లపై ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది? కేటీఆర్ ఖబడ్దార్ ,ఖబడ్దార్ కేసీఆర్. ఈ ట్రోలింగ్ వీడియోలను మీ చెల్లికి, తల్లికి చూపించు.

ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదు. అన్ని పార్టీల వాళ్లు నన్ను అక్కా అని, నా భర్తను బావ అని పిలుస్తారు. ఏదో ఒకరోజు ప్రజలు తిరగబడతారు. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమనపరుస్తారా? మానసిక వేదన కలిగించి కుటుంబాల్లో ఇబ్బంది పెడతారా?

నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్, మహిళకు మంత్రిపదవి ఇవ్వలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ లో భారీ మార్పులు వచ్చాయి. బీఆర్ఎస్ నాయకులు డబ్బు మదం ఎక్కి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. రఘునందన్ కాల్ చేసి క్షమించమని అడిగాడు. అక్కా క్షమించు కాళ్ళు మొక్కుతా అని రఘునందన్ అన్నాడు. సిగ్గు లజ్జ ఉంటే బట్టలు లేకుండా తిరుగు. ఇంకోసారి ఇలా చేస్తే కేటీఆర్ బట్టలు ఊడదీసి పరిగెత్తిస్తాం.

కేసీఆర్ భార్యకు సూటి ప్రశ్న.. బీఆర్ఎస్ నాయకులు ట్రోల్ చేస్తున్న ఫొటోల్లో తప్పు ఏముందో కేసీఆర్ భార్య శోభమ్మ చెప్పాలి. ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్ కి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు. పనులు కావాలంటే నా దగ్గరికి రండి అని గత పాలకులు ఇబ్బంది పెట్టారు. హరీష్ డీపీ పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ హరీష్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి. డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి.

పద్మశాలి బిడ్డను ఇంత అవమానుపరిస్తారా?

– మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ పై పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ సీరియస్

రాష్ట్రంలో ఉన్న పద్మశాలి గుండెలు బాధపడుతున్నాయి. ఉద్యమాలు చేసి మంత్రిగా ఎదిగిన ఒక పద్మశాలి బిడ్డను ఇంత అవమానుపరిస్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీలం కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ ఉంటుందా? కేటీఆర్ స్థానంలో నేను ఉంటే క్షమాపణ చెప్పేవాడిని.

రాజకీయంగా విమర్శ చేయండి. కానీ ఒక బీసీ బిడ్డను ఇంత అవమానపరుస్తారా? కవిత లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయితే కేసు గురించి మాత్రమే మాట్లడినం. మహిళల నాయకులపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ట్రోలింగ్ పై కేటీఆర్, హరీష్ స్పందించాలి. బీఆర్ఎస్ నాయకులు మహిళలకు ఇస్తున్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు మహిళకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్ మహిళలకు గౌరవం ఏం ఇస్తారు

LEAVE A RESPONSE